STOCKS

News


ఐదో రోజూ ఆగని పతనం

Monday 24th September 2018
Markets_main1537784659.png-20530

  • 11వేల దిగువకు నిఫ్టీ
  • 536 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

ముంబై:- మార్కెట్‌ పతనం ఆగట్లేదు. వరసగా 5రోజూ నష్టాల్లోనే ముగిసింది. అమెరికా - చైనా దేశాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల, డాలర మారకంలో రూపాయి విలువ బలహీనపడటం, దేశీయ మార్కెట్‌లో ఎన్‌బీఎఫ్‌సీ డెట్‌ సంక్షోభం, స్టాక్‌ మార్కెట్‌ నుంచి వెనక్కి తరలిపోతున్న ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఇందుకు కారణయ్యాయి. కారణాల నేపథ్యంలో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లలో అ‍మ్మకాల సునామీ వెల్లువెత్తింది. ఫలితంగా మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ సూచీ 536 నష్టపోయి 36,305 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు నష్టపోయి 10,967 వద్ద ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 671 పాయింట్లు (2.62 శాతం) నష్టపోయి 24,925 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఒక్క ఐటీ రంగాలకు చెందిన సూచీ తప్ప అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా నిఫ్టీ రియల్టీ 5.50శాతానికి పైగా నష్టపోయింది.
బజాజ్‌ఫైనాన్స్‌ సర్వీసెస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్‌ఎం, ఐషర్‌మోటర్స్‌, ఇండియన్‌బుల్స్‌ఫైనాన్స్‌ షేర్లు 6నుంచి 7శాతం నష్టపోగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌ షేర్లు 1.50శాతం నుంచి 5శాతం లాభపడ్డాయి.
-     ఈ ఐదు రోజుల్లో సెన్సెక్స్‌ సూచి 1,785 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 540 పాయింట్లను నష్టపోయింది.
-    తమ జీవితకాల గరిష్టస్థాయి నుంచి సెన్సెక్స్‌ సూచీ 6.40శాతం, నిఫ్టీ 6శాతం నష్టపోయాయి.
-    బ్యాంక్‌ నిఫ్టీ సూచి సైతం తన జీవితకాల గరిష్టస్థాయి నుంచి 11శాతం పతనమైంది.
-    సూచీలు గత 7నెలల్లో వరుస ఐదు ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఇంత స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి.



You may be interested

వాట్సప్‌ ద్వారా క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌

Monday 24th September 2018

ఔను.. మీరు చదివింది నిజమే. ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ ద్వారా ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేయవచ్చు. ప్రైవేట్‌ రంగ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ‘భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌’ తాజాగా ఇటువంటి సేవలను ప్రారంభించింది. దేశీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పరిశ్రమలో ఈ తరహా సేవలను ప్రారంభించిన తొలి సంస్థగా భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నిలిచింది. క్లెయిమ్‌ ప్రాసెస్‌ ఇలా.. ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు నామినీ తన వాట్సప్‌ ద్వారా భారతీ

వంద డాలర్లకు క్రూడాయిల్‌?!

Monday 24th September 2018

నిపుణుల అంచనా ఐదేళ్ల విరామం అనంతరం త్వరలో క్రూడాయిల్‌ ధర వంద డాలర్లను తాకే అవకాశం ఉందని అంతర్జాతీయ ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్‌ ఎగుమతులపై అమెరికా విధించే ఆంక్షల కారణంగా చమురు సరఫరా మందగిస్తుందని, ఇందుకు తగ్గట్లు సరఫరా పెంచడంపై ఒపెక్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలదని వివరిస్తున్నారు. దీంతో త్వరలో డిమాండ్‌ కన్నా సప్లై తగ్గే అవకాశాలున్నాయని, అందువల్ల ధర కొండెక్కి కూర్చుంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బ్రెంట్‌ క్రూడ్‌

Most from this category