STOCKS

News


ఈ స్టాక్స్‌లో రెండేళ్లుగా ఫండ్స్‌ కొనుగోళ్లు

Thursday 24th January 2019
Markets_main1548269165.png-23761

గడిచిన రెండేళ్లలో దేశీయ ఇనిస్టిట్యూషన్లు ఈక్విటీల్లో రూ.2లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ వందలాది కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ... కొన్ని స్టాక్స్‌కు మాత్రం ప్రత్యేకత ఉంది. 20 కంపెనీల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు గడిచిన ఎనిమిది త్రైమాసికాల్లో కొనుగోళ్లు చేస్తూనే ఉన్నాయి. 

 

2016 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం నుంచి 2018 డిసెంబర్‌ త్రైమాసికం వరకు గణాంకాలను పరిశీలించినట్టయితే... కనీసం 5 శాతం అంతకంటే ఎక్కువ మేర మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల వాటా ఈ ఎనిమిది కంపెనీల్లో పెరిగింది. కానీ, ఈ మధ్య కాలంలో ఇందులో సగం స్టాక్స్‌ సానుకూల రాబడులను ఇవ్వకపోవడం ఆసక్తికరం. అయినప్పటికీ వీటిల్లో ఫండ్స్‌ సంస్థల పెట్టుబడులు కొనసాగుతూనే ఉన్నాయి. అపోలో టైర్స్‌ కంపెనీలో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలకు గత డిసెంబర్‌ నాటికి 21 శాతం వాటా ఉంది. 2016 డిసెంబర్‌ నాటి నుంచి 14.5 శాతం మేర వాటా పెరిగింది. కానీ, గత ఏడాది కాలంలో అపోలో టైర్స్‌ షేరు 17 శాతం నష్టపోయింది. రెండేళ్లలో చూసుకుంటే ఈ స్టాక్‌ 18 శాతం పెరిగింది.  ఓఈఎంకు డిమాండ్‌ తగ్గడం, యూరోప్‌ వ్యాపారంలో వృద్ధి అవకాశాలు తగ్గడం స్టాక్‌ ధరపై ప్రభావం చూపించింది. ఇటీవలి కరెక్షన్‌ తర్వాత ఈ స్టాక్‌ ఆకర్షణీయమైన వ్యాల్యూషన్ల వద్ద ఉందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అంటోంది. 

 

స్ట్రైడ్స్‌ ఫార్మా షేరు ధర గత ఏడాది కాలంలో 53 శాతం క్షీణించింది. అయినప్పటికీ ఫండ్స్‌ మేనేజర్లు ఈ స్టాక్స్‌ను కొంటూనే ఉన్నారు. 2016 డిసెంబర్‌ నుంచి చూసుకుంటే 11.3 శాతం నుంచి 24.50 శాతానికి మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల వాటా పెరిగింది. నియంత్రిత మార్కెట్లలో కంపెనీకి వ్యాపార అవకాశాలు మెరుగుపడడం వల్ల లాభదాయక పెరుగుతుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. ఈ కారణంతో ఈ స్టాక్‌పై సానుకూలత వ్యక్తం చేసింది. ఏఎన్‌డీఏ ఫైలింగ్స్‌ పెరగడం, కీలకమైన అనుమతులకు అవకాశాలు, ఆస్ట్రేలియా వ్యాపారంలో మార్జిన్లు మెరుగుపడడం సానుకూలతలుగా తెలిపింది. ఇక సిటీ యూనియన్‌ బ్యాంకు, టాటా మెటాలిక్స్‌, నీల్‌కమల్‌, ఎన్‌టీపీసీలోనూ గత రెండేళ్లలో ఫండ్స్‌ వాటా 10 శాతం మేర పెరిగింది. ఇదే కాలంలో సిటీ యూనియన్‌ బ్యాంకు 63 శాతం, టాటా మెటాలిక్స్‌ షేర్లు 73 శాతం పెరగ్గా, ఎన్‌టీపీసీ, నీల్‌కమల్‌ మాత్రం 16 శాతం, 9 శాతం చొప్పున క్షీణించాయి. జీహెచ్‌సీఎల్‌, వేదాంత, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఏఐఏ ఇంజనీరింగ్‌, కజారియా సిరామిక్స్‌, స్టెర్లింగ్‌ టూల్స్‌, అజంతా ఫార్మా, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, ఎస్‌పీ అపారెల్స్‌, టీవీ టుడే నెట్‌వర్క్‌, గ్రేట్‌ ఈస్ట్రర్న్‌ షిప్పింగ్‌, జమ్నా ఆటో ఇండస్ట్రీస్‌, ఎంఆర్‌ఎఫ్‌, ఐటీసీ కంపెనీల్లోనూ ఫండ్స్‌ వాటా గత రెండేళ్లలో పెరగడం గమనార్హం. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు అప్‌

Thursday 24th January 2019

ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 30 పాయింట్లు పెరిగింది. భారత్‌లోని ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై ట్రేడయ్యే ఈ సూచి గురువారం ఉదయం 8.50 గంటలకు 30 పాయింట్ల  పెరుగుదలతో 10,870 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10840 పాయింట్ల వద్ద ముగిసింది గత రాత్రి అమెరికా సూచీలు లాభాలతో ముగియగా,   తాజాగా ఆసియాలో జపాన్‌ మినహా ప్రధాన సూచీలన్నీ స్వల్పలాభాలతో

పెట్టుబడులు ఎక్కడ పెట్టామన్నదే ముఖ్యం!

Thursday 24th January 2019

సూక్ష్మ, స్థూల ఆర్థిక అంశాలు 2018లో అస్థిరతలకు దారితీశాయని, అంతర్జాతీయంగా చమురు ధరలు, వాణిజ్య రక్షణాత్మక విధానాలు, బలమైన డాలర్‌ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలను అయోమయానికి గురి చేసినట్టు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ తెలిపింది. ఇక దేశీయంగా ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రుణ చెల్లింపుల్లో వైఫల్యం, ప్రభుత్వరంగ బ్యాంకు ఎన్‌పీఏలు పెరగడం, బలహీన రూపాయి, రాష్‌ట్రాల ఎన్నికలు మార్కెట్లపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. అయితే, 2019 మాత్రం మంచి ఆశాజనకంగా కనిపిస్తోందని

Most from this category