STOCKS

News


10500ల ఎగువకు నిఫ్టీ

Monday 15th October 2018
Markets_main1539591559.png-21164

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి లాభాల్లోకి మళ్లింది. ఫార్మా, ఐటీ రంగ షేర్లతో పాటు హెవీ వెయిటేజ్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ద్వయం ర్యాలీ ఇందుకు కారణమయ్యాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ గతంలో కోల్పోయిన కీలక సాంకేతిక స్థాయిలను తిరిగి అందుకున్నాయి. 35వేల మార్కును, నిఫ్టీ 10500 స్థాయిని తిరిగి అందుకున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలను అందుకున్న సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో అటో, బ్యాంకింగ్‌, మెటల్‌ రంగ షేర్లలో అమ్మకాలతో నిఫ్టీ సూచీ 62 పాయింట్లను నష్టపోయి 10,410 వద్ద, సెన్సెక్స్‌ 174ను కోల్పోయి 34,560ల వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అనంతరం  ఫార్మా, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు మొదలవడంతో  సూచీలు కనిష్టాస్థాయి నుంచి రికవరీ బాట పట్టాయి. మధ్యాహ్నం‍ గం.1:00ల నిప్టీ సూచి  28పాయింట్ల లాభపడి 10501 వద్ద, సెన్సెక్స్‌ సూచీ 170 పాయింట్ల పెరిగి 34903 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో అటో, మెటల్‌, ప్రైవేట్‌ రంగ ఇండెక్స్‌లు తప్ప అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ఉన్నాయి, అత్యధికంగా ఫార్మా ఇండెక్స్‌ 2శాతం లాభం లాభపడింది.



You may be interested

అంతర్జాతీయ అస్థిరత కొనసాగుతుంది!

Monday 15th October 2018

ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టిన్‌ లగార్డ్‌ వాణిజ్య యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కొనసాగుతుందని, దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ నాయకులు సిద్ధంగా ఉండాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్‌ క్రిస్టిన్‌ లగార్డ్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడకులు, కేంద్రబ్యాంకుల నుంచి రేట్ల పెంపుదలలు కొనసాగుతాయని ఆమె అంచనా వేశారు. రాబోయే రిస్కులను తట్టుకునేలా తగిన మానిటరీ, ఫిస్కల్‌ ప్రణాళికలను రూపొందించుకొని ఉండాలని కేంద్ర బ్యాంకులకు ఆమె సూచించారు. సంస్కరణలు క్రమంగా మందగిస్తున్నాయని,

అలీబాబా-జొమాటొ డీల్‌.. ఇన్ఫో ఎడ్జ్‌ 6% జంప్‌..

Monday 15th October 2018

ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా షేరు సోమవారం ఇంట్రాడేలో ఏకంగా 6 శాతంమేర ర్యాలీ చేసింది. నిధుల సమీకరణకు సంబంధించి జొమాటొ-అలీబాబా మధ్య ఒప్పందం కుదరడం ఇందుకు ప్రధాన కారణం. గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ.. ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా స్టాక్‌పై ఓవర్‌ వెయిట్‌తో ఉంది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,900గా నిర్ణయించింది. అంటే దాదాపు 28 శాతం అప్‌సైడ్‌ ఉంటుందని పేర్కొంది. తాజా ఇన్వెస్ట్‌మెంట్‌ డీల్‌తో కలుపుకుంటే జొమాటొలో అలీబాబా

Most from this category