STOCKS

News


పిజ్జా అదిరెన్‌... డోనట్‌ ఎగిరేన్‌...!!!

Saturday 9th March 2019
Markets_main1552072607.png-24499

జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌కు ముందున్నాయి మంచి రోజులు అంటున్నాయి బ్రోకరేజీ సంస్థలు. ఎందుకంటే నిర్ణీత లక్ష్యానికంటే ఒక త్రైమాసికం ముందుగానే డంకిన్‌ డోనట్స్‌ బ్రేక్‌ఈవెన్‌ (లాభ, నష్ట రహిత) దశకు వచ్చేసింది. డంకిన్‌ డోనట్స్‌ యూనిట్‌ కారణంగా జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ ఎబిట్డా 250 బేసిస్‌ పాయింట్లను నష్టపోవాల్సి వస్తోంది. మరోవైపు కంపెనీకి సంబంధించి అతిపెద్ద ఆదాయం తెచ్చిపెట్టే డామినోస్‌ మాత్రం మంచి పనితీరు చూపిస్తోంది. ముడిపదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో డామినోస్‌ యూనిట్‌ మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. కొంత కాలంగా వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టిన యాజమాన్యం ఇప్పుడు కొత్త ఉత్పత్తుల విభాగాల్లోకి ప్రవేశించాలనుకుంటోంది. దీంతో ఈ స్టాక్‌ పెరిగేందుకు మంచి అవకాశాలున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

 

‘‘డంకిన్‌ డోనట్స్‌ అంచనాలకంటే ముందే బ్రేక్‌ఈవెన్‌కు రావడం పెద్ద సానుకూలం. డంకిన్‌ డోనట్స్‌ నష్టాల వల్ల కంపెనీ మార్జిన్లపై ఒత్తిడి నెలకొంది. డోమినోస్‌ బలమైన పనితీరు, డంకిన్‌ డోటన్స్‌ లాభాలు కలసి కంపెనీ మార్జిన్లు పెరగనున్నాయి’’ అని ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ షేరు గత ఏడాది కాలంలో 36 శాతం రిటర్నులు ఇవ్వగా, గడిచిన మూడేళ్ల కాలంలో 137 శాతం రిటర్నులు ఇచ్చింది. డంకిన్‌ డోనట్స్‌ స్టోర్ల క్రమబద్ధీకరణతోపాటు వ్యయ నియంత్రణలపై యాజమాన్యం దృష్టి పెట్టింది. 2016-17 మొదటి త్రైమాసికంలో 77గా ఉన్న స్టోర్లను గత డిసెంబర్‌ త్రైమాసికానికి 32కు తగ్గించుకుంది. డంకిన్‌ డోనట్స్‌ను పెద్ద స్టోర్ల రూపంలో తీసుకురావడంతో అధిక అద్దె వ్యయాల భారం పడింది. అయితే, మన మార్కెట్‌లో తక్కువ అద్దెలతో కూడిన వ్యాపార విధానమే విజయవంతం అవుతుందన్నది పరిశీలకుల అభిప్రాయం. స్టోర్‌వారీ పెట్టుబడులపై రాబడుల పట్ల యాజమాన్యం దృష్టి సారించడమే డంకిన్‌ డోనట్స్‌ బ్రేక్‌ఈవెన్‌కు కారణమని ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జుబిలంట్‌ కొత్తగా ఐదు డంకిన్‌ డోనట్స్‌ స్టోర్లను ప్రారంభించగా, 31 స్టోర్లను మూసేసింది. 2018-19లో డిసెంబర్‌ నాటికి కొత్తగా 12 స్టోర్లను ఓపెన్‌ చేసి, 20 స్టోర్లను మూసివేసింది. ‘‘డోనట్స్‌కు పరిమిత మార్కెట్‌ నేపథ్యంలో డోనట్స్‌, కాఫీకి అదనంగా చాయ్‌ వంటివి మెనూలోకి తీసుకురావాలనుకుంటోంది. దీంతో పాశ్చాత్య రెస్టారెంట్‌ చైన్‌కు స్థానిక పరిమళం తోడవుతుంది. డంకిన్‌ డోనట్స్‌ ఇప్పుడిక బర్గర్లు, టోస్టీలు, వ్రాప్స్‌ను కూడా అందించనుంది’’ అని ఎడెల్వీజ్‌ తెలిపింది. మరోవైపు డోమినోస్‌ కొత్తగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ నాటికి 72 స్టోర్లను తెరవగా, ఇప్పటికే ఉన్న స్టోర్లలో ఆరింటిని మూసేసింది. 

 

‘‘ఆన్‌లైన్‌ ఆర్డర్లపై యాజమాన్యం దృష్టి కేంద్రీకరించింది. దీనివల్ల వ్యయాలు తగ్గించుకోవచ్చు. అలాగే, మార్కెట్‌ విస్తరణ, వాటా కూడా పెరుగుతుంది. డంకిన్‌ డోనట్స్‌ టర్న్‌ అరౌండ్‌ కావడం, డీజిటల్‌ రూపంలో అధిక ఆర్డర్ల రాకతో సిబ్బందిని తగ్గించుకోవడం ద్వారా వ్యయాలు తగ్గుతాయి’’ అని ఎడెల్వీజ్‌ పేర్కొంది. డోమినోస్‌ తయారీ వ్యయాల్లో 40 శాతం చీజ్‌కే ఖర్చవుతుంది. చీజ్‌ ధరలు తగ్గడం కంపెనీ మార్జిన్లు పెరిగేందుకు దోహదపడింది. ‘‘జుబిలంట్‌ 2013-17 మధ్య పాఠాలు నేర్చుకుంది. ఇప్పుడు వ్యాల్యూ ఆఫరింగ్‌ ద్వారా అమ్మకాలు పెంచుకుంటోంది. ఎవ్రీ డే వ్యాల్యూ ఆఫర్లు ఇందులో భాగమే. ఇప్పట్లో ఇవి కనుమరుగుకాకపోవచ్చు. ఎవ్రీ డే వ్యాల్యూ రూ.99/199 ధరల్లో ఉన్నాయి. అమెరికాలో డోమినోస్‌ ఎవ్రీ డే వ్యాల్యూ పేరుతో 5.99/7.99 డాలర్లను దశాబ్ద కాలంగా కొనసాగిస్తోంది’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. మరోవైపు జుబిలంట్‌ చైనీస్‌ క్రూసిన్‌ బ్రాండ్‌ను కూడా అభివృద్ది  చేసే ప్రణాళికతో ఉంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈ స్టాక్‌కు రూ.1,650 టార్గెట్‌ ఇవ్వగా, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రూ.1,750 ఇచ్చింది. ఎడెల్వీజ్‌ టార్గెట్‌ రూ.1,529 కాగా, జేఎం ఫైనాన్షియల్‌ టార్గెట్‌ రూ.1,360గా ఉంది. 



You may be interested

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 9th March 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం రాత్రి  నష్టాలతో 11,024.50 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 11076.05 పాయింట్లతో పోలిస్తే 52పాయింట్ల నష్టంతో ఉంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమన ఆందోళనలతో ప్రపంచమార్కెట్లలో నెలకొన్న బలహీన పరిస్థితులు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.  వచ్చే వారంలో దేశీయ సాదరణ ఎన్నికలకు నోటిఫికేషన్‌, మంగళవారం(12న) జనవరి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాల విడుదల మార్కెట్‌పై ప్రభావాన్ని

మిడ్‌క్యాప్స్‌లో మోర్గాన్‌ స్టాన్లీ నచ్చిన స్టాక్స్‌!

Saturday 9th March 2019

దాదాపు రెండేళ్ల కనిష్ట ధరలకు కొన్ని, 52 వారాల కనిష్ట ధరలకు ఎక్కువ శాతం మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఇటీవల పడిపోయాయి. ఎక్కువ మంది విశ్లేషకులు స్టాక్స్‌ కొనుగోలుకు ఇది సరైన తరుణంగా భావిస్తున్నారు. ‘‘చమురు ధరలు పెరగకపోవచ్చు. గత ఎనిమిది వారాల్లో రాజకీయంగా పరిణామాలను పరిశీలిస్తే... ఎన్నికల ముందస్తు ఎన్నో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం, రైతులకు నగదు బదిలీ, సరిహద్దుల్లో సైనిక చర్యతో ప్రజల్లో ఏకీకరణ జరిగి రానున్న ఎన్నికల

Most from this category