STOCKS

News


ఈ కంపెనీల నికరలాభం డబుల్‌...

Tuesday 10th July 2018
Markets_main1531217923.png-18170

బ్రోకరేజ్‌ల బుల్లిష్‌ అంచనాలు

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల సీజన్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో పది కంపెనీలు గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రెట్టింపు నికరలాభం నమోదు చేయవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. ఈ కంపెనీల షేర్లపై ఆయా బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా ఉన్నాయి. వీటి వివరాలు..
కోటక్‌ ఈక్విటీస్‌...
1. అపోలో టైర్స్‌: నికరలాభం 173 శాతం పెరగవచ్చని అంచనా. నికర విక్రయాలు 21 శాతం పెరుగుతాయని, రెవెన్యూలో 20 శాతం వృద్ధి ఉంటుందని భావిస్తోంది. మీడియ, హెవీ కమర్షియల్‌ వాహనాల విభాగంలో భారీ వాల్యూంలు నమోదు కావడం, విక్రయ ధరల్లో స్వల్ప పెరుగుదల కారణంగా వృద్ధినమోదు కావచ్చని అంచనా. ధరల పెరుగుదలను ముడిపదార్ధాల వ్యయాల పెరుగదల సమతూకం చేయడంతో ఎబిటా ఫ్లాట్‌గా ఉంటుందని పేర్కొంది. యూరప్‌ రెవెన్యూలో 23 శాతం వృద్ది ఉండొచ్చు. 
2. అశోక్‌ లేలాండ్‌: నికరలాభం 234 శాతం పెరగవచ్చని అంచనా. రెవెన్యూలో 51 శాతం పెరుగుదల ఉంటుంది. వాల్యూంలు భారీగా పెరగడం, విక్రయ ధరలు పెరగడంతో ఆదాయం మెరుగుపడనుంది. ఎబిటాలో 111 శాతం వృద్ధి ఉండొచ్చు. ఎబిటా మార్జిన్లు 290 బీపీఎస్‌ మేర పుంజుకుంటాయి. 
3. ఎంఆర్‌ఎఫ్‌: నికరలాభంలో 258 శాతం వృద్ధి ఉండొచ్చు. రెవెన్యూ 15 శాతం వృద్ధి సాధించవచ్చు. వాల్యూంల్లో రెండంకెల వృద్ధి కనిపిస్తుంది. ధరల పెరుగుదలతో అన్ని విభాగాల్లో కలిసిరానుంది. ద్విచక్రవాహనాల రిప్లేస్‌మెంట్‌ విభాగంలో బలమైన వృద్ధి కనిపిస్తోంది. ముడిపదార్ధాల ధరల పెరుగుదల కారణంగా ఎబిటా ఫ్లాట్‌గా ఉంటుంది. 
4. జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌: నికరలాభం 168 శాతం పెరగవచ్చు. ఎబిటా మార్జిన్లు 400 బీపీఎస్‌ మేర పెరుగుతాయని అంచనా. వ్యయనియంత్రణ చర్యలు ఫలితాలనివ్వడం, జీఎస్‌టీతో ప్రయోజనాలు చేకూరడంతో మార్జిన్లు మెరుగవుతాయి.
5. యునైటెడ్‌ స్పిరిట్స్‌: నికరలాభం 248 శాతం దూసుకుపోవచ్చని అంచనా. వాల్యూంల్లో వృద్ధి కారణంగా రెవెన్యూ 14 శాతం పెరగవచ్చు. గ్రాస్‌మార్జిన్లలో 245 బీపీఎస్‌ పెరుగుదల ఉండొచ్చు. వ్యయనియంత్రణా చర్యలు ఫలితాలనివ్వడంతో ఎబిటా మార్జిన్లు 450 శాతం వరకు పెరుగుతాయని అంచనా. 
ఐసీఐసీఐ డైరెక్ట్‌...
1. జ్యోతి ల్యాబ్స్‌: ప్రాఫిట్‌ ఆఫ్టర్‌ టాక్స్‌ 142 శాతం పెరగవచ్చు. డిష్‌వాషింగ్‌, ఫాబ్రిక్‌ కేర్‌ విభాగాల్లో జోరు కారణంగా విక్రయాల్లో 26.3 శాతం వరకు పురోగతి ఉంటుంది. జీఎస్‌టీ తాలుకు ఒడిదుడుకులు చల్లబడడంతో వాల్యూంల్లో సైతం మంచి మెరుగుదల కనిపించవచ్చు. మార్జిన్లలో 550 బీపీఎస్‌ పెరుగుదల ఉంటుందని అంచనా.
2. ప్రభాత్‌ డైరీ: నికరలాభం 111.8 శాతం పెరగవచ్చు. సామర్ధ్య వినియోగం మెరుగుపడడంతో వాల్యూంల్లో భారీగా మెరుగుదల కనిపించవచ్చు. దీంతో విక్రయాలు 13.6 శాతం, మార్జిన్లు 52 బీపీఎస్‌ వృద్ధి సాధించవచ్చు. 
3. కాడిలా హెల్త్‌కేర్‌: నికరలాభంలో 240 శాతం వృద్ది అంచనా. దేశీయ పార్ములేషన్లలో బలమైన వృద్ధి కారణంగా రెవెన్యూ 45 శాతం దూసుకుపోవచ్చు. ఎబిటా మార్జిన్లలో 925 బీపీఎస్‌ పురోగతి కనిపించవచ్చు. నిర్వహణా సామర్ధ్యం పుంజుకుంది.
4. డా. రెడ్డీస్‌ ల్యాబ్స్‌: ప్యాట్‌లో 365 శాతం వృద్ది ఉంటుందని అంచనా. దేశీయ వ్యాపారం పుంజుకోవడంతో రెవెన్యూ 7 శాతం పెరగవచ్చు. ఎబిటా మార్జిన్లలో 756 బీపీఎస్‌ పురోగతి ఉంటుందని అంచనా. పన్ను రేట్ల తరుగుదల, నిర్వహణా సామర్ధ్య పెంపుదలతో మంచి ఫలితాలు ఉంటాయని అంచనా.
5. నాట్కో ఫార్మా: నికరలాభంలో 164. 40 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా. యూఎస్‌లో కాంప్లెక్స్‌ ఉత్పత్తుల లాంచింగ్‌తో రెవెన్యూ 54 శాతం మేర పుంజుకోవచ్చు. ఎబిటా మార్జిన్లలో 50 శాతం వృద్ధి ఉంటుందని అంచనా. 



You may be interested

దేశీ ఫార్మాపై ట్రంప్‌ హెల్త్‌కేర్‌ ప్రభావం ఉండకపోవచ్చు..!

Tuesday 10th July 2018

ముంబై: దేశీయ జనరిక్ కంపెనీలపై ట్రంప్‌ హెల్త్‌కేర్‌ పాలసీ ప్రభావం ప్రతికూలంగా ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఫార్మా రంగ నిపుణులు కెవాల్ హండ.. ధరల పరంగా మాత్రం ఒత్తిడి ఉండేందుకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. గడిచిన రెండు నెలల కిందట ఒబామా హెల్త్‌కేర్‌ను పూర్తిగా పక్కన పెట్టేందుకు ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఈ చర్య ద్వారా అమెరికన్లకు అత్యంత చౌకగా మందులను అందుబాటులో ఉంచడం తన ఉద్ధేశ్యం

ట్రంప్‌ ట్వీట్‌తో ఫార్మా ర్యాలీకి పగ్గాలు?

Tuesday 10th July 2018

ఫైజర్‌ సహా ఇతర ఫార్మా కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మండిపడ్డారు. దీంతో మంగళవారం ట్రేడింగ్‌లో ఫార్మాషేర్లన్నీ నేలచూపులు చూస్తున్నాయి. పలు సంవత్సరాల మందగమనం అనంతరం ఇటీవలే ఫార్మా షేర్లలో ర్యాలీ ఆరంభమైంది. అయితే ట్రంప్‌ తాజా ట్వీట్‌ ఈ ర్యాలీకి చెక్‌ పెట్టవచ్చని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్‌ ట్వీట్‌ నేపథ్యంలో ఫైజర్‌, సన్‌ఫార్మా, లుపిన్‌, అరబిందో షేర్లు సుమారు ఒక

Most from this category