STOCKS

News


ఈ ఆరు కంపెనీలు మల్టీబ్యాగర్లు...!?

Friday 25th January 2019
Markets_main1548355953.png-23788

నేడు చిన్నగా ఉన్న కంపెనీలే... రేపు లార్జ్‌క్యాప్‌, బ్లూచిప్‌ కంపెనీలుగా అవతరిస్తాయి. చిన్నగా ఉన్నాయని అన్నింటికీ దూరంగా ఉండడం కూడా తెలివైన నిర్ణయం కాకపోవచ్చు. ఇందుకు ఉదాహరణ మారికో కంపెనీయే. శిరోజాల నూనెల మార్కెట్లో చిన్న కంపెనీగా మొదలు పెట్టి మార్కెట్‌ లీడర్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. ‘‘మంచి యాజమాన్యాలు చిన్న అవకాశాలను సైతం పెద్దవిగా మలుచుకుంటాయి. సమర్థవంతమైన చిన్న కంపెనీలు పెద్దగా అవతరించగలవు’’ అని ఎలారా సెక్యూరిటీస్‌ ఎండీ హరేంద్ర కుమార్‌ తెలిపారు. ‘‘మంచి యజమాన్యం కలిగిన చిన్న, మధ్య స్థాయి కంపెనీలు కొన్ని ఉన్నాయి. ఈ కంపెనీలకు బలమైన బ్యాలన్స్‌ షీట్లు, నగదు ప్రవాహాలు ఉన్నాయి. అలాగే, సమర్థవంతమైన మూలధన నిధుల వినియోగం, అధిక రాబడుల నిష్పత్తి ఉండడంతోపాటు అవి కొన్నేళ్ల కనిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఈ కంపెనీల్లో పెట్టుబడులకు భద్రతా అవకాశాలు ఎక్కువగా ఉన్నా‍యి. వీటిల్లో కొన్ని మల్టీబ్యాగర్లు కూడా కాగలవు’’ అని ప్రభుదాస్‌ లీలాధర్‌ పీఎంఎస్‌ సీఈవో అజయ్‌బోడ్కే తెలిపారు. ఆ కంపెనీల వివరాలే ఇవి...

 

ఎస్‌ చాంద్‌ అండ్‌ కంపెనీ
విద్యా సంబంధిత పుస్తకాల మార్కెట్లో ఈ కంపెనీ వాటా 12-13 శాతం. అన్ని స్థాయిల విద్యార్థులకు అవసరమైన పుస్తకాల ముద్రణలో కంపెనీ ఉంది. ప్రారంభ స్థాయి, స్కూళ్ల నుంచి 12వ తరగతి విద్యార్థులకు పుస్తకాలను రూపొందిస్తుంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పుస్తకాల మార్కెట్లో బలంగా ఉంది. రాష్ట్రాల బోర్డుల పుస్తకాల్లోనూ మార్కెట్‌ను పెంచుకోవడంపై దృష్టి సారించింది. పుస్తకాల ముద్రణలో 80 ఏళ్ల నుంచి ఈ కంపెనీ ప్రముఖ సంస్థగా ఉంది. 2,400 మంది రచయితలతో అనుబంధం ప్రత్యేక ఆస్తి అని చెప్పొచ్చు. బ్రాండ్‌ విలువ, పూర్వీకుల నుంచి సంక్రమించిన మేనేజ్‌మెంట్‌ వారసత్వం... కంపెనీ బలాలుగా అజయ్‌ బోడ్కే తెలిపారు. డిజిటల్‌పైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది.


లాఒపాలా ఆర్‌జీ
ఒపాలావేర్‌ క్రోకరీలో ప్రముఖ సంస్థ. ఈ మార్కెట్లో ఎన్నో దశాబ్దాల క్రితం నుంచీ ఉన్న సంస్థ. ఇటీవలే పలు ఇతర కంపెనీలు కూడా ఈ మార్కెట్లోకి ప్రవేశించాయి. దేశంలో మధ్య తరగతి ప్రజలు పెరుగుతుండడంతో ఒపాలావేర్‌ క్రోకరీ వినియోగం పెరిగేందుకు అవకాశం ఉంది. స్టీల్‌ ఉత్పత్తులను మైక్రోవేవ్‌ ఓవెన్లలో వినియోగించలేని పరిస్థితి. ప్లాస్టిక్‌, మెలానిన్‌ ఉత్పత్తుల విషయంలో ఆరోగ్యపరమైన ఆందోళనలు ఉన్నాయి. ఈ అంశాలు ఒపాలావేర్‌కు ప్రత్యేక బలం. ఇదొక రకమైన సిరామిక్‌ ఉత్పత్తి. చైనా క్లే లేదా పోర్సెలానిన్‌ ఉత్పత్తుల కంటే బలమైనది, తక్కువ బరువు ఉండేది కావడంతో వినియోగదారులకు ఓ ఎంపిక కాగలదు. ఈ కంపెనీ తన సామర్థ్యాన్ని 2020-21 నాటికి 71 శాతానికి పెంచుకోనుంది. ఈ కొత్త సామర్థ్యం దివా బ్రాండ్‌పై ప్రీమియం ఉత్పత్తుల కోసం ఉద్దేశించినది. కనుక కంపెనీ మార్జిన్లు పెరిగే అవకాశం ఉంది. 

 

ఎస్‌హెచ్‌ కేల్కర్‌ అండ్‌ కంపెనీ
ఫ్రాగ్రాన్స్‌, ఫ్లావర్లలో దేశ మార్కెట్‌ లీడర్‌ ఈ కంపెనీయే. ఈ కంపెనీకి ప్రధానంగా పోటీనిచ్చేవి విదేశీ కంపెనీలే. ప్రీమియం ఫ్రాగ్రాన్స్‌, ఫ్లావర్ల మార్కెట్లో వృద్ధితో ఎక్కువగా ప్రయోజనం ఈ కంపెనీకే లభిస్తుంది. ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఈ సంస్థ ఖాతాదారులుగా ఉన్నాయి. పతంజలి, హల్దీరామ్‌, హిమాలయ తదితర కంపెనీలను కొత్తగా క్లయింట్లను చేసుకుంది. ఇటీవలి కరెక్షన్‌తో ఆక‌ర్షణీయ స్థాయిలకు వచ్చింది. సరఫరా సమస్యల్లేకుండా చూసుకునేందుకు చైనాకు చెందిన ఆరోమా ముడిపదార్థాల కంపెనీ అన్హూ రూబంగ్‌ ఆరోమా కంపెనీని కొనుగోలు చేసింది. 

 

సెక్యూరిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీసెస్‌ (ఎస్‌ఐఎస్‌)
కంపెనీలకు భద్రతా సేవలను అందించడం అన్నది మన దేశంలో ఎక్కువగా అవ్యవస్థీకృత రంగంలోనే ఉంది. మరి ఈ రంగంలో కార్పొరేట్‌ సేవల పరంగా ప్రముఖ కంపెనీ ఇదే. వ్యవస్థీకత భద్రతా సేవల రంగం వాటా ఏటా 16-18 శాతం పెరుగుతోంది. ఈ వృద్ధిని ఎస్‌ఐఎస్‌ అందుకోగలదని విశ్లేషకుల అంచనా. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు, బలమైన బ్రాండ్‌, ఆర్థిక బలాలు ఇవన్నీ ఈ కంపెనీని పైచేయిగా నిలుపుతాయని విశ్లేషణ. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. వచ్చే ఒకటి రెండేళ్లలో దేశ సెక్యూరిటీ సేవల మార్కెట్లో 5 శాతం వాటా సాధించాలన్న లక్ష్యంతో ఉంది. అంతర్జాతీయంగానూ ఈ విభాగంలో సంస్థకు అనుభవం ఉంది. ఆస్ట్రేలియా మార్కెట్లోనూ బలమైన కంపెనీగా కొనసాగుతోంది. 

 

పీటీసీ ఇండియా
పవర్‌ ట్రేడింగ్‌ విభాగంలో లీడర్‌. ఎక్కువ సంఖ్యలో స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థల కారణంగా పవర్‌ ట్రేడింగ్‌కు మార్కెట్‌ కూడా పెరుగుతోంది. ఇది పీటీసీ వంటి కంపెనీలకు ప్రయోజం కలిగించేది. పైగా పలు రెన్యువబుల్‌ విద్యుత్‌ కంపెనీలు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. వీటి ఉత్పత్తి సామర్థ్యాలు చిన్నవి కావడంతో ఇవి తమ ఉత్పత్తి విక్రయానికి పవర్‌ ట్రేడింగ్‌ కంపెనీలపై ఆధారపడక తప్పదు. పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ద్వారా రుణాల వ్యాపారం, పీటీసీ ఎనర్జీ ద్వారా విద్యుత్‌ రంగంలోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మంచి డివిడెండ్‌ పంపిణీ కూడా అదనపు ఆకర్షణ.

 

మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌
కమోడిటీ ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్‌ గుత్తాధిపత్య సంస్థగానే భావించాల్సి ఉంటుంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ఈ రంగంలోకి అడుగుపెట్టడం కంపెనీకి గట్టిపోటీనిచ్చే అంశం. అయినప్పటికీ ఎంసీఎక్స్‌ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుందని విశ్లేషకుల అంచనా. బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌, పీఎంఎస్‌ సర్వీసుల సంస్థలు సైతం కమోడిటీ ట్రేడింగ్‌లో పాల్గొనడం వల్ల ఈ విభాగం మార్కెట్‌ పరిమాణం పెరుగుతుంది. అది ఎంఎసీఎక్స్‌కు లాభించేదే. ఈ కంపెనీ వ్యయాలు స్థిరంగానే ఉంటాయని, అదనపు ఆదాయం లాభం రూపంలోకి మళ్లేదేనని మోతీలాల్‌ ఓస్వాల్‌ నివేదిక పేర్కొంది.You may be interested

నేడే స్పెన్సర్స్‌ రిటైల్‌ లిస్టింగ్‌

Friday 25th January 2019

సీఈఎస్‌సీ వెంచర్స్‌ కూడా ఆర్‌పీ సంజీవ్‌ గోయంకా గ్రూపులోని సీఈఎస్‌సీ నుంచి డీమెర్జర్‌ చేసిన స్పెన్సర్స్‌ రిటైల్‌, సీఈఎస్‌సీ వెంచర్స్‌ కంపెనీల షేర్లు శుక్రవారం (జనవరి 25న) ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో లిస్ట్‌ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా గురువారం ప్రకటించింది. పశ్చిమబెంగాల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ సీఈఎస్‌సీ డీమెర్జర్‌కు సంబంధించిన సమాచారాన్ని, వివరణను కోరగా... దీనిపై కంపెనీ వివరణ కూడా ఇచ్చింది. కంపెనీ నుంచి వేరు చేస్తున్న కంపెనీలకు మాతృ

చివర్లో కొనుగోళ్లు...లాభాల ముగింపు

Thursday 24th January 2019

10850ల వద్ద నిఫ్టీ 86పాయింట్ల లాభపడ్డ సెన్సెక్స్‌ చివర అరగంటలో హెవీవెయిట్‌ షేర్లలో జరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ రెండురోజుల నష్టాలకు స్వస్తి పలికింది. నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 10850 వద్ద, సెన్సెక్స్‌ 86 పాయింట్లు పెరిగి 36,195 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితులకు తోడు వివిధ కంపెనీల మూడో త్రైమాసికి ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇంట్రాడేలో సూచీలు స్వల్ప లాభనష్టాల మధ్య ట్రేడ్ అయ్యాయి. అయితే చివరి

Most from this category