STOCKS

News


ఎన్‌పీఏ బ్యాంకుల భారీ ర్యాలీ..!

Thursday 9th August 2018
Markets_main1533793156.png-19090

  • 6నెలల గరిష్టానికి ఐసీఐసీఐ బ్యాంకు

ముంబై:- కార్పొరేట్‌ రుణాల కారణంగా నిరర్థక ఆస్తులు కలిగిన బ్యాంకు షేర్లు గురువారం ట్రేడింగ్‌లో భారీ ర్యాలీ చేశాయి. ఎన్‌పీఏ సమస్యలతో  ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ, ప్రైవేటు రంగ ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు నేటి ట్రేడింగ్‌లో 7శాతం నుంచి 3శాతం వరకూ లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ - 50 ఇండెక్స్‌లోని టాప్‌ - 5 షేర్లలో వరుసగా ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు మొదటి మూడు స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంకు:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.320.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 8.51 శాతం లాభపడి రూ.345.85ల వద్ద ఆరునెలల గరిష్టానికి చేరుకుంది. ఉదయం 10:45ని.లకు షేరు గతముగింపు ధర(రూ.318.70)తో పోలిస్తే 6.51శాతం లాభంతో రూ.339.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్లలో మొదటి స్థానంలో ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.255.00లు, రూ.365.70లుగా నమోదయ్యాయి.
ఎస్‌బీఐ బ్యాంకు:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.312.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 3.17 శాతం లాభపడి రూ.318.50ల ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. ఉదయం 10:45ని.లకు షేరు గతముగింపు ధర(రూ.308.70)తో పోలిస్తే 2.51శాతం లాభంతో రూ.316.10 ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్లలో రెండో స్థానంలో ట్రేడ్‌ అవుతోంది.  కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.232.35లు, రూ.351.30లుగా నమోదయ్యాయి.
యాక్సిస్‌ బ్యాంకు:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.595.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 3 శాతం లాభపడి రూ.613.90ల ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. ఉదయం 10:45ని.లకు షేరు గతముగింపు ధర(రూ.596.30)తో పోలిస్తే 2.30శాతం లాభంతో రూ.610.00 ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్లలో మూడో స్థానంలో ట్రేడ్‌ అవుతోంది.కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.447.50లు, రూ.627.60లుగా నమోదయ్యాయి.



You may be interested

జీఎస్‌టీని సరళతరం చేయండి

Thursday 9th August 2018

వాషింగ్టన్: సంక్లిష్టమైన జీఎస్‌టీ రేట్లను పాటించడంలోనూ, అమలు చేయడంలోనూ వ్యయాల భారం భారీగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) రేట్లను సరళతరం చేయాల్సిన అవసరం ఉందని.. రెండు రేట్ల విధానంతో అధిక ప్రయోజనాలుంటాయని పేర్కొంది. భారతపై రూపొందించిన వార్షిక నివేదికలో ఐఎంఎఫ్ ఈ అంశాలు ప్రస్తావించింది. 2017 జూలై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన

ఎన్నారై దిగ్గజాలకు ట్రంప్ విందు

Thursday 9th August 2018

న్యూయార్క్‌:  పెప్సీకో సీఈవో ఇంద్రా నూయి, మాస్టర్‌ కార్డ్ సీఈఓ అజయ్ బంగా వంటి ప్రవాస భారత కార్పొరేట్‌ అధిపతులతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందునిచ్చారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. న్యూజెర్సీలోని ప్రైవేట్ గోల్ఫ్‌ క్లబ్‌లో ఇచ్చిన ఈ విందుకు భర్త రాజ్‌ నూయితో కలిసి ఇంద్రా నూయి, భార్య రీతు బంగాతో కలిసి అజయ్‌

Most from this category