STOCKS

News


ఇన్వెస్టర్ల పెట్టుబడులను హరించేసిన స్టాక్స్‌

Sunday 18th November 2018
Markets_main1542563749.png-22152

ఇన్వెస్టర్లు రాబడుల కాంక్షతో స్టాక్‌ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేయడానికి మొగ్గుచూపుతుంటారు. ఒక్కసారి పెట్టుబడి పెట్టిన తర్వాత కంపెనీ పనితీరుపై నిత్యం కన్నేసి ఉంచి, అవసరమైతే వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే రాబడులకు, పెట్టుబడి రక్షణకు అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. లేదంటే ఇన్వెస్టర్లు నిండా నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కుబేరులను చేసిన షేర్లే కాదు... నిండా ముంచేసినవీ కూడా స్టాక్‌ మార్కెట్లో ఉన్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువను హరించిన టాప్‌ 10 కంపెనీల్లో ఆరు ప్రభుత్వరంగ సంస్థలే ఉండడం గమనార్హం.

 

ప్రభుత్వరంగ సంస్థల్లో ఇన్వెస్టర్లను నష్టాల పాలు చేసిన వాటిల్లో ఓఎన్‌జీసీ ముందుంది. ఈ స్టాక్‌లో ఇన్వెస్టర్లు గడిచిన ఐదేళ్ల కాలంలో రూ.38,400 కోట్ల మేర నష్టపోయినట్టు ‘మోతీలాల్‌ ఓస్వాల్‌ 23వ వెల్త్‌ క్రియేషన్‌’ నివేదిక తెలియజేసింది. ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, బీహెచ్‌ఈఎల్‌, ఎంఎంటీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా టాప్‌ టెన్‌లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.18,000 కోట్ల మేర, కోల్‌ ఇండియా 15,600 కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టేశాయి. ఐడియా సెల్యులర్‌ రూ.15,100 కోట్లు, పీఎన్‌బీ రూ.14,600 కోట్ల చొప్పున గత ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చాయి., ఎంఎంటీసీ, ఐడీఎఫ్‌సీ, వోకార్డ్‌, బీహెచ్‌ఈఎల్‌, జిందాల్‌ స్టీల్‌ టాప్‌-10లో మిగిలిన కంపెనీలు.

 

నిపుణుల సూచనల ప్రకారం... సైక్లికల్‌ స్టాక్స్‌కు దూరంగా ఉండడం మంచిది. పెట్టుబడిని హరించే వాటిల్లో ఎక్కువగా ఇవే ఉంటుంటాయి. ‘‘గత అధ్యయనాల్లో సంపదను హరించేసిన వాటిల్లో సైక్లికల్‌ స్టాక్స్‌ ఎక్కువగా ఉన్నాయి. మెటల్స్‌/మైనింగ్‌, కన్‌స్ట్రక్షన్‌, రియల్‌ ఎస్టేట్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ తదితరమైనవి సైక్లికల్‌ రంగాలకు చెందినవి. ఈ రంగాలకు చెందిన స్టాక్స్‌ ఏదో ఒక రోజు సంపదను తెచ్చిపెడతాయి. కానీ, వీటిల్లోకి ఎప్పుడు ప్రవేశించాం, ఎప్పుడు వైదొలిగాం అన్నది కీలకం. ఇది తెలుసుకోవడం కష్టం కనుక ఈ స్టాక్స్‌కు దూరంగా ఉండడం మంచిది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ నివేదిక తెలిపింది. అయితే, అంతకుముందు నివేదికలతో పోలిస్తే గత రెండు అధ్యయనాల్లో ఇన్వెస్టర్లను నష్టాలపాలు చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. 



You may be interested

జీవన్‌శాంతి, ఎన్‌పీఎస్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌.. ఏది మెరుగు?

Sunday 18th November 2018

రిటైర్మెంట్‌కు ఏ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకుంటే మెరుగైన రాబడులు వస్తాయన్నది మన దేశంలో ఎక్కువ మందికి ఉండే సందేహం. ప్రైవేటు రంగంలోని వారికి ఎన్‌పీఎస్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, బీమా పెన్షన్‌ పథకాలు ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంలో ఓ ఇన్వెస్టర్‌ ప్రశ్నకు ఫిన్‌ఫిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అనలటిక్స్‌ వ్యవస్థాపకుడు ప్రబ్లీన్‌ బాజ్‌పాయి సమాధానం ఇచ్చారు.    వయసు 31 ఏళ్లు. రూ.15 లక్షలను 55వ ఏట వచ్చే వరకు ఇన్వెస్ట్‌ చేస్తాను.

ఎస్‌బీఐ, రిలయన్స్‌ షేర్లను చూడొచ్చు..!

Saturday 17th November 2018

మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్‌ ప్రెసిడెంట్‌ యోగేష్ మెహతా సిఫార్సు ముంబై: గడిచిన 15 రోజుల్లో నిఫ్టీ 4-5 శాతం మేర లాభపడగా.. ఇంత తక్కువ సమయంలో మార్కెట్‌ రికవరీ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదని యోగేష్ మెహతా అన్నారు. ఆ సమయంలో ముడిచమురు ధరలు గరిష్టస్థాయిల వద్ద ఉండడం వల్ల ఈమేర రికవరీ ఉంటుందని ఎవరూ భావించలేదని వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం ముడిచమురు ధరలు భారీగా పతనమై భారత ఆర్థిక

Most from this category