STOCKS

News


రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇది సువర్ణ అవకాశం..!

Tuesday 13th November 2018
Markets_main1542104650.png-21959

ముంబై: దేశీయంగా కొనసాగుతున్న ద్రవ్యలభ్యత కొరత కారణంగా స్టాక్‌ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈఓ అరుణ్‌ తుక్రాల్‌ వ్యాఖ్యానించారు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం ఇందుకు ప్రధాన కారణం కాగా, ఇప్పటి వరకు ఈ సమస్య పరిష్కార మార్గం దొరకలేదని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ విషయానికి వస్తే.. డోజోన్స్‌ ఇప్పటికే కరెక్ట్‌ అయ్యింది. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇచ్చింది. వచ్చే ఏడాదిలో మరో మూడు సార్లు పెంపు ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు బ్యాలెన్స్‌ షీటు కత్తిరింపు ఉంది. మరోవైపు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ క్వాంటిటేటీవ్‌ ఈజింగ్‌ (ఉద్దీపన ప్యాకేజీ)లను ముగిస్తోంది. వడ్డీ రేట్ల పెంపునకు సిద్ధమైంది. ఈ పరిణామాలను బేరీజు వేసుకుని చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా కూడా ద్రవ్యలభ్యత కొరత ఉండనుందని విశ్లేషించారు. ఈ అంశాల ఆధారంగా.. వచ్చే మూడు నుంచి ఆరు నెలలకాలంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌లో కన్సాలిడేషన్‌ చోటుచేసుకోవచ్చని అంచనావేశారు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇది సువర్ణ అవకాశంగా సూచించారు. భారత్‌ వచ్చే 6-7 ఏళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్నారు. ప్రస్తుతం 2,000 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం.. వచ్చే 10 ఏళ్లలో 4,500 డాలర్లకు చేరుతుందని అంచనావేశారు. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలకు డిమాండ్‌ పెరుగుతుందని అన్నారు.



You may be interested

నిఫ్టీ లాభం 100 పాయింట్లు

Tuesday 13th November 2018

35వేల ఎగువకు సెన్సెక్స్‌ 10550 స్థాయిని అందుకున్న నిఫ్టీ రాణించిన హెవీవెయిట్‌ షేర్లు మిడ్‌సెషన్‌ నుంచి సాగిన కొనుగోళ్లతో మార్కెట్‌ మంగళవారం భారీ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ తిరిగి 35వేల మార్కును, నిఫ్టీ 10500 మార్కును తిరిగి అందుకున్నాయి. ప్రపంచమార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా సూచీలు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మిడ్‌ సెషన్‌ వరకు నష్టాల్లో ట్రేడయ్యాయి. మిడ్‌ సెషన్‌ తరువాత ప్రైవేట్‌ బ్యాంక్‌ రంగ బ్యాంక్‌, ఆర్థిక రంగ, అటో రంగ షేర్లలో

అపోలో టైర్స్‌ లాభం 4% అప్‌

Tuesday 13th November 2018

అపోలో టైర్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) రూ.146 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.140 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంటే నికర లాభం 4 శాతంమేర పెరిగింది. కంపెనీ మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,269 కోట్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం రూ.3,496 కోట్లుగా ఉంది.  ఆర్థిక ఫలితాల

Most from this category