STOCKS

News


‘వ్యాల్యు’ చేకూర్చే స్టాక్స్‌ ఇవే..

Tuesday 23rd October 2018
Markets_main1540284283.png-21406

మార్కెట్‌ నిపుణులు ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో 10 స్టాక్స్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం.. 

అనలిస్ట్‌: స్టీవెన్‌ బిర్చ్‌ (విలియమ్‌ ఓనీల్‌, ప్రెసిడెంట్‌)
సిప్లా: ఫండమెంటల్స్‌ మెరుగవుతున్నాయి. వచ్చే రెండేళ్ల కాలంలో ఎర్నింగ్స్‌లో రెండంకెల వృద్ధి నమోదు కావొచ్చు. దేశీ, ఆఫ్రికా మార్కెట్లలో ఆదాయ వృద్ధి స్టాక్‌కు సానుకూల అంశం. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో టెక్నికల్‌గా చూసినా కూడా ఈ స్టాక్‌ పాజిటివ్‌గానే కనిపిస్తోంది. 200 రోజుల లైన్‌కు పైన ట్రేడవుతోంది. రూ.680 వద్ద స్టాక్‌ను కొనొచ్చు.

బయోకాన్‌: అక్టోబర్‌ తొలి అర్ధభాగంలో కరెక‌్షన్‌కు గురైన ఈ స్టాక్‌ రికవరీ బాటలో ఉంది. 50 రోజుల లైన్‌పైకి వచ్చింది. బయోకాన్‌కు సింజెన్‌లో 71 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ మంచి వృద్ధిని సాధిస్తోంది. ఇది బయోకాన్‌ను పాజిటివ్‌ అంశం. బలమైన బయోసిమిలర్‌ ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియో వల్ల రెవెన్యూ పెరిగే అవకాశముంది. 2018-19లో ఎర్నిం‍గ్స్‌ వృద్ధి 50 శాతానికిపైగా ఉండొచ్చని అంచనా. 

ఐసీఐసీఐ లంబార్డ్‌: దేశంలో ప్రైవేట్‌ రంగానికి చెందిన ప్రముఖ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఇది. ప్రైవేట్‌ రంగంలో 16.8 శాతం వాటాను కలిగి ఉంది. ఈ స్టాక్‌ ఇటీవల్ల త్వరితగతిన రికవరీ అయ్యింది. 200 ర ఓజుల మూవింగ్‌ యావరేజ్‌ పైకి వచ్చేసింది. 2018-19లో ఎర్నిం‍గ్స్‌ వృద్ధి 30 శాతంగా ఉండొచ్చని అంచనా. భారత్‌లో ఇన్సూరెన్స్‌ విస్తరణ కంపెనీ వృద్ధికి దోహదపడుతుంది. 

ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌: కంపెనీకి 700కుపైగా పట్టణాల్లో బ్రాండ్‌ ఔట్‌లెట్స్‌, దేశవ్యాప్తంగా 4,900కుపైగా మల్టీ బ్రాండ్‌ ఔట్‌లెట్స్‌ ఉన్నాయి. పాంటలూన్స్‌ ఆదాయం క్యూ1లో 26 శాతం పెరిగింది. ఇప్పుడు ఇది ఆన్‌లైన్‌ విభాగంలోకి కూడా అడుగుపెట్టింది. దీంతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ మార్జిన్లు పెరగొచ్చు. ప్రస్తుత పండుగ సీజన్‌ కలిసొచ్చే అంశం. 

వీఐపీ ఇండస్ట్రీస్‌: కంపెనీ ఫండమెంటల్స్‌ బలంగా ఉన్నాయి. ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌ సానుకూల అంశం. దేశంలో 8,000లకు పైగా రిటైల్‌ ఔట్‌లెట్స్‌ను కలిగి ఉంది. విదేశాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ స్టాక్‌ బాగా కరెక‌్షన్‌కు గురయ్యింది. గతవారంలో మళ్లీ రికవరీ అయ్యింది.

అనలిస్ట్‌: వినోద్‌ నాయర్‌ (జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌)
అవెన్యూ సూపర్‌మార్ట్స్‌: దేశంలోనే అత్యంత లాభదాయకమైన సూపర్‌ మార్కెట్‌ స్టోర్‌ అయిన డీమార్ట్‌ను అవెన్యూ సూపర్‌ మార్కెట్‌ నిర్వహిస్తోంది. ప్రస్తుత క్యూ2లో డీమార్ట్‌ ఆదాయం వార్షికంగా 39 శాతంమేర పెరిగింది. అయితే డైలీ డిస్కౌంట్‌ స్ట్రాటజీ వల్ల ఈబీటా మార్జిన్లు తగ్గాయి. రుణ భారం తగ్గుదల, కొత్త స్టోర్ల ఏర్పాటు, జీఎస్‌టీ ప్రతికూలతలు తగ్గడం వంటి వాటివల్ల ఎర్నింగ్స్‌లో వృద్ధి ఉంటుందని అంచనా. అందువల్ల రూ.1,513 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఇది. దేశవ్యాప్తంగా దీనికి 4,804 బ్రాంచ్‌లున్నాయి. అసెట్‌ క్వాలిటీ, రిటైల్‌ ఫ్రాంచైజ్‌, బ్యాలెన్స్‌ షీట్‌ వృద్ధి, మేనేజ్‌మెంట్‌ వంటి అంశాల్లో బ్యాంక్‌పై పాజిటివ్‌గా ఉన్నాం. 2018-20 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంక్‌ ఆర్‌వోఈ 19 శాతం, ఆర్‌వోఏ 2 శాతంగా ఉండొచ్చు. ఇదే సమయంలో ఎన్‌ఐఐ/పీఏటీలో వృద్ధి 20 శాతం/21 శాతం ఉండే అవకాశముంది. దీంతో షేరు వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగానే ఉంటాయి. 

నాట్కో ఫార్మా: ఆర్‌అండ్‌డీకి అధిక ప్రాధాన్యమిచే కంపెనీ ఇది. సమర్థవంతమైన మేనేజ్‌మెంట్‌, వివిధ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహించడం సానుకూల అంశం. ఎర్నింగ్స్‌లో మంచి వృద్ధి ఉండొచ్చు. ఈ స్టాక్‌ను రూ.831 టార్గెట్‌ ప్రైస్‌తో కొనుగోలు చేయవచ్చు.

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
ఇంద్రప్రస్థ గ్యాస్‌: సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌లో కంపెనీకి మంచి అనుభవం ఉంది. ఢిల్లీలో ఈ వ్యాపారంలో మంచి స్థానంలో నిలిచింది. సీఎన్‌జీ, పీఎన్‌జీ విభాగాల డిమాండ్‌ ఔట్‌లుక్‌ బాగుంది. తన కార్యకలాపాలకు అవసరమైన గ్యాస్‌ కోసం గెయిల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. విస్తరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. బ్యాలెన్స్‌ షీట్‌ బలంగా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.  

బ్రోకరేజ్‌: యాక్సిస్‌ సెక్యూరిటీస్‌
ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌: ఇండియన్‌ ఆటో విభాగంలో ఈ స్టాక్‌ తమ టాప్‌ పిక్‌గా ఉంది. 2018-2020 ఎర్నింగ్స్‌ వృద్ధి అంచనాల పరంగా చూస్తే ప్రీమియం వ్యాల్యుయేషన్‌ సబబుగానే అనిపిస్తోంది. రూ.1,216 టార్గెట్‌ ప్రైస్‌తో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.    You may be interested

బేర్‌మన్న బ్యాకింగ్‌ షేర్లు

Tuesday 23rd October 2018

మిడ్‌సెషన్‌ సమయంలో మార్కెట్‌ పతనంలో భాగంగా బ్యాకింగ్‌ రంగషేర్లలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2శాతం, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1శాతం, నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 1శాతం క్షీణించాయి. ప్రభుత్వరంగ షేర్లలో అత్యధికంగా ఇండియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. సిండికేట్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు

10,110 దిగువకు నిఫ్టీ

Tuesday 23rd October 2018

ఎన్‌ఎస్‌ఈ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ-50.. 11,110 పాయింట్ల దిగువకు పతనమైంది. ఇది 7 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. మంగళవారం మధ్యాహాం 1:55 సమయంలో నిఫ్టీ 140 పాయింట్ల నష్టంతో 10,105 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 381 పాయింట్ల నష్టంతో 33,753 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ మార్చి తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. కాగా నిఫ్టీ అక్టోబర్‌ 11న 10,138 పాయింట్లకు క్షీణించింది. తాజాగా

Most from this category