STOCKS

News


ఈ కంపెనీల ఆదాయాల్లో నిలకడైన వృద్ధి

Thursday 29th November 2018
Markets_main1543431250.png-22459

ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు, గత నాలుగు క్వార్టర్లుగా ఆదాయాల్లో వృద్ధిని నమోదు చేస్తున్న ఈ కంపెనీలపై ఓ సారి దృష్టి సారించొచ్చు. ఆశ్చర్యకరంగా పనితీరును మెరుగుపరుచుకుంటున్న ఈ 12 కంపెనీల్లో కొన్ని ఇప్పటికే మంచి రాబడులను పంచాయి. ప్రతీ త్రైమాసికంలోనూ ఆదాయాలు పెంచుకుంటూ వస్తున్నవి, 20 శాతానికి పైగా లాభాల మార్జిన్‌ను కలిగి ఉన్నవి, రూ.500 కోట్లకు పైగా మార్క్‌ట్‌ విలువ కలిగిన కంపెలు ఇవి. వీటిలో టీసీఎస్‌, ఓఎన్‌జీసీ, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, ఆయిల్‌ ఇండియా, గ్రాఫైట్‌ ఇండియా, హెచ్‌ఈజీ, గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌, క్యాప్లిన్‌ పాయింట్‌ ల్యాబ్‌, నేషనల్‌ పెరాక్సైడ్‌, సాధన నైట్రోకెమ్‌, హెచ్‌ఓఈసీ ఉన్నాయి. 

 

వీటి పనితీరును వివరంగా చూసినట్టయితే... టీసీఎస్‌ ఆదాయం 2017 డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.30,904 కోట్లు ఉంటే, 2018 సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.36,854 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో నికర లాభాల మార్జిన్‌ 21 శాతం నుంచి 22 శాతానికి చేరింది. ఓఎన్‌జీసీ ఆదాయం ఇదే కాలంలో రూ.22,996 కోట్ల నుంచి రూ.27,989 కోట్లకు పెరిగింది. లాభాల మార్జిన్‌ మాత్రం 22 శాతం నుంచి ఏకంగా 30 శాతానికి వృద్ధి చెందింది. ఇక ఐటీసీ ఆదాయం రూ.9,853 కోట్ల నుంచి రూ.11,095 కోట్లకు పెరగ్గా... లాభాల మార్జిన్‌ 31 శాతం నుంచి 26 శాతానికి తగ్గింది. పవర్‌ గ్రిడ్‌ టర్నోవర్‌ రూ.7,507 కోట్ల నుంచి రూ.8,283 కోట్లకు పెరగ్గా, లాభాల మార్జిన్‌ 29 శాతం నుంచి 23 శాతానికి తగ్గింది. ఆయిల్‌ ఇండియా ఆదాయం రూ.2,853 కోట్ల నుంచి రూ.3,744 కోట్లకు వృద్ధి చెందగా, లాభాల మార్జిన్‌ మాత్రం 25 శాతం నుంచి 23 శాతానికి పరిమితమైంది. గ్రాఫైడ్‌ ఇండియా ఆదాయం రూ.933 కోట్ల నుంచి రూ.2,345 కోట్లకు, లాభాల మార్జిన్‌ 36 శాతం నుంచి 47 శాతానికి పెరిగాయి. 

 

హెచ్‌ఈజీ ఆదాయం రూ.843 కోట్ల నుంచి రూ.1,794 కోట్లకు, లాభాల మార్జిన్‌ 41 శాతం నుంచి 50 శాతానికి చేరాయి. గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌ ఆదాయం రూ.350 కోట్ల నుంచి రూ.598 కోట్లకు పెరిగింది. లాభాల మార్జిన్‌ 52 శాతం నుంచి 54 శాతానికి ఎగిసింది. క్యాప్లిన్‌ పాయింట్‌ ల్యాబ్‌ ఆదాయం రూ.142 కోట్ల నుంచి రూ.156 కోట్లకు, లాభాల మార్జిన్‌ 26 శాతం నుంచి 28 శాతానికి విస్తరించాయి. నేషనల్‌ పెరాక్సైడ్‌ ఆదాయం రూ.70 కోట్ల నుంచి 129 కోట్లకు లాభాల మార్జిన్‌ 30 శాతం నుంచి 43 శాతానికి చేరాయి. సాధన నైట్రోకెమ్‌ ఆదాయం రూ.27 కోట్ల నుంచి రూ.84 కోట్లకు లాభాల మార్జిన్‌ 30 శాతం నుంచి 34 శాతానికి వృద్ధి చెందాయి. హెచ్‌ఓఈసీ ఆదాయం రూ.13 కోట్ల నుంచి రూ.64 కోట్లకు పెరగ్గా... లాభాల మార్జిన్‌ 96 శాతం నుంచి 67 శాతానికి తగ్గింది. వీటిలో కొన్ని కంపెనీల ఆదాయం పెరిగినప్పటికీ, లాభాల మార్జిన్‌ తగ్గడం ప్రతికూలంగానే చూడాలి. అయితే, తగ్గడానికి కారణాలు చూసి ఇన్వెస్ట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోవచ్చు. 
 



You may be interested

ఇప్పటికైతే ఈటీఎఫ్‌లు నయం: ధీరేంద్ర కుమార్‌

Thursday 29th November 2018

కొన్ని రకాల ఫండ్స్‌ ప్రాధాన్యం కోల్పోయాయని, ఇవి బెంచ్‌ మార్క్‌తో పోటీ పడలేకపోతున్నాయని వ్యాల్యూ రీసెర్చ్‌ సం‍స్థ సీఈవో ధీరేంద్ర కుమార్‌ అన్నారు. ఈ ఫండ్స్‌ వ్యయాలు అధిక స్థాయిల్లో ఉండడమే కారణమన్నారు. వీటికంటే ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు) మెరుగైనవన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడుల్లో వచ్చిన మార్పులపై ఆయన ఓ వార్తా సంస్థతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ సిప్‌ రాబడులను

ప్రతి 5 కంపెనీలలో 2 క్రియారహితం..

Wednesday 28th November 2018

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ)లో నమోదైన కంపెనీలలో ఏకంగా 6.94 లక్షల సంస్థలు ఇన్‌యాక్టీవ్‌ (క్రియారహితం)గా ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది అక్టోబరు 31నాటికి దేశంలో 18.10 లక్షల కంపెనీలు ఆర్‌ఓసీలో నమోదు కాగా.. వీటిలో కేవలం 11.16 లక్షల కంపెనీలు మాత్రమే సవ్యంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ సమాచారం ద్వారా వెల్లడైంది. అంటే ప్రతి 5 కంపెనీలలో 3 మాత్రమే వ్యాపారం కొనసాగిస్తుండగా.. 2 కంపెనీలు క్రియారహితం ఉన్నట్లు లెక్క

Most from this category