STOCKS

News


ఆర్థిక సంస్థల మధ్య పరస్పర విశ్వాసం లేదు!!

Wednesday 3rd October 2018
Markets_main1538562279.png-20828

యస్‌ బ్యాంక్‌ కన్నా ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉత్తమమైన ఎంపికని క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ సంజయ్‌ దూత్‌ తెలిపారు. మార్కెట్‌ ఒడిదుడుకులకు, అస్థిరతలకు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మార్కెట్లు బుల్‌ ట్రెండ్‌లో ఉన్నప్పుడు చాలా మంది అనలిస్ట్‌లు వాటిని కొనండి.. వీటిని కొనండి.. అంటూ సూచనలిస్తుంటారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తక్కువ మంది మాత్రమే బయటకు వచ్చి మార్కెట్‌ స్థితిగతులను తెలియజేస్తూ ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటర్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ ఫ్రేమ్‌వర్క్‌ దెబ్బతినిందని తెలిపారు. లేమాన్‌ సంక్షోభ సమయాల్లో మాదిరిగా ఇన్‌స్టిట్యూషన్ల మధ్య నమ్మకం పోయిందని అభిప్రాయపడ్డారు. అంటే ఒక బ్యాంక్‌ ఎన్‌బీఎఫ్‌సీని, ఒక బ్యాంక్‌ మరొక బ్యాంక్‌ను నమ్మడం లేదని పేర్కొన్నారు. రాబోయే డిఫాల్ట్‌ ఎటువైపు నుంచి ఉంటుందోనన్న భయాలు నెలకొన్నాయని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లోనే మొత్తం క్రెడిట్‌ మార్కెట్‌పైన,  లెండింగ్‌-బారోయింగ్‌ మెకానిజంపైన, రేటింగ్‌ వ్యవస్థలపైన సందేహాలు తలెతుత్తాయని పేర్కొన్నారు. ఇదే జరిగితే ప్రతిఒక్కరూ భద్రతను చూసుకుంటారని, నగదుకు డిమాండ్‌ ఏర్పడుతుందన్నారు. 
మార్కెట్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకొని ఇన్వెస్ట్‌మెంట్లు చేయడానికి సిద్ధమౌతానని సంజయ్‌ దూత్‌ తెలిపారు. మంచి కంపెనీలకు బ్యాంకుల నుంచి నిధుల సమీకరణకు గానీ, వారి ప్రొడక్టుల విక్రయానికి గానీ ఎలాంటి సమస్యలు ఉండవని పేర్కొన్నారు. అన్నీ పనులు సవ్యంగా జరిగిపోతూ ఉంటాయని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లో వృద్ధి నెమ్మదిస్తుందే తప్ప, వ్యాపారం సజావుగానే ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ బాగుందని, క్రూడ్‌ ధరలు, రూపాయి క్షీణత వల్ల సవాళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. స్టాక్స్‌ ధరలపై వీటి ప్రభావం ఇప్పటికే కనిపిస్తోందని పేర్కొన్నారు. ఫైనాన్షియల్‌ మార్కెట్లలో ఆందోళనలు ఏర్పడినప్పుడు నాణ్యమైన స్టాక్స్‌కు డిమాండ్‌ ఉంటుందని తెలిపారు. విభాగంతో సంబంధం లేకుండా నాణ్యమైన స్టాక్స్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. మార్కెట్లు పడిపోతున్నప్పుడు మూలధనాన్ని రక్షించుకోవడం కూడా ముఖ్యమైన అంశమేనని తెలిపారు. ‘మీ వద్ద డబ్బుంటే మార్కెట్‌ పడ్డప్పుడల్లా కొంటూ ఉండండి. ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసి ఉంటే పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోండి. ఒకే అనుకుంటే.. మంచి కంపెనీలున్నాయని భావిస్తే.. నిక్షేపంగా ఉండండి’ అని పేర్కొన్నారు. 
యస్‌ బ్యాంక్‌ నాణ్యత గురించి మాట్లాడనని సంజయ్‌ దూత్‌ తెలిపారు. పలు అంశాల కారణంగా ఈ స్టాక్‌ ఇప్పుడు వార్తాల్లో నిలిచిందన్నారు. ఒక ఇన్వెస్టర్‌గా తాను ఒడిదుడుకులకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు. అందువల్ల యస్‌ బ్యాంక్‌ షేరుకు దూరంగా ఉంటానని తెలిపారు. ఇన్వెస్ట్‌మెంట్లలో కొంత భాగం హరించుకుపోయినా పర్వాలేదని, అంతేకానీ అస్థిరత, ఒడిదుడుకులతో ప్రయాణం కొనసాగించలేమని పేర్కొన్నారు. అందువల్ల ఐసీఐసీఐ స్టాక్‌ను కొనుగోలు చేస్తానని తెలిపారు.  You may be interested

పీఎస్‌యూ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.4 లక్షల కోట్లు ఆవిరి

Wednesday 3rd October 2018

ప్రభుత్వరంగ లిస్టెడ్‌ కంపెనీలు ఈ ఏడాది ఇన్వెస్టర్లను ఉసూరుమనిపించాయి. సుమారు రూ.4 లక్షల కోట్ల మేర మార్కెట్‌ విలువను అవి ఇంత వరకు కోల్పోయాయి. అధిక ముడి చమురు ధరలు, మొండి బకాయిల వంటి అంశాలు ఈ విధంగా నష్టాల పాల్జేశాయి. 76 ప్రభుత్వరంగ సంస్థల్లో 74 క్షీణించాయి. ముఖ్యంగా నీరవ్‌మోదీ కొట్టిన దెబ్బకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) ఎక్కువగా నష్టాలను ఎదుర్కొన్నది. 65 శాతం నష్టపోయింది. రైల్వే

సెన్సెక్స్‌ 550 పాయింట్లు క్రాష్‌

Wednesday 3rd October 2018

నిఫ్టీ నష్టం 150 పాయింట్లు మార్కెట్‌ మరోసారి నిలువునా పతనమైంది. ఒకరోజు సెలవు అనంతరం బుధవారం మిశ్రమంగా ప్రారంభమైన సూచీలు చివరికి భారీ నష్టాలతో ముగిశాయి. ప్రపంచమార్కెట్లో ముడి చమురు ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకోవడం, ఇటలీ బడ్జెట్‌ సంక్షోభం తెరపైకి రావడం, ఇంట్రాడేలో రూపాయి మళ్లీ జీవితకాల కనిష్టానికి చేరుకోవడం, ఈ వారంలో ఆర్‌బీఐ సమీక్షా సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత... తదితర కారణాలతో ​ట్రేడింగ్‌ ఆద్యంతం అ‍మ్మకాలు వెల్లువెత్తాయి.

Most from this category