News


29000 పైకి బ్యాంకు నిఫ్టీ

Friday 10th May 2019
Markets_main1557476369.png-25663

బ్యాంకింగ్‌ రంగ షేర్లలో రికవరీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 29000 స్థాయిని తిరిగి అందుకొంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. నేడు మార్కెట్‌ లాభాల ప్రారంభంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 28,927.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరగడంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌కు తనకు సాంకేతికంగా కీలకమైన 29000 స్థాయిని అందుకుంది. ఇండెక్స్‌లో ఆర్‌బీఎల్‌, పీఎన్‌బీ షేర్లు 2శాతం లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంకు 1.50శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సి్‌స్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం పెరిగింది. అలాగే నేడు క్యూ4 ఫలితాలను విడుదల చేయనున్న స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండయా షేర్లు 0.50శాతం లాభపడ్డాయి. మరోవైపు యస్‌బ్యాంక్‌ షేర్లు 2శాతం, ఇండస్‌ ఇండ్, ఫెడరల్‌ బ్యాంకు షేర్లు 1శాతం నష్టపోయాయి. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు (28,884.60)తో పోలిస్తే 0.60శాతం లాభంతో 29,022.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
ఇక ఇదే సమయానికి మార్కెట్‌ విషయానికోస్తే... ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ ఆరంభిన సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్‌ 10 పాయింట్లను కోల్పోయి 37,540 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లను కోల్పోయి 11,283 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

అంచనాలను అందుకోని ఎస్‌బీఐ

Friday 10th May 2019

దేశీయ అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. క్యు4లో బ్యాంకు రూ. 838.40 కోట్ల నికరలాభం నమోదు చేసింది. అంతకుముందేడాది ఇదే సమయంలో బ్యాంకు రూ. 7718 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజా త్రైమాసికంలో లాభాలు ప్రకటించినా, ఈ లాభం అనలిస్టులు అంచనా వేసిన రూ. 4890 కోట్ల కన్నా చాలా తక్కువ. క్యు3లో బ్యాంకు రూ. 3954 కోట్ల లాభం ఆర్జించింది. అయితే అసెట్‌

ఆర్‌ఐఎల్‌ షేరు కొనొచ్చా?

Friday 10th May 2019

నాలుగు సెషన్లలో 11 శాతం నష్టపోయిన రిలయన్స్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో స్వల్ప శ్రేణిలో కదలాడుతోంది. ఆరంభంలో లాభాల్లో ఉన్న ఆర్ఐఎల్‌ మధ్యాహ్నానికి నష్టాల్లోకి మరలింది. బ్రిటన్‌కు చెందిన బొమ్మల తయారీదారు హామ్‌లేస్‌ను ఆర్‌ఐఎల్‌ అనుబంధ సంస్థ ఆర్‌బ్రాండ్స్‌ సొంతం చేసుకున్నట్లు గురువారం ప్రకటించింది. రూ. 620 కోట్లకు ఈ కొనుగోలు జరిగింది. హామ్‌లేస్‌కు గతంలో ఘన చరిత్ర ఉన్నా ప్రస్తుతం లాభాలు చూపలేక ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి సమయంలో

Most from this category