STOCKS

News


రెండంకెల్లో నిఫ్టీ కంపెనీల లాభాల వృద్ధి..!

Thursday 6th December 2018
Markets_main1544089757.png-22702

హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సీఐఓ ప్రశాంత్ జైన్ వ్యాఖ్య

ముంబై: కార్పొరేట్ బ్యాంకులు రికవరీ సాధిస్తుండడం, నూతన మొండి బకాయిల తగ్గుదల ఆధారంగా వచ్చే కొన్నేళ్లలోనే నిఫ్టీ ఎర్నింగ్స్‌ షార్ప్‌ రికవరీని సాధించే అవకాశం ఉందని ప్రశాంత్ జైన్ అన్నారు. నాలుగేళ్ల బలహీన లాభదాయకత తరువాత.. నిఫ్టీ ఈపీఎస్‌ వృద్ధి రేటు రెండంకెల స్థాయిలో ఉండనుందని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దాదాపు రూ.75,000 కోట్ల ఆస్తుల నిర్వహణలో ఉన్న ఈయన నాలుగు ఓపెన్‌ ఎండెడ్‌ స్కీంలను నిర్వహిస్తున్నారు. వీటిలో ఓవర్‌ వెయిట్‌ బ్యాంకులు ఉన్నట్లు వెల్లడించారు. పలు పెద్ద బ్యాంకులు ప్రస్తుతం ఆకర్షణీయ వాల్యుయేషన్స్‌తో లభిస్తున్నాయన్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి తక్కువ వాల్యుయేషన్స్‌తో అండర్‌పెర్ఫార్మ్‌ చేస్తున్న యుటిలిటీ రంగంలో టర్న్‌అరౌండ్‌కు అవకాశం ఉందన్నారు. తక్కువ రిస్క్‌ కలిగిన బిజినెస్‌ అయినందున వీటిని చూడవచ్చన్నారు. మల్టిపుల్స్‌కు తగిన విధంగా వృద్ధి లేనందున కన్సూమర్‌ రంగానికి తానైతే అండర్‌వెయిట్‌ ఇస్తున్నట్లు తెలిపారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులలో మూడింట రెండు వంతులను లార్జ్‌/ మల్టీ-క్యాప్ ఫండ్స్‌లోనూ.. మిగిలిన ఒక వంతును మిడ్‌/ స్మాల్‌-క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని సూచించారు. బలహీన క్యాపెక్స్‌, అధిక ఎన్‌పీఏల కారణంగా మెటల్స్‌, కార్పొరేట్ బ్యాంక్స్‌, క్యాపిటల్ గూడ్స్ బలహీనంగా ఉన్నాయని, ఈ కారణంగా నిఫ్టీ ఈపీఎస్‌ వృద్ధి పడిపోయిందని విశ్లేషించారు. అయితే, ఈ సమస్యలు లేని స్మాల్‌క్యాప్స్‌ లార్జ్‌క్యాప్స్‌ను అవుట్‌పెర్ఫార్మ్‌ చేసినట్లు తెలిపారు. ఈ దశ ఇక పూర్తికానుందని భావిస్తున్నారు. 1979 నుంచి ఇప్పటివరకు డేటాను ఒకసారి పరిశీలిస్తే.. ఎన్నికల ఏడాదిలో మార్కెట్లు పాజిటీవ్‌ రిటర్న్స్‌ ఇచ్చినట్లు వెల్లడించారు. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1.50 శాతం డౌన్‌

Thursday 6th December 2018

ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ గురువారం 1.50శాతం నష్టపోయింది. మార్కెట్‌ పతనంలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు బ్యాంకు నిఫ్టీ పతనానికి కారణమయ్యాయి. మధ్యాహ్నం గం.3:15ని.లకు సూచి గత ముగింపుతో పోలిస్తే 1.25శాతం నష్టంతో 26,207.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలోకి మొత్తం 12 షేర్లలో 11 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా ఒక్క ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు

200-డీఎంఏ పైన 200 షేర్లు..

Thursday 6th December 2018

ముంబై: అనేక షేర్లలో ర్యాలీ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పలువురు టెక్నికల్‌ అనలిస్టులు సూచిస్తున్నారు. ఇక మూవింగ్‌ యావరేజ్‌ (సగటు కదలికల) ఆధారంగా దాదాపు 300 షేర్లలో బలమైన ర్యాలీకి అవకాశం ఉందని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహ్మద్‌ వెల్లడించారు. 800 షేర్లు 50-రోజుల సగటు కదలికల పైన ఉండగా.. మరో మూడు వందల షేర్లు 200-రోజుల

Most from this category