News


ఇప్పుడు ఈ 3 రంగాలు బెటర్‌..

Tuesday 23rd October 2018
Markets_main1540290000.png-21410

యుటిలిటీస్‌, ఫార్మా, మెటల్‌ రంగ షేర్లలో వ్యాల్యుకు అవకాశముందని ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కో-సీఐవో మహేశ్‌ పాటిల్‌ తెలిపారు. ఎర్నింగ్స్‌ వృద్ధి తక్కువగా ఉన్నా కూడా.. ఇవి ట్రాక్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే కొన్ని నాణ్యమైన ఎన్‌బీఎఫ్‌సీలు కూడా చౌక ధరకే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మార్కెట్‌లో మరో విడత అమ్మకాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగంలోని ఆందోళనలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా మార్కెట్‌లోనూ కొంత కరెక‌్షన్‌ చూశామని తెలిపారు. 
ఎఫ్‌ఐఐలు ఈక్విటీ మార్కెట్‌పై నెగటివ్‌ ప్రభావంతో ఉన్నారని, అందువల్ల డబ్బుల్ని వెనక్కు తీసుకుళ్తున్నారని మహేశ్‌ పాటిల్‌ పేర్కొన్నారు. ఇక దేశీ ఇన్వెస్టర్లు స్థిరంగా మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారని తెలిపారు. అందువల్ల కొంత స్థిరత్వం లభించిందని పేర్కొన్నారు. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగంపై ఇన్వెస్టర్లకు సెంటిమెంట్‌ తిరిగి వస్తే.. అప్పుడు మార్కెట్లలో నిలకడ వస్తుందని తెలిపారు. కంపెనీలు ఎర్నింగ్స్‌ వెలువడుతున్నాయని, వీటిని గమనిస్తే మార్జిన్లపై ఒత్తిడి ఉన్న విషయం అవగతమౌతోందని పేర్కొన్నారు. కమోడిటీ ధరలు పెరుగుదల, రూపాయి క్షీణత వల్ల ఎర్నింగ్స్‌పై ప్రతికూల ప్రభావం ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో ఎర్నింగ్స్‌ ఎలా ఉంటాయో చూడాల్సి ఉందని, ఇవి కూడా మార్కెట్‌కు మద్దతునివ్వొచ్చని పేర్కొన్నారు. 
పలు స్టాక్స్‌ బాగా పడిపోయాయని, స్టాక్స్‌ ఎంపికకు ఇదే సరైన సమయమని మహేశ్‌ పాటిల్‌ తెలిపారు. మంచి పనితీరు కనబర్చిన రంగాలు ఇప్పుడు కరెక‌్షన్‌కు గురౌతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత కరెక‌్షన్‌లో ఐటీ, కన్సూమర్‌ స్టాక్స్‌ మంచి పనితీరు చూపించాయని తెలిపారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో స్టాక్‌ ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడైతే ఆందోళనలు ఎక్కువగా ఉంటాయో అక్కడ స్టాక్స్‌ విలువ పడిపోతుందని, అవి కొనుగోలుకు అనుకూలముగా ఉంటాయని తెలిపారు. అలాగే మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌లో కొన్ని స్టాక్స్‌ 40 శాతంమేర పతనమయ్యాయని, అయినా కూడా ఇవి ఇన్వెస్ట్‌మెంట్లకు అనుకూలముగా లేవని పేర్కొన్నారు. ఇక్కడ స్టాక్‌ నాణ్యతను చూడాల్సి ఉందన్నారు. 
లిక్విడిటీ తగ్గుదల నేపథ్యంలో రిటైల్‌ విభాగంలో వాటా పెంచుకోవడానికి బ్యాంకులకు ఇదే సరైన సమయమని మహేశ్‌ పాటిల్‌ తెలిపారు. కార్పొరేట్‌ బ్యాంకులు రానున్న కాలంలో మంచి పనితీరు కనబర్చవచ్చని అంచనా వేశారు. ఆటోమొబైల్‌ రంగంలో ప్రత్యేకించి టూవీలర్‌ విభాగంలో వృద్ధి అంచనాల కన్నా నెమ్మదిగా ఉందని తెలిపారు. కొత్త ఇన్సూరెన్స్‌ నిబంధనలు, లిక్విడిటీ సమస్యలు ప్రతికూల ప్రభావం చూపాయని పేర్కొన్నారు.  



You may be interested

లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Wednesday 24th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:45 సమయంలో ఏకంగా 97 పాయింట్ల లాభంతో 10,269 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,147 పాయింట్లతో పోలిస్తే 122 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

నాలుగోరోజూ నష్టాల ముగింపే

Tuesday 23rd October 2018

34000 దిగువకు సెన్సెక్స్‌ 10150 కిందకు నిఫ్టీ ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్‌ మంగళవారం భారీ నష్టాలతో ముగిసింది. ముఖ్యంగా ఫార్మా, ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాల సునామి నేడు మార్కెట్‌ నష్టాల ముగింపు కారణమైంది. మరోరెండు రోజుల్లో అక్టోబర్‌ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టులకు ముగియనుండటంతో కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్‌ 34వేల మార్కును, నిఫ్టీ 10,150 మార్కును కోల్పోయాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 287

Most from this category