STOCKS

News


పీఎస్‌యూ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ

Wednesday 18th July 2018
Markets_main1531896814.png-18432

ముంబై:- ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లలో బుధవారం లాభాల స్వీకరణ చోటుచేసుకుంటుంది. ఎన్‌పీఏలతో సతమతమవుతున్న ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం రూ.11వేల కోట్ల మూలధనాన్ని సమకూర్చనుందనే వార్తలో క్రితం ట్రేడింగ్‌లో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు భారీగా లాభపడిన సంగతి తెలిసిందే. నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు పీఎస్‌యూ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో క్రితం రోజు ఆర్జించిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతనిథ్యం వహిస్తున్న నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది.ఈ సూచీలోని మొత్తం 12 షేర్లకు గానూ అన్ని నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా ఓరియంటల్‌ బ్యాంక్‌ 7శాతానికి పైగా నష్టపోగా, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆప్‌ ఇండియా, అలహాదాబాద్‌ బ్యాంక్‌ షేర్లు 7నుంచి 5శాతం నష్టపోయాయి. అలాగే పంజాజ్‌ నేషనల్‌ బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ బరోడా బ్యాంకులు 4 వరకు పతనమయ్యాయి. ఇండియన్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు షేర్ల 2శాతం నష్టపోగా, ఎస్‌బీఐ షేరు అరశాతం నష్టపోయింది.

 



You may be interested

52 వారాల గరిష్టానికి 29 స్టాక్స్‌..

Wednesday 18th July 2018

జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ, ఏసియన్‌ పెయింట్స్‌ బీఎస్‌ఈలో బుధవారం మార్నింగ్‌ సెషన్‌లో 29 స్టాక్స్‌ 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. వీటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌ఈజీ, లార్సెన్‌ అండ్‌ టుబ్రో, ఇన్ఫోటెక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఎన్‌వైర్‌ ఎలక్ట్రో, అట్లాస్‌ జువెలరీ, దోలత్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, శ్రీ సర్గోవింద్‌, ఎలక్ట్రోస్టీల్‌, డెక్కన్‌ బేరింగ్స్‌, సిగ్నిటీ టెక్‌, స్వరాజ్‌ ఆటోమోటివ్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్, దన్లా టెక్నాలజీస్‌, ఆస్ట్రల్‌ పాలీ టెక్‌, ప్రో ఫిన్‌ క్యాపిటల్‌

స్వల్పకాలానికి ఎస్‌ఎంఎస్‌ గ్లోబల్‌ సిఫార్సులు

Wednesday 18th July 2018

వచ్చే ఒకటి రెండు నెలల్లో దాదాపు 13 శాతం వరకు రాబడినిచ్చే స్టాకులను ఎస్‌ఎంఎస్‌ గ్లోబల్‌ సంస్థ రికమండ్‌ చేస్తోంది.  1. వీ2 రిటైల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 475. స్టాప్‌లాస్‌ రూ. 390. ఇటీవల రూ. 495 స్థాయిని తాకిన అనంతరం ప్రాఫిట్‌ బుకింగ్‌ వచ్చింది. దీంతో మారోమారు 200 రోజుల డీఎంఏ స్థాయి కిందకు వచ్చి మద్దతు పొందింది. రూ. 380 స్థాయిల్లో డబుల్‌ బాటమ్‌ ఏర్పడింది. ఇక్కడనుంచి

Most from this category