STOCKS

News


క్యూ2 లాభం 100%పైగా పెరిగిన కంపెనీలివే...

Tuesday 13th November 2018
Markets_main1542103130.png-21956

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికపు ఎర్నింగ్స్‌ సీజన్‌ చివరి దశకు చేరుకుంది. నిఫ్టీ-50లో 46 కంపెనీలు, సెన్సెక్స్‌ 30 కంపెనీల్లో 27 ఇప్పటికే ఫలితాలను ప్రకటించాయి. ఎన్‌ఎస్‌ఈలో ఇప్పటి దాకా 1,100 కంపెనీలు క్యూ2 ఫలితాలను వెల్లడించాయి. ఇందులో 92 కంపెనీల నికర లాభం వార్షిక ప్రాతిపదికన 100 శాతానికిపైగా ఎగసింది. 
గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ లాభం ఏకంగా 97 రెట్లు (9,000 శాతానికి పైగా) పెరిగింది. డీఎల్‌ఎఫ్‌, ఓరియెంటల్‌ హోటల్స్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, ఈఐహెచ్‌చ రెస్పాన్సివ్‌ ఇండస్ట్రీస్‌, బిర్లా కార్పొరేషన్‌ లాభం 10-25 రెట్లు శ్రేణిలో (1,000-2,500 శాతం) ఎగసింది. ఇందులో ఒక్క ఓరియెంటల్‌ హోటల్స్‌ను మినహాయిస్తే మిగతా కంపెనీల నికర విక్రయాలు 10-35 శాతం శ్రేణిలో పెరిగాయి. 

గ్రాఫైట్‌ ఇండియా, ఆన్‌మొబైల్‌ గ్లోబల్‌, ఆప్టో సర్క్యూట్స్‌, జీ మీడియా కార్పొరేషన్‌, కోల్‌ ఇండియా, హెచ్‌ఈజీ, హిందుస్తాన్‌ ఆయిల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌, ఇంటర్నేషనల్‌ పేపర్‌, జేఎస్‌డబ్ల్యూ హోల్డింగ్స్‌, పంజాబ్‌ కెమికల్స్‌, బీజీఆర్‌ ఎనర్జీ నికర లాభం 500-981 శాతం శ్రేణిలో పెరిగింది. కోల్‌ ఇండియా, హెచ్‌ఈజీ, గ్రాఫైట్‌ ఇండియా నికర విక్రయాలు రెట్టింపు అయ్యాయి. 

బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌.. కోల్‌ ఇండియాకు బై రేటింగ్‌ ఇచ్చింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.358గా నిర్ణయించింది. గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ జెఫెరీస్‌.. గ్రాఫైట్‌ ఇండియా, హెచ్‌ఈజీ స్టాక్స్‌పై బుల్లిష్‌గా ఉంది. గ్రాఫైట్‌ ఇండియాను రూ.1,450 టార్గెట్‌ ప్రైస్‌తో, హెచ్‌ఈజీని రూ.5,500 టార్గెట్‌ ప్రైస్‌తోనూ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. 

పంజాబ్‌ అల్కలీస్‌, ఇమామి రియల్టీ, గుజరాత్‌ బోరోసిల్‌, బయోకాన్‌, టిటాఘర్‌ వ్యాగన్స్‌, హెచ్‌ఎంటీ, నవభారత్‌ వెంచర్స్‌, నెల్కో, మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌, జేకే టైర్‌, జువారి గ్లోబల్‌, అశోక బిల్డ్‌కాన్‌, ఒబెరియో రియల్టీ, ఎంఎంటీసీ, ధనలక్ష్మీ బ్యాంక్‌ వంటి పలు సంస్థల నికర లాభం 100 శాతానికిపైగా పెరిగింది. 

నిఫ్టీ కంపెనీల్లో కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నికర లాభం 100 శాతానికిపైగా పెరిగింది. కోల్‌ ఇండియా లాభం 732 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లాభం 153 శాతం ఎగసింది. ఇక యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం 82 శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ లాభం 70 శాతం, ఓఎన్‌జీసీ లాభం 61 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ లాభం 24 శాతం, టీసీఎస్‌ లాభం 23 శాతం, ఎల్‌అండ్‌టీ లాభం 22 శాతం పెరిగింది. అయితే టాటా మోటార్స్‌ రూ.1,048 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, వేదాంత కంపెనీల నికర లాభం క్షీణించింది. 

గమనిక: కనీసం రూ.200 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కలిగిన కంపెనీలను లెక్కలోకి తీసుకున్నాం. 



You may be interested

యునైటెడ్‌ బ్యాంక్‌ నష్టాలు పెరిగాయ్‌..

Tuesday 13th November 2018

యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.883 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.344 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జూన్‌ త్రైమాసికంలోనూ రూ.388 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ2లో 17 శాతం వృద్ధితో రూ.376 కోట్ల

నెలరోజుల కోసం 5 సిఫార్సులు

Tuesday 13th November 2018

ముంబై: 10,600 స్థాయిలో బలమైన నిరోధాన్ని ఎదుర్కొటున్న నిఫ్టీ ఈ స్థాయి ఎగువన నిలవలేకపోతుందని, ఈ సూచీ తక్షణ మద్దతు 10,440 వద్ద ఉందని సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ ఆశిష్‌ చతుర్‌మెహతా అన్నారు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 10,260 పాయింట్ల వద్ద.. ఆ తరువాత మద్దతు 10,030 దగ్గర ఉన్నట్లు విశ్లేషించారు. 10,600 స్థాయిని అధిగమించిన పక్షంలో 10750-10850 స్థాయిలో నిరోధం ఎదురవుతుందన్నారు.

Most from this category