STOCKS

News


10900పైన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Thursday 10th January 2019
Markets_main1547091060.png-23492

విదేశీ మార్కెట్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ గురువారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది.  తన మునపటి ముగింపు(10878)తో పోలిస్తే ఉదయం గం.8:39లకు 28 పాయింట్ల లాభంతో 10,905 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా ఇక్కడి నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ట్రేడవుతుంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో స్పాట్‌ నిఫ్టీ 10,850 పాయింట్ల వద్ద క్లోజ్‌కాగా, నిఫ్టీ ఫ్యూచర్‌ 10,878 పాయింట్ల వద్ద ముగిసింది. 
ఇక ప్రపంచమార్కెట్ల విషయానికొస్తే....
అమెరికా మార్కెట్లు బుధవారం ఒడిదుడుకుల ట్రేడింగ్‌ జరిగినప్పటికి చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ డిసెంబర్‌లో జరిపిన సమీక్షకు సంబంధించిన మినిట్స్‌ తాజాగా వెల్లడికాగా, అత్యధిక శాతం ఫెడ్‌ సభ్యులు వడ్డీ రేట్లపై మెతకవైఖరి వహించాలని ఆ సమీక్షలో కోరారు. మరోవైపు అమెరికా-చైనాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు ముగియగా, చర్చలు తమకు అనుకూలంగా జరిగినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ రెండు  అంశాలతో అమెరికా సూచీలు పాజిటివ్‌గా ముగిసాయి. టెక్నాలజీ, చిప్‌ తయారీ కంపెనీ షేర్ల ర్యాలీతో ఆ సూచీలు లాభాలతో ముగిసాయి.. ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ అరశాతం లాభపడి 2,584 వద్ద, డౌ జోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.40శాతం పెరిగి 23, 879 వద్ద, నాస్‌డాక్‌ 0.87శాతం లాభడి 6,957 వద్ద ముగిసింది. ఇక గురువారం ఉదయం ఆసియా సూచీల్లో జపాన్‌ నికాయ్‌ 1 శాతంపైగా క్షీణించగా, ఇతర ప్రధన సూచీలు ఉదయం 8.50 గంటలకు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

స్వల్పలాభాలతో ప్రారంభం

Thursday 10th January 2019

గురువారం భారత్‌ మార్కెట్‌ స్వల్పలాభాలతో ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 45 పాయింట్ల లాభంతో 36,258 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 10,859 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో 1 శాతంవరకూ పెరగ్గా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌,  ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు స్వల్పనష్టాలతో మొదలయ్యాయి.  ఆసియా సూచీలు నష్టాల్లో...  ఇక గురువారం ఉదయం ఆసియా సూచీల్లో జపాన్‌ నికాయ్‌

మార్కెట్లోకి నిధుల రాక తగ్గుతోందా?

Thursday 10th January 2019

దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వస్తున్న పెట్టుబడులే ఈ మధ్య కాలంలో మన దేశ ఈక్విటీ మార్కెట్లను బలంగా ముందుకు తీసుకెళుతున్నాయి. ఒకవైపు విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నా ఆ ప్రభావం పెద్దగా పడడం లేదంటే ఇదే కారణం. దేశీయ ఇన్వెస్టర్ల నుంచి ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో... దేశీయ మార్కెట్లు విదేశీ నిధుల ప్రవాహాలపై ఇంకెంత మాత్రం ఆధారపడడం లేదు. కానీ, డిసెంబర్‌ నెలలో మ్యూచువల్‌

Most from this category