News


గ్లోబల్‌ గ్రోత్‌: వీటితో రిస్క్‌..

Tuesday 13th November 2018
Markets_main1542089847.png-21944

ప్రపంచ వృద్ధికి రానున్న కాలంలో పలు సవాళ్లు ఎదురు కానున్నాయి. మరీముఖ్యంగా అంతర్జాతీయంగా పెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగిన అమెరికా, చైనా వంటి దేశాల నుంచి ప్రమాదాలు పొంచి ఉన్నాయని టీడీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ ఎమర్జింగ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ మితుల్‌ కొటెచా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
అమెరికాలో ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుతం సరైన పనితీరు కబనర్చడం లేదని మితుల్‌ కొటెచా తెలిపారు. గత కొన్ని నెలలుగా చూస్తే గ్లోబల్‌ ఈక్విటీ మార్కెట్లలో కెల్లా అమెరికా ఈక్విటీ మార్కెట్లు అత్యుత్తమ పనితీరు నమోదు చేశాయని పేర్కొన్నారు. ఆర్థిక ఉద్దీపనలు, పన్ను తగ్గింపు, బలమైన ఆర్థిక వృద్ధి రేటు వంటి పలు అంశాలు ఇందుకు కారణంగా నిలిచాయని తెలిపారు. అయితే కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈక్విటీ మార్కెట్‌ వ్యాల్యుయేషన్స్‌ బాగా పెరిగాయని తెలిపారు. అలాగే వచ్చే ఏడాదిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు నెమ్మదించొచ్చనే అంచనాలున్నాయని పేర్కొన్నారు. మరీ ప్రత్యేకించి ఈక్విటీ మార్కెట్‌లో టెక్నాలజీ స్టాక్స్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైందని తెలిపారు. ఇవి ఔట్‌పర్ఫార్మ్‌ చేశాయని పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ అమెరికా మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. 
క్రూడ్‌ ఆయిల్‌ ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని మితుల్‌ కొటెచా పేర్కొన్నారు. డాలర్‌ విలువ 17 నెలల గరిష్ట స్థాయికి చేరుకుందని తెలిపారు. దీని వల్ల వివిద దేశాల కరెన్సీలపై తీవ్రమైన ఒత్తిడి నెలకొని ఉందన్నారు. అలాగే ఈ ఏడాది చాలా వర్ధమాన దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలపడిందని గుర్తుచేశారు. దీని వల్ల కరెంట్‌ అకౌంట్‌ లోటు కలిగిన దేశాలు, ప్రత్యేకించి భారత్‌పై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. 
టారిఫ్‌ ఉద్రిక్తతలు వచ్చే ఏడాది పెరగొచ్చని మితుల్‌ కొటెచా అంచనా వేశారు. చైనా, అమెరికా వాణిజ్య చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోతే.. అప్పుడు ప్రపంచ వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఇక చైనా ఆర్థిక వృద్ధి రేటు ఇప్పటికే మందగించిందని గుర్తుచేశారు. అందువల్ల అమెరికా, చైనా కారణంగా ప్రపంచ వృద్ధిపై ఎక్కువగా నెగటివ్‌ ప్రభావం ఉంటుందని తెలిపారు.    



You may be interested

ఫార్మాకు షేర్లకు జ్వరం

Tuesday 13th November 2018

మంగళవారం ఉదయం సెషన్‌లో ఫార్మా షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈ అన్ని రంగాల్లోకెల్లా ఫార్మా ఇండెక్స్‌ అత్యధికంగా 2శాతం నష్టపోయింది. ఉదయం గం.11:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపుతో పోలిస్తే 1.75శాతం నష్టంతో 9,378 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 10 షేర్లలో 9 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఒక్క డాక్టర్‌ రెడ్డీస్‌ మాత్రం 1శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా

పెరిగిన విమ్టా లాభం

Tuesday 13th November 2018

హైదరాబాద్‌: సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో విమ్టా ల్యాబ్స్‌ నికర లాభం పెరిగింది. గత ఆర్ధిక సంవత్సంలో రూ.4.33 కోట్ల పన్ను తర్వాత లాభాన్ని ఆర్జించగా.. ఇప్పుడది రూ.6.97 కోట్లకు పెరిగింది. ఇక, మొత్తం ఆదాయం రూ.53.82 కోట్లను నమోదు చేయగా.. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.43.67 కోట్లుగా ఉంది. ––– తగ్గిన ఎన్‌సీఎల్‌ లాభం సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్ధిక సంవత్సరం ఫలితాల్లో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం తగ్గింది. గత ఆర్ధిక సంవత్సరం

Most from this category