STOCKS

News


35% వరకు రాబడికి 5 సిఫార్సులు

Wednesday 28th November 2018
Markets_main1543393017.png-22451

ముంబై: ఫండమెంటల్స్‌ పరంగా బలంగా ఉన్నటువంటి ఐదు షేర్లను పలు బ్రోకింగ్‌ సంస్థలు సూచిస్తున్నాయి. ఈ షేర్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా 35 శాతం వరకు రాబడిని పొందవచ్చని సిఫార్సుచేస్తున్నాయి.

ఆటోమోటివ్ యాక్సిల్స్ | సిఫార్సు : కొనొచ్చు | ప్రస్తుత ధర రూ.1,415 | టార్గెట్ : రూ.1,838 | రాబడి అంచనా: 30 శాతం
మధ్యస్థ, భారీ వాణిజ్య వాహన విడిభాగాల ఉత్పత్తిలో ఉన్నటువంటి ఆటోమోటివ్ యాక్సిల్స్.. దేశీ మార్కెట్‌లో ఈ విభాగంలో 30 శాతం వాటాను కలిగిఉంది. వస్తు సేవల పన్ను అమలు అనంతరం మల్టీ యాక్సిల్స్‌ వాహనాలకు గిరాకీ పెరిగి ఈ సంస్థకు ప్రయోజనం చేకూరుతోందని యాక్సిస్ డైరెక్ట్ వివరించింది.

న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ | సిఫార్సు: యాడ్‌ | ప్రస్తుత ధర రూ.315 | టార్గెట్: రూ.340 | రాబడి అంచనా: 8 శాతం
ఈ షేరును ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సిఫార్సుచేస్తోంది. లోకోడ్‌ అప్లికేషన్‌ విభాగంలో ఐబీఎం, ఓపెన్‌టెక్ట్స్‌ వంటి అంతర్జాతీయ సంస్థకు పోటీనిస్తోంది. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం), ఎంటర్‌ప్రైజ్ కంటెంట్ మేనేజ్‌మెంట్ (ఈసీఎం), కస్టమర్ కమ్యూనికేషన్స్ మేనేజ్‌మెంట్ (సీసీఎం) విభాగాలలో 22.5 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ అవకాశం ఉండడం వంటి కీలక అంశాలను బేరీజువేసుకుని ఈ కంపెనీ షేరును సిఫార్సుచేసినట్లు తెలిపింది. 

ఇండియన్ హోటల్స్ | సిఫార్సు : కొనొచ్చు | ప్రస్తుత ధర రూ.137 | టార్గెట్: రూ.163 | రాబడి అంచనా: 19 శాతం
తాజ్, వివాంటా, సెలక్షన్స్, జింజర్‌ బ్రాండ్లతో దేశంలోనే రెండవ అతిపెద్ద సంస్థగా ఉన్నటువంటి ఇండియన్‌ హోటల్స్‌ షేరును కొనుగోలు చేయవచ్చని మోతిలాల్ ఓస్వాల్ సిఫార్సుచేసింది. హోటల్‌ పరిశ్రమ ఆక్యుపెన్సీ 67 శాతానికి చేరుకుని తగిన స్థాయిలో ఉందని విశ్లేషించింది. 17,145 గదులతో.. ఈరంగంలోనే ఆకర్షణీయ వృద్ధిరేటును సాధించగలదని భావిస్తోంది. 2018-20 ఆర్థిక సంవత్సరాలలో అంచనా ఆదాయం 9 శాతం, ఎబిటిడా 25 చొప్పున చక్రగతి వృద్ధిరేటును సాధిస్తుందని అంచనా.

బజాజ్ ఫైనాన్స్ | సిఫార్సు : కొనొచ్చు | ప్రస్తుత ధర రూ.2,392 | టార్గెట్: రూ.3,000 | రాబడి అంచనా: 25 శాతం
ఈ షేరును హెచ్‌డీఎఫ్‌సీ సిఫార్సుచేస్తోంది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్ఎస్‌ఐ) విభాగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా విశ్లేషించింది. 

ఎన్‌టీపీసీ | సిఫార్సు : కొనొచ్చు | ప్రస్తుత ధర రూ.144 | టార్గెట్: రూ.195 | రాబడి అంచనా: 35 శాతం
ఈ షేరును ఏంజెల్ బ్రోకింగ్ సిఫార్సుచేస్తోంది. దేశీయ విద్యుత్‌ రంగంలో అతిపెద్ద పవర్‌ యుటిలిటీ సంస్థగా ఉన్నటువంటి ఈ కంపెనీ.. విద్యుత్ ఉత్పత్తిలో 24 శాతం మార్కెట్‌ వాటాను, స్థాపన సామర్థ్యం పరంగా 16 శాతం వాటాను కలిగిఉన్నట్లు వివరించింది. దీర్ఘకాలిక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్‌ను కలిగిన ఈ సంస్థ ప్రైవేట్‌ రంగానికి సైతం పోటీనిస్తున్నట్లు విశ్లేషించింది. 

ఇవి కేవలం విశ్లేషకులు అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.



You may be interested

నిఫ్టీ కీలక నిరోధస్థాయి 10740-10750..!

Wednesday 28th November 2018

ముంబై: నిఫ్టీ 200-రోజుల సాధారణ సగటు కదిలికల స్థాయి 10,753 పాయింట్ల వద్ద ఉండగా.. ఈ స్థాయిని అధిగమించిన పక్షంలో 10,850-10,980 పాయింట్ల వరకు ర్యాలీ కొనసాగుతుందని ఎస్ సెక్యూరిటీస్ (ఇండియా) లిమిటెడ్‌ టెక్నికల్ అనలిస్ట్ ఆదిత్య అగర్వాలా విశ్లేషించారు. బుధవారం ఉదయం సెషన్లో సూచీ 10,742 పాయింట్లను చేరుకోగా.. ఈ స్థాయి 50-డబ్ల్యూఎంఏ (వీక్లీ మూవింగ్‌ యావరేజ్‌) అని.. ఈ సగటు ప్రకారం, 10740-10750 స్థాయిని సూచీ అధిగమించలేపోతే

డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకి కోల్‌ ఇండియా

Wednesday 28th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోల్‌ ఇండియా డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వ్యవస్థకు మారుతోంది. ఇందుకోసం టెక్నాలజీ కంపెనీ టెక్‌ మహీంద్రాతో రూ.270 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. తొలిదశలో ఇంటిగ్రేటెడ్‌ ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, తమ అనుబంధ సంస్థలన్నింటినీ ప్రధాన కేంద్ర టెక్నాలజీ సెంటర్‌తో అనుసంధానిస్తామని కోల్‌ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

Most from this category