News


ఆగని ఐటీ షేర్ల పతనం

Thursday 4th October 2018
Markets_main1538636153.png-20853

మార్కెట్‌ పతనం గురువారం గంట గంటకు పెరుగుతోంది. మధ్యాహ్నం గం.12:00లకు సెన్సెక్స్‌ 800 పాయింట్ల నష్టపోగా, నిఫ్టీ సూచీ 250 పాయింట్ల నష్టపోయి 10600 దిగువకు చేరుకుంది. మార్కెట్‌ పతనంతో భాగంగా అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అత్యధికంగా ఐటీ రంగానికి చెందిన షేర్లు నష్టపోయాయి. డాలర్‌ మారకంలో రూపాయి కనిష్టానికి చేరుకున్నప్పటికీ.., నేటి ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు నష్టాల బాట పట్టడం గమనార్హం. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 3శాతం నష్టం పోయింది. ఈ సూచిలో భాగమైన మొత్తం 10 షేర్లకు గానూ 10 షేర్లు నష్టపోయాయి. అత్యధికంగా ఇన్ఫీబీమ్‌ 10శాతం నష్టపోయింది. టీసీఎస్‌ షేర్లు 5శాతం, టెక్‌మహీంద్రా 4.50శాతం, ఎన్‌ఐఐటీ 3.50శాతం, ఇన్ఫోసిస్‌ 3శాతం నష్టపోయాయి. వాటితో పాటు టాటా ఎలాక్సీ్‌ 2.50శాతం, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ 2.50శాతం, హెచ్‌సీఎల్‌ షేరు 2శాతం, మైండ్‌ట్రీ 1శాతం, విప్రో అరశాతం నష్టపోయాయి. మధ్యహ్నం గం.12:00లకు నిఫ్టీ ఇండెక్స్‌ గత ముగింపు(15,910)తో పోలిస్తే 3శాతం నష్టంతో 15,427.50 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

భద్రం బీకేర్‌ఫుల్‌ ఇన్వెస్టరూ!

Thursday 4th October 2018

నిపుణుల సూచన దేశీయ మార్కెట్లలో బేర్స్‌ చెలరేగుతున్న ప్రస్తుత సమయంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, అప్రమత్తంగా ఉండాలని మార్కెట్‌ నిపుణులు నొక్కి చెబుతున్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఒడిదుడుకులను తీసుకువస్తాయని, జాగ్రత్తగా లేకుంటే పెట్టుబడి మట్టికొట్టుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్టర్లు క్వాలిటీ కంపెనీలనే నమ్ముకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎండమావుల వెంట పరుగెట్టవద్దని సలహా ఇస్తున్నారు. బలమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌, ముందు చూపు, మంచి వ్యాపారం, లాభదాయక ఫలితాలు

ఝున్‌ఝున్‌వాలాను ముంచేసిన మిడ్‌క్యాప్స్‌

Thursday 4th October 2018

కేవలం రిటైల్‌ ఇన్వెస్టర్లను మాత్రమే కాదండోయ్‌.. పీఎంఎస్‌ మేనేజర్లను, వారి హై-నెట్‌వర్త్‌ క్లయింట్స్‌ను కూడా మార్కెట్‌ దెబ్బకొట్టింది. అఖరికి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా వంటి సీజన్‌ ఇన్వెస్టర్లను కూడా మన ఈక్విటీ మార్కెట్‌ వదిలిపెట్టలేదు. ఈయన పోర్ట్‌ఫోలియో కూడా 2018లో బాగా నష్టపోయింది. మరీముఖ్యంగా మిడ్‌క్యాప్స్‌ హోల్డింగ్స్‌ 75 శాతం వరకు కరిగిపోయాయి. కాగా మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఈ ఏడాది ఇప్పటి దాకా 16 శాతంమేర పతనమైంది. గత నాలుగేళ్లలో మిడ్‌క్యాప్స్‌ బాగా

Most from this category