STOCKS

News


బ్యాంక్‌ నిప్టీ 1శాతం డౌన్‌..!

Friday 26th October 2018
Markets_main1540537557.png-21492

యస్‌బ్యాంక్‌ భారీ పతనం కారణంగా నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ శుక్రవారం దాదాపు 1శాతం నష్టపోయింది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(24,817.45)తో పోలిస్తే అరశాతం నష్టంతో 24,673ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమాయనికి ఇండెక్స్‌లో భాగమైన మొత్తం 12 షేర్లలో 7 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 4 షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా యస్‌ బ్యాంక్‌ 6శాతం నష్టపోయి నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 లూజర్లలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ 3శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1శాతం నష్టపోయాయి. వాటితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఇదే సూచీలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3శాతం లాభపడింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం లాభపడ్డాయి. ఎస్‌బీఐ బ్యాంక్‌ షేరు 1శాతం పెరిగింది.



You may be interested

రూపీ రికవరీ: నష్టాల్లో ఐటీ షేర్లు

Friday 26th October 2018

ఐటీ, బ్యాకింగ్‌ రంగ షేర్ల పతనంతో మార్కెట్‌ శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి రీవకరీ కారణంగా ఐటీ షేర్లు నేటి ట్రేడింగ్‌లో భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ ఐటీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో అన్ని ఇండెక్స్‌ల్లో కెల్లా అత్యధికంగా 2శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపుతో ముగింపు (14071)తో పోలిస్తే 1.50శాతం నష్టపోయి 13,856ల

ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ షేర్లకు ఆర్‌బీఐ షాక్‌..!

Friday 26th October 2018

ముంబై:- ఫైనాన్స్‌రంగ కంపెనీలైన ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 27 - 21శాతం పతనమయ్యాయి. ఇరు కంపెనీలు వేర్వేరుగా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లను ప్రత్యేకంగా లిస్ట్‌ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించడం ఈ షేర్ల పతనానికి కారణమైంది. హోల్డింగ్‌ సంస్థల ద్వారా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకింగ్‌ను నిర్వహిస్తున్న ప్రమోటర్లు తప్పనిసరిగా వీటిని  ప్రత్యేక సంస్థలుగా ఎక్చ్సేంజీల్లో లిస్ట్‌ చేయాలని తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది. స్మాల్‌ ఫైనాన్స్‌

Most from this category