STOCKS

News


నెల రోజుల్లో 13% రాబడి అందించే 3 స్టాక్స్‌

Thursday 30th August 2018
Markets_main1535611644.png-19797

వచ్చే నెల రోజుల్లో 10-13 శాతం రాబడులను అందించే మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు బొనాంజా పోర్ట్‌ఫోలియో టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రూపక్‌. అవేంటో చూద్దాం..

స్టాక్‌: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.95
టార్గెట్‌ ప్రైస్‌: రూ.106-109
స్టాప్‌ లాస్‌: రూ.90
రిటర్న్‌ అంచనా: 11-13 శాతం
స్టాక్‌ ధర ఫాలింగ్‌ ట్రెండ్‌లైన్‌పైన బ్రేక్‌ ఔట్‌ అయ్యింది. మునపటి ఫాలింగ్‌ ట్రెండ్‌కు రివర్సల్‌ మూమెంట్‌ను ఏర్పరచింది. అందువల్ల పెరుగుదల అంచనాలు నెలకొన్నాయి. అధిక వ్యాల్యూమ్స్‌ నేపథ్యంలో స్టాక్‌ పెరుగుదల కనిపిస్తోంది. అంటే కొనుగోలుదారుల భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. అలాగే స్టాక్‌ ధర తన 200 రోజుల డబుల్‌ ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ పైకి కదిలింది. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ క్రాసోవర్‌ను ఏర్పరచింది. ఇది బుల్లిష్‌ ట్రెండ్‌ను సూచిస్తోంది. ట్రేడర్లు రూ.90 స్టాప్‌ లాస్‌తో రూ.93-97 ధర శ్రేణి వద్ద రూ.106-109 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌నుకొనుగోలు చేయవచ్చు.

స్టాక్‌: బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.213
టార్గెట్‌ ప్రైస్‌: రూ.230
స్టాప్‌ లాస్‌: రూ.197
రిటర్న్‌ అంచనా: 11 శాతం
డైలీ చార్ట్‌లో ఈ స్టాక్‌ ధర డౌన్‌ ట్రెండ్‌ నుంచి అప్‌ట్రెండ్‌కు మారింది. హైయర్‌ టాప్‌, హైయర్‌ బాటమ్‌లను ఏర్పరచింది. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలోనూ స్టాక్‌ ధర 50 రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌కు పై స్థాయిలో ముగిసింది. అలాగే స్టాక్‌కు డైలీ చార్ట్‌లో తన మునపటి స్వింగ్‌ హై వద్ద మద్దతు లభిస్తోంది. ట్రేడర్లు రూ.197 స్టాప్‌ లాస్‌తో రూ.203-209 ధర శ్రేణి వద్ద రూ.230 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.  

స్టాక్‌: గృహ్‌ ఫైనాన్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.340
టార్గెట్‌ ప్రైస్‌: రూ.375
స్టాప్‌ లాస్‌: రూ.324
రిటర్న్‌ అంచనా: 10 శాతం
డైలీ చార్ట్‌లో ఈ స్టాక్‌ తన మునపటి స్వింగ్‌ హై పై స్థాయికి కదిలింది. ఇది స్టాక్‌ ధరలో పెరుగుదలను సూచిస్తోంది. అలాగే స్టాక్‌ ధర తన 200 రోజుల డబుల్‌ ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌కు పైన ముగిసింది. వీక్లి చార్ట్‌లో ఈ స్టాక్‌ సిమెట్రికల్‌ ట్రైయాంగిల్‌ను బ్రేక్‌ ఔట్‌ చేసింది. ఇది స్టాక్‌లో ర్యాలీని సూచిస్తోంది. ట్రేడర్లు రూ.324 స్టాప్‌ లాస్‌తో రూ.335-345 ధర శ్రేణి వద్ద రూ.375 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. 



You may be interested

రూపీ@70.82

Thursday 30th August 2018

రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. డాలర్‌ మారక విలువతో పోలిస్తే రోజుకో జీవితకాల కనిష్టస్థాయిలకు పతనమవుతున్న రూపాయి విలువ గురువారం ఇంట్రాడేలో మరోకొత్త కనిష్టాన్ని నమోదు చేసింది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 70.69 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయంగా చమురుధరలు పెరగడంతో పాటు​భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.93 శాతానికి చేరుకోవడం ఇన్వెస్టర్లు డాలర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా రూపాయి విలువ ఇంట్రాడేలో 70.82 కొత్త కనిష్టస్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం

పసిడికి ఫెడ్‌ వడ్డీ రేట్ల భయాలు

Thursday 30th August 2018

న్యూయార్క్‌/ముంబై:- అమెరికాలో వడ్డీరేట్ల పెంపు అంచనాలతో గురువారం పసిడి ధర తగ్గుముఖం పట్టింది. నేడు ఆసియాలో భారత కాలమాన ప్రకారం ఉదయం 11:00లకు ఔన్స్‌ పసిడి 3.60 డాలర్లు నష్టపోయి 1,207.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ద్రవ్యల్బోణాన్ని  2 శాతానికి  పరిమితం చేసేందుకు వచ్చే సెప్టెంబర్‌, డిసెంబర్‌లో ఫెడ్‌ క్రమంగా వడ్డీ రేట్లను పెంచుతుందని అంచనాలు మార్కెట్లో వర్గాల్లో మొదలయ్యాయి. ఏడాది రెండో క్వార్టర్ (ఏప్రిల్‌-జూన్‌)లో ఆర్థిక వ్యవస్థ 4.2

Most from this category