STOCKS

News


ఎన్‌బీఎఫ్‌సీ స్టాకుల్లో ఎక్కువ ఎక్స్‌పోజర్‌ ఉన్న ఎంఎఫ్‌లు ఇవే!

Monday 24th September 2018
Markets_main1537780629.png-20526

శుక్రవారం ఉన్నట్లుండి హెచ్‌ఎఫ్‌సీ, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల షేర్లు కుప్పకూలడం జరిగింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన బాండ్స్‌ను డీఎస్‌పీ ఎంఎఫ్‌ విక్రయించిందన్న వార్తలు మార్కెట్లో విపరీతమైన సెల్లింగ్‌ను సృష్టించాయి. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం బయటపడ్డ సమయంలో ఈ వార్తలు మార్కెట్లో లిక్విడిటీపై మరింత భయాందోళనలు పెంచాయి. ఇవన్నీ కలిసి ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో అమ్మకాల జోరు పెంచాయి. వడ్డీరేట్ల పెంపుదల ఎన్‌బీఎఫ్‌సీల వ్యాపారంపై ప్రభావం చూపుతుందన్న భయాలు, మార్కెట్లో నిధుల సమీకరణ కష్టంగా మారుతుందన్న వార్తలు ఈ కంపెనీలను మరింత కుంగదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీల్లో ఎక్కువ పెట్టుబడులున్న ఎంఎఫ్‌లకు దూరంగా ఉండడం మంచిదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు భయపడాల్సిన పనిలేదని ఎక్కువమంది భరోసా ఇస్తున్నా.. వీలయితే ఈ కంపెనీల షేర్లలో పెట్టుబడులున్న ఎంఎఫ్‌ల్లో వాటాలను విక్రయించి ఇతర నాణ్యమైన ఎంఎఫ్‌ స్కీములను ఎంచుకోవాలని కొంతమంది నిపుణులు సలహా ఇస్తున్నారు. మొత్తం వాటాలు అమ్ముకోకున్నా, కొంత మేర ఇలాంటి ఎంఎఫ్‌ల్లో వాటాలను తగ్గించుకోవడం మంచిదని ఎక్కువమంది సలహా. ఇలాంటి సంక్షోభ సమయంలో ఐటీ, ఫార్మా రంగాలపై ఫోకస్‌ ఉన్న ఎంఎఫ్‌లు కొంతవరకు బెటరని నిపుణుల అంచనా. 
ఎన్‌బీఎఫ్‌సీల్లో వాటాలున్న ఎంఎఫ్‌ల వివరాలు...



You may be interested

ఈక్విటీకి దూరంగా ఉండండి!

Monday 24th September 2018

మార్కెట్‌ ప్రస్తుత పరిస్థితుల్లో ఈక్విటీ వాటా పెంచుకోవడం మంచిది కాదంటున్నారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ సీఐవో ఎస్‌.నరేన్‌. మార్కెట్లు ఇప్పటికీ చౌకగా లేవని తెలిపారు. స్మాల్‌క్యాప్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇంకా సమయముందని, ఇవి ఇంకా ఖరీదుగానే ఉన్నాయని పేర్కొన్నారు. అతి స్వల్పకాలిక డెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలకు ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌ విషయంలో దీర్ఘకాలంలో పాజిటివ్‌గా ఉన్నామని నరేన్‌

220 షేర్లు - 52-వారాల కనిష్టానికి...

Monday 24th September 2018

ముంబై:- మార్కెట్‌ పతనం గంట గంటకు పెరుగుతోంది. మిడ్‌సెషన్‌ సమయానికి సెన్సెక్స్‌ 550 పాయింట్ల నష్టంతో 36,341 వద్ద, నిఫ్టీ 185 పాయింట్ల నష్టంతో 10955 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల, దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఎఫ్‌ఐఐల నిధుల ఉపసంహరణ, ఎన్‌బీఎఫ్‌సీ డెట్‌ సంక్షోభం, డాలర మారకంలో రూపాయి విలువ బలహీనపడటం...  తదితర కారణాలు సూచీల పతననానికి కారణవుతున్నాయి. మార్కెట్లో జరుగుతున్న అమ్మకాల

Most from this category