STOCKS

News


డబ్బుంది.. వ్యయాలే పెరిగాయ్‌..

Friday 19th October 2018
Markets_main1539932318.png-21288

వ్యవస్థలో డబ్బు కొరత లేదని, దాని సమీకరణ వ్యయాలే పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ ప్రెసిడెంట్‌, సీఈవో కేకీ మిస్త్రీ తెలిపారు. ఒక బిల్డర్‌ పేమెంట్‌ను చెల్లించడంలో ఆలస్యమైతే భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఒక కంపెనీ దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిందని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు వ్యవస్థలో లిక్విడిటీ సమస్య తగ్గడానికి దోహదపడ్డాయని తెలిపారు. నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లకు (ఎన్‌బీఎఫ్‌సీలు), హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. మనం ఒక విషయాన్ని గ్రహించాలని, వ్యవస్థలో ఎలాంటి ఒత్తిడి కనిపించడం లేదని తెలిపారు. ఒక బిల్డర్‌ చెల్లింపులు ఆలస్యమైతే.. అతను దివాలా తీసినట్లు కాదని పేర్కొన్నారు. అక్కడ స్వల్ప కాలిక లిక్విడిటీ సమస్య ఉందని అర్థం చేసుకోవాలన్నారు. ప్రాజెక్ట్‌ బాగా ఉండొచ్చని తెలిపారు. దేశంలోని ఒక బిల్డర్‌ చెల్లింపులు ఆలస్యమైతే దాని వల్ల ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఒక కంపెనీ దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిందని గుర్తుచేశారు. లిక్విడిటీ సమస్యను ఎక్కువ చేసి చూపారని పేర్కొన్నారు. దీని వల్ల హౌసింగ్‌ మార్కెట్‌లో రికవరీ ఆలస్యమౌతుందని భావించడం లేదన్నారు. వ్యక్తులకు రుణాలు లభిస్తున్నాయని తెలిపారు. డబ్బులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తే.. రుణం కోసం చూస్తున్నారని తెలిపారు. అలాగే డబ్బుల్ని పొందుతున్నారని పేర్కొన్నారు. ఆర్‌బీఐ సరైన నిర్ణయాలు తీసుకుంటోందని, సరైన విధానాలను అనుసరిస్తోందని కితాబిచ్చారు. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు నిధుల సమీకరణ రకరకాలుగా ఉంటుందని తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీని తీసుకుంటే విదేశాల నుంచి రుణాల రూపంలో డబ్బుల్ని సమీకరిస్తోందని పేర్కొన్నారు. ఈసీబీలు, మసాలా బాండ్లు, దేశీ బాండ్‌ మార్కెట్‌, డిపాజిట్లు, ఇతర మార్గాల్లో నిధులను పొందుతామని తెలిపారు. ఈ మార్గాల్లో వాణిజ్య పత్రాలు ఒక భాగమని పేర్కొన్నారు. చిన్న హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఎన్‌హెచ్‌బీ నుంచి రిఫైనాన్స్‌ పొందుతాయని పేర్కొన్నారు. ఇవి వాణిజ్య పత్రాలు, బ్యాంకుల నుంచి రుణాల ద్వారా నిధులను సమీకరిస్తాయని తెలిపారు. ఈ కంపెనీలు విదేశీ మార్కెట్‌లోకి వెళ్లవని పేర్కొన్నారు. అందువల్ల మార్కెట్‌లో పరిస్థితులు కఠినతరమైతే వీటిపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపారు. పెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల విషయంలో ఇలాంటి పరిస్థితులు ఉండవని, ఇవి నిధుల అవసరమైతే ఒక మార్గాన్ని కాకపోతే మరొక మార్గాన్ని ఎంచుకుంటాయని పేర్కొన్నారు. మార్కెట్‌లో డబ్బుకు కొరత లేదని తెలిపారు. రెండు నెలల కిత్రంతో పోలిస్తే ఇప్పుడు డబ్బు సమీకరణ వ్యయం పెరిగిందని పేర్కొన్నారు. 



You may be interested

రేటింగ్‌ కోత.. మైండ్‌ట్రీ 17 శాతం పతనం..

Friday 19th October 2018

సిటీ గ్రూప్‌, ఫిలిప్‌ క్యాపిటల్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ వంటి బ్రోకరేజ్‌ సంస్థలు క్యూ2 ఎర్నింగ్స్‌ వెల్లడి తర్వాత మిడ్‌ క్యాప్‌ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ టార్గెట్‌ ప్రైస్‌ను తగ్గించాయి. క్యూ2లో మైండ్‌ట్రీ రెవెన్యూ అంచనాలను అందుకోలేకపోవడం, వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉండటం, కంపెనీ స్థూల అంశాలు సంబంధిత రంగానికి భిన్నంగా ఉండటం, బ్రెగ్జిట్‌ ఆందోళనలు వంటి అంశాలు రేటింగ్‌ కోతకు కారణం. బ్రోకరేజ్‌ సంస్థల నిర్ణయంతో మైండ్‌ట్రీ షేరు శుక్రవారం 17.5

రిలయన్స్‌ షేరును ఏం చేద్దాం?

Friday 19th October 2018

శుక్రవారం ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు దాదాపు 6 శాతం పతనమైంది. క్యు2 ఫలితాలు మిశ్రమంగా ఉండడంతో ఆర్‌ఐఎల్‌ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. అయితే బ్రోకరేజ్‌లు మాత్రం షేరుపై బుల్లిష్‌గా ఉన్నాయి. షేరు త్వరలో అప్‌ట్రెండ్‌ చూపుతుందని అంచనా వేస్తున్నాయి. టెలికం, రిటైల్‌ విభాగాలు మంచి వృద్ది సాధిస్తున్నాయని, కొత్తగా కొనుగోలు చేసే కంపెనీలతో మంచి ఫలితాలుంటాయని చెబుతున్నాయి.  ఆర్‌ఐఎల్‌ షేరుపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి... 1. క్రెడిట్‌ సూసీ:

Most from this category