STOCKS

News


లాభాల బాటలో ఆటో షేర్లు

Friday 10th August 2018
Markets_main1533892969.png-19124

ముంబై:- మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ..,  ఆటో రంగ షేర్లు మాత్రం లాభాల బాటపట్టాయి. ఎన్‌ఎస్‌ఈ అటో రంగ సూచీలకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో 1శాతం వరకూ ర్యాలీ చేసింది. సూచీలోని ఐషర్‌ మోటర్స్‌ (5శాతం), మహీంద్రా అండ్‌ మహీం‍ద్రా (2శాతం) లాభపడంతో ఈ రంగానికి చెందిన షేర్లు లాబాల బాట పట్టాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(10814)తో పోలిస్తే అరశాతం లాభపడి 10850ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలో మొత్తం 16 షేర్లలో  6షేర్లు లాభపడగా, 10 షేర్లు నష్టపోయాయి. ఇదే సమయానికి ఈ సూచీలోని ఐషర్‌ మోటర్‌ అత్యధికంగా 5శాతం లాభపడగా, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ , బాష్‌ లిమిడ్‌ 3శాతం లాభపడగా హీరోమోటోకార్పో,  మహీంద్రా అండ్‌ మహీం‍ద్రా షేర్లు 2శాతం లాభపడ్డాయి. అదే విధంగా మారుతి షేరు స్వల్పంగా 0.40శాతం లాభపడింది. మరోవైపు ఇదే సూచీలోని టాటామోటర్‌ డీవీఆర్‌, టాటా మోటర్స్‌ షేర్లు 3శాతం నష్టపోయాయి. అపోలో టైర్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, అశోక్‌ లేలాండ్‌, మదర్‌ సుమి, టీవీఎస్‌మోటర్స్‌ షేర్లు 2నుంచి 1శాతం నష్టపోయాయి. అలాగే బజాజ్‌ అటో, భారత్‌ ఫోర్జ్స్‌, అమరరాజా బ్యాటరీస్‌ అరశాతం వరుకు నష్టపోయాయి.You may be interested

ఈ మూడు బ్యాంకుల్లో అప్‌ట్రెండ్‌

Friday 10th August 2018

స్టాక్‌ మార్కెట్‌ పరుగులకు లార్జ్‌క్యాప్స్‌ కారణమన్నారు నిర్మల్‌ బ్యాంగ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ గిరీశ్‌ పాయ్‌. క్రూడ్‌ ధరల తగ్గుదల, స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి భారత్‌ మార్కెట్లలోకి రావడం వంటి అంశాలు వల్ల ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్స్‌పై బుల్లిష్‌ ఉన్నారని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. దేశీ ఇన్వెస్ట్‌మెంట్లు తగ్గినప్పటికీ సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లు బాగా పెరిగాయని

ఎస్‌బీఐ నష్టాలు @ రూ.4,876 కోట్లు

Friday 10th August 2018

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌, క్యూ1) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. బ్యాంక్‌ రూ.4,876 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇక నికర వడ్డీ ఆదాయం రూ.21,798 కోట్లుగా నమోదయ్యింది. స్థూల ఎన్‌పీఏలు 10.69 శాతంగా, నికర ఎన్‌పీఏలు 5.29 శాతంగా ఉన్నాయి. గత త్రైమాసికంలో స్థూల ఎన్‌పీఏలు 10.91 శాతంగా , నికర

Most from this category