STOCKS

News


రాబడులు పంచాలంటే... ఫండ్స్‌కు అయినా తెలివి ఉండాలె!

Friday 4th January 2019
Markets_main1546626226.png-23418

గతేడాది మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఓ పాఠం వంటిది. దాదాపు అధిక శాతం పథకాలు రాబడులను పంచడంలో విఫలమయ్యాయి. కానీ, కొన్ని మాత్రం లాభాలను పంచాయి. ఎందుకని...? వాటికే ఆ ప్రత్యేకత ఎందుకు సాధ్యమైంది...? అందుకు ఫండ్‌ మేనేజర్లు ఏం చేశారో తెలుసుకోవాల్సిందే.

 

గతేడాది కొన్ని మల్టీక్యాప్‌ ఫండ్స్‌ సూచీలకు మించి రాబడులను అందించాయి. బ్యాంకింగ్‌, ఐటీ స్టాక్స్‌లో పెట్టుబడులే ఈ రాబడులకు కారణం. ఈ ఫండ్స్‌ బ్యాంకింగ్‌, ఐటీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెంచుకుని, అదే సమయంలో ఏడాది పాటు ఆటో స్టాక్స్‌లో పెట్టుబడులు తగ్గించుకుంటూ వచ్చాయి. దీంతో ఇతర పథకాలకు మించి రాబడులు పంచాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 2018లో 25 శాతం పడిపోయింది. నిఫ్టీ బ్యాంక్‌ సూచీ మాత్రం 6.7 శాతం, నిఫ్టీ ఐటీ సూచీ 23 శాతం రాబడులను ఇవ్వడం విశేషం. ఎన్నికల సంవత్సరం 2019లోనూ అనిశ్చితిని తట్టుకునేందుకు ఐటీ, ఫార్మా రంగాలు హెడ్జింగ్‌గా ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది విశ్లేషకులు అయితే, ఇటీవలి కరెక్షన్‌ నేపథ్యంలో ఆటో రంగ స్టాక్స్‌లోనూ మంచి కొనుగోలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటున్నారు. 

 

యాక్సిస్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ డైరెక్ట్‌ ప్లాన్‌ 9.2 శాతం రాబడులను ఇచ్చింది. నిఫ్టీ 50 ఇచ్చిన రాబడులు 3 శాతమే. మల్టీక్యాప్‌ కేటగిరీ సగటు రాబడులు 6.3 శాతమే. యాక్సిస్‌ మల్టీక్యాప్‌ టాప్‌-10 పెట్టుబడులను చూసినట్టయితే... ఐదు స్టాక్స్‌ బ్యాంకులు, ఫైనాన్షియల్‌ కంపెనీలవే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి. బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో పెట్టబడులు 39 శాతంగా ఉన్నాయి. ఐటీ స్టాక్స్‌లో పెట్టుబడులు 8 శాతానికి పైగా ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేసి ఉంది. ఇక గతేడాది 4.8 శాతం రాబడులను ఇచ్చిన యూటీఐ ఈక్విటీ ఫండ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఈ పథకం కూడా ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెంచుకుని, ఆటో రంగంలో తగ్గించుకున్నదే. కెనరా రొబెకో ఈక్విటీ డైవర్సిఫైడ్‌ ఫండ్‌ 2.2 శాతం రాబడులను ఇచ్చింది. ఈ పథకం కూడా ఐటీ, బ్యాంకు స్టాక్స్‌లో పెట్టుబడులు పెంచుకుని, ఇంధన స్టాక్స్‌లో తగ్గించుకుంది. ఎన్నికలు సమీపిస్తున్నందున, మన ఆర్థిక రంగ ప్రభావం పడని స్టాక్స్‌ను ఎంచుకోవడం మంచిదని యూటీఐ ఎంఎఫ్‌ ఫండ్‌ మేనేజర్‌ వి శ్రీవాస్తవ సూచించారు. మార్కెట్‌, ఆర్థిక రంగ పరిస్థితులను గమనిస్తూ పోర్ట్‌ఫోలియోను మార్చుకునే చర్యలు తీసుకున్న ఫండ్స్‌ రాబడులను ఇవ్వగలిగాయి. నిపుణులు తమ తరఫున ఇన్వెస్ట్‌ చేసి, మంచి రాబడులను తెచ్చిపెడతారన్న నమ్మకంతో ఇన్వెస్ట్‌ చేసిన వారికి న్యాయం చేసిన ఫండ్స్‌ గతేడాది కొన్నే. ఇవి ఇతర పథకాలకు ఆదర్శం కూడా. You may be interested

అమెరికా మార్కెట్ల రీ-బౌన్స్‌

Saturday 5th January 2019

అమెరికా మార్కెట్లు శుక్రవారం రాత్రి భారీ లాభాలతో ముగిశాయి. డిసెంబర్‌లో నిరుద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదు కావడం, వడ్డీరేట్లపై ఫెడ్‌రిజర్వ్‌ ఛైర్మన్‌ సానుకూల వాఖ్యలు, వచ్చే వారంలో అమెరికా - చైనా దేశాల మధ్య జరగున్న వాణిజ్య చర్చలు అమెరికా మార్కెట్ల సెంటిమెంట్‌కు కలిసొచ్చాయి. ఫలితంగా ఎస్‌&పీ 3.50శాతం లాభపడి 2,531 వద్ద, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 4శాతం పెరిగి 6,738 వద్ద, డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 3.30శాతం ర్యాలీ

పీపీఎఫ్‌ ఎప్పటికీ రాబడుల్లో రారాజే!

Friday 4th January 2019

ఈక్విటీలు అధిక రాబడులు ఇ‍స్తాయని మన చుట్టూ ఉన్న వారిలో నమ్మేవారు తక్కువే. అందుకేనేమో... ఇప్పటికీ ఈక్విటీల్లోకి పెట్టుబడులు 5 శాతానికి మించలేదు. ఎప్పుడు మార్కెట్లు పెరుగుతాయో తెలియదు, ఎప్పుడు పడిపోతాయో అర్థం కాదు. ఓ స్టాక్‌ స్వల్ప కాలంలోనే రెట్టింపు అవుతుంది. కుడి ఎడమైతే సగానికి పైగా పడిపోనూ వచ్చు. అందుకే రిస్క్‌ తీసుకోలేని వారు ఎఫ్‌డీలు, పీపీఎఫ్‌ వంటి పథకాల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఎందుకంటే అవసరమైన సందర్భంలో

Most from this category