STOCKS

News


ఇన్వెస్ట్‌మెంట్‌కు మంచి రోజేది?

Monday 12th November 2018
Markets_main1542006901.png-21899

మనీ మార్కెట్లలో స్థిరత్వం వస్తోందని, సాధారణ స్థాయికి వస్తున్నాయని కోటక్‌ ఏఎంసీ ఎండీ నీలేశ్‌ షా తెలిపారు. మార్కెట్లలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొందని, లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు బాగా పెరగొచ్చని మార్కెట్‌ అంచనా వేస్తోందన్నారు. సెప్టెంబర్‌, ఆగస్ట్‌ నెలల కన్నా అక్టోబర్‌లో ఎక్కువ పెట్టుబడులు ఉండొచ్చని తెలిపారు. ఇందుకు ఇన్వెస్టర్ల పరిపక్వత ఒక కారణమని పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు మార్కెట్‌ కరెక‌్షన్‌ సమయంలో ఎక్కువ కొనుగోలు జరుపుతున్నారని తెలిపారు. అలాగే మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల పెరుగుదలకు డిస్ట్రిబ్యూటర్ల శ్రమ మరొక కారణమని పేర్కొన్నారు. వీరు ఈక్విటీ ఫండ్స్‌ లేదా సిప్స్‌లలో గత 12 నెలలుగా నెగటివ్‌ రిటర్న్స్‌ ఉన్నా కూడా కస్టమర్లకు కోల్పోకుండా చూసుకున్నారని తెలిపారు. ఇన్వెస్టర్ల పరిపక్వత, డిస్ట్రిబ్యూటర్ల శ్రమ కారణంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 
మనీ మార్కెట్లు నిలకడగా కనిపిస్తున్నాయని నిలేశ్‌ షా తెలిపారు. లిక్విడిటీ సాధారణ స్థాయికి వస్తోందని పేర్కొన్నారు. ఇన్‌కమ్‌ ఫండ్స్‌ నుంచి నిధుల ఉపసంహరణ కొనసాగుతోందని, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ ఇందుకు కారణమని తెలిపారు. సిప్‌ ఖాతాల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. ఇన్వెస్ట్‌ చేయడానికి సిప్‌ సరైన మార్గమని తెలిపారు. సిప్‌ వల్ల మార్కెట్‌ ఒడిదుడుకుల్లో ఇన్వెస్ట్‌మెంట్ల విలువ యావరేజ్‌ అవుతుందని పేర్కొన్నారు. 
చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌కు మంచి రోజు అంటూ ఏమీ ఉండదని నీలేశ్‌ షా తెలిపారు. ‘ఇన్వెస్ట్‌మెంట్‌లో విజయం సాధించాలంటే మూడు విషయాలను గుర్తు పెట్టుకోవాలి. మొదటిది రెగ్యులర్‌గా ఇన్వెస్ట్‌ చేయడం. ఇన్వెస్ట్‌ చేయడానికి సిప్‌ ఉత్తమమైన మార్గం. రెండోది.. దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్లు. విజయానికి షార్ట్‌కట్స్‌ అంటూ ఏమీ ఉండవు. ఇన్వెస్ట్‌మెంట్లను దీర్ఘకాలం కొనసాగించాలి. మూడోది.. అసెట్‌ అలోకేషన్‌. పోర్ట్‌ఫోలియోలో ప్రతి అసెట్‌కు తగిన ప్రాధాన్యతనివ్వాలి. డెట్‌, ఈక్విటీ, కమోడిటీ, కరెన్సీ, రియల్‌ ఎస్టేట్‌ వంటి ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలను బ్యాలెన్స్‌ చేస్తూ వెళ్లాలి. ఏదో ఒక అసెట్‌కే అధిక ప్రాధాన్యమివ్వొద్దు. ఈ మూడు అంశాలను అనుసరిస్తే విజయవంతమవుతాం’ అని వివరించారు. You may be interested

భారీగా నష్టపోయిన పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు

Monday 12th November 2018

సూచీల పరిమిత శ్రేణి ట్రేడింగ్‌లో భాగంగా సోమవారం ప్రభుత్వరంగ షేర్ల భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ అ‍త్యధికంగా 2శాతం నష్టపోయింది.  ముఖ్యంగా, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్ల నష్టాల ట్రేడింగ్‌ సూచీల పతనానికి కారణమని చెప్పవచ్చు. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గతముగింపు (2,928.45)తో పోలిస్తే 1.50శాతం నష్టంతో 2,886.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన

అవంతీ ఫీడ్స్‌ షేరు ధర 14% డౌన్‌

Monday 12th November 2018

రూ.361 వద్దకు పతనం ముంబై: అవంతీ ఫీడ్స్‌ షేరు ధర సోమవారం ఉదయం 14 శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో రూ.361 వద్ద కనిష్టస్థాయిని నమోదుచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాలను కంపెనీ శనివారం విడుదల చేయగా.. ఈ ఫలితాలు నిరాశపరిచిన నేపథ్యంలో ఇవాళ షేరు ధర అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఈఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో నికర లాభం రూ.46.40 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన నికర లాభం 60.11

Most from this category