STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Wednesday 12th June 2019
Markets_main1560321106.png-26248

మార్కెట్‌ పతనంలో నెలకొన్న అమ్మకాలతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ బుదవారం ట్రేడింగ్‌లో 1 శాతం క్షీణించింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు  31,219.30ల వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఇండెక్స్‌ ఒక దశలో 1శాతం క్షీణించి 30,947.65ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:30లకు ఇండెక్స్‌ గత ముగింపు(31,265.45)తో పోలిస్తే 276 పాయింట్లు ను కోల్పోయి (0.85శాతం) 30,989.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇం‍డెక్స్‌లో అత్యధికంగా యస్‌బ్యాంక్‌ షేరు 3శాతం క్షీణించింది. కోటక్‌ బ్యాంక్‌ 2శాతం, ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1.50శాతం నష్టపోయాయి. ఎస్‌బీఐ, ఆర్‌బీఎల్‌ షేర్లు 1శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు అరశాతం క్షీణించాయి. మరోవైపు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 0.10శాతం లాభపడ్డాయి. 

ఇ‍క ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 272 పాయింట్లను కోల్పోయి 39,677.58 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 11,882.95 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

వాణిజ్య ఒప్పందం కోసం చైనా ఆతృత

Wednesday 12th June 2019

సుంకాల పెంచడంతో చైనా తీవ్రంగా నష్టపోయింది వాళ్ల కంపెనీలు అమెరికాకు వచ్చేం‍దుకు సిధ్దంగా ఉన్నాయి జీ20 సమ్మిట్‌లో జిన్‌పింగ్‌తో కలిసే అవకాశం ఉంది: ట్రంప్‌  చైనా దిగుమతులపై అమెరికా విధించిన సుంకాల వలన చైనా బాగా నష్టపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ‘ వాళ్లకు తీవ్రంగా నష్టం జరిగింది. చైనా కంపెనీలు ఇప్పుడు అమెరికాకు రావడానికి ప్రయత్నిస్తున్నాయి. మేం సుంకాల విధించడం వలన బిలియన్ల డాలర్లను ‍ఆర్జించాం. ఇప్పుడు చైనా కంపెనీలు

యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌లో కోత..!

Wednesday 12th June 2019

పరిశీలిస్తున్న మూడీస్‌; రేటింగ్‌ తగ్గించే అవకాశం ముంబై: బ్యాంకింగేతర సంస్థలకు అధిక స్థాయిలో రుణాలను మంజూరీ చేసిన నేపథ్యంలో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ తగ్గే అవకాశం ఉందని.. అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ సంకేతాలిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు ‘బీఏ1’ రేటింగ్‌ ఉండగా.. ఇందులో సవరణ జరిగే అవకాశం ఉందనే దిశగా మూడీస్‌ వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది మార్చి నాటికి బ్యాంక్‌ మొత్తం

Most from this category