STOCKS

News


నిపుణులు మెచ్చిన 9 స్టాక్స్‌!

Friday 24th May 2019
Markets_main1558694124.png-25920

కొత్త ప్రభుత్వ హయంలో పీఎస్‌బీ, ఎఫ్‌ఎంసీజీ, సిమెంట్‌, రోడ్డు మరియు నిర్మాణ రంగాలు మంచి జోరు చూపుతాయని ఎకనమిక్‌ టైమ్స్‌ నిపుణుల బృందం అభిప్రాయపడింది. కీలకమైన ఈ రంగాలపై ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ పెడుతుందని తెలిపింది. ఎఫ్‌ఎంసీజీల్లో గ్రామీణ వినిమయంపై ఫోకస్‌ పెట్టిన కంపెనీలకు మరింత లబ్ది ఉంటుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం 30వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి పచ్చజండా ఊపింది. 2014తో పోలిస్తే ఇది దాదాపు 6 రెట్లు అధికం. అప్పటితో పోలిస్తే ప్రాజెక్టుల ఎగ్జిక్యూషన్‌ బాగా పెరిగింది. 2014లో రోజుకు 11.7 కిలోమీటర్ల రోడ్ల నిర్మితి వేగం ఉండగా 2018-19 నాటికి ఈ వేగం రోజుకు 27 కిలోమీటర్లకు పెరిగింది. కొత్త ప్రభుత్వ హయంలో ఇకపై ఈ నిర్మాణాలు మరింత పెరగవచ్చని నిపుణుల బృందం పేర్కొంది. దీంతో పలు కంపెనీల ఆర్డర్‌ బుక్స్‌, ఎగ్జిక్యూషన్‌ మెరుగవుతాయని అభిప్రాయపడింది. ఈ రహదారుల నిర్మాణంతో గ్రామీణ ఎకానమీలో కనెక్టివిటీ పెరిగి విపరీతమైన డిమాండ్‌ పెరుగుదలకు ఆస్కారముందని తెలిపింది. దీనివల్ల సిమెంట్స్‌, రోడ్లు, నిర్మాణాలు, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు మంచి ప్రయోజనం ఉంటుందని తెలిపింది. ఈ రంగాల్లోని కంపెనీలు తాజా క్యు4లో ఎర్నింగ్స్‌ రికవరీ సంకేతాలు చూపాయని, రాబోయే రోజుల్లో ఈ కంపెనీల ఎర్నింగ్స్‌ మరింత మెరుగవుతాయని తెలిపింది. 


ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వం విధానాలతో లబ్ది పొందే తొమ్మిది కంపెనీలను ఈటీ నిపుణుల బృందం ఎంపిక చేసింది. దిలీప్‌ బుల్డ్‌కాన్‌, శ్రీసిమెంట్‌, అశోకా బుల్డ్‌కాన్‌, సద్భావ్‌ ఇంజనీరింగ్‌, అల్ట్రాటెక్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, డాబర్‌ ఇండియా షేర్లను రికమండ్‌ చేసింది.

ఈ కంపెనీల విక్రయాల వివరాలు, ఈపీఎస్‌ వివరాలు పైన పట్టికలో ఉన్నాయి. 



You may be interested

సెన్సెక్స్‌ 623 పాయింట్లు జంప్‌

Friday 24th May 2019

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తిరిగి అధికారం చేపట్టడంతో జూన్‌ తొలివారంలో జరిగే రిజర్వుబ్యాంక్‌ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలకు అనుగుణంగా సూచీలు శుక్రవారం భారీ లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 623 పాయింట్లు పెరిగి 39,434.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 187 పాయింట్లు లాభపడి 11,844.10 వద్ద స్థిరపడింది. అన్ని రంగాల్లో చెప్పుకోదగిన కొనుగోళ్లతో ట్రేడింగ్‌ ఆద్యంతం ఆయా ఆయా రంగాల షేర్ల ర్యాలీ కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు

మూడింటిపై కొత్త ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్‌

Friday 24th May 2019

జీఎస్‌టీ, పన్నులు, బ్యాంకులే కీలకం నిపుణుల అంచనా ఎన్‌డీఏ ప్రభుత్వం మరోమారు ఏర్పడనుంది. ఈ దఫా ఐదేళ్లలో ఎన్‌డీఏ ప్రభుత్వం పన్ను కోతలు, జీఎస్‌టీ పునర్‌వ్యవస్థీకరణ, బ్యాంకు సంస్కరణలపై ఎక్కువ శ్రద్ధ పెడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.   ఒకపక్క ఎకానమీ మందగిస్తోంది, డిమాండ్‌ క్షీణిస్తోంది, సాగు రంగం సంక్షోభంలో ఉంది, లిక్విడిటీ కొరత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో తొలి వంద రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు ప్రకటిస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Most from this category