STOCKS

News


ఇప్పట్లో మార్కెట్‌ క్రాష్‌ ఉండదు: ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌

Sunday 9th September 2018
Markets_main1536517559.png-20101

దేశీయ స్టా్క్‌‌ మార్కెట్లు సమీప కాలంలో పతనమయ్యే అవకాశాల్లేవని, అలాగని సమీప కాలంలో వేగంగా పెరిగే అవకాశాలు కూడా లేవని ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌ గ్రూపు చైర్మన్‌ సుదీప్‌ బందోపాధ్యాయ తెలిపారు. ఫార్మా, ఆటోమొబైల్‌ రంగంలో ఎంపిక చేసిన స్టాక్స్‌ను పెట్టుబడులకు ఎంచుకోవచ్చని సూచించారు. ఓ ‍ప్రముఖ వార్తా సంస్థకు ఈ మేరకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

అంతర్జాతీయ సమస్యలే మార్కెట్లకు ఆందోళన కలిగించే అంశాలుగా బందోపాధ్యాయ చెప్పారు. రూపాయి పతనం అన్నది ఓ ఇన్వెస్టర్ల వర్గాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక చమురు ధరలు కూడా వేగంగా పెరిగిపోతే అది నిజంగానే చాలా మందికి, మొత్తం మన ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమేనన్నారు. దీనికితోడు వాణిజ్య యుద్ధాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇది సమసిపోకపోతే అస్థిరపరిచే అంశమని, ఇవన్నీ మార్కెట్‌కు ఆందోళనకరమైనవిగా బందోపాధ్యాయ చెప్పారు. దేశీయంగా మాత్రం సానుకూలంగా ఉన్నామని, వర్షాలు మంచిగా ఉండడం, మొదటి త్రైమాసికంలో కార్పొరేట్‌ పనితీరు అద్భుతంగా ఉండడం సానుకూలతలుగా పేర్కొన్నారు. దీని ప్రభావమే గడిచిన నెల, నెలన్నరగా మార్కెట్లు ర్యాలీ చేయడానికి కారణంగా చెప్పారు. 

 

ఫార్మా, ఆటో మొబైల్‌
ఫార్మా రంగం పట్ల సానుకూలంగా ఉన్నట్టు బందోపాధ్యాయ చెప్పారు. ఈ రంగంలో ఇన్వెస్ట్‌ చేయడాన్ని తప్పక పరిశీలించొచ్చన్నారు. ‘‘నియంత్రణ పరమైన అవరోధాలు, సంబంధిత అంశాల కారణంగా ఫార్మా కంపెనీల విషయంలో అనిశ్చితి నెలకొంది. సన్‌ఫార్మాలో ఇదే చూశాం. కానీ, వీటిని అధిగమించేందుకు కొన్ని ఫార్మా కంపెనీలను కలిపి ఒక బాస్కెట్‌గా తప్పకుండా కొనుగోలు చేయవచ్చు. సన్‌ఫార్మా, అరబిందో, నాట్కో ఫార్మా, క్యాడిలా, టోరెంట్‌ ఫార్మాలను ఫార్మా బాస్కెట్‌గా సిఫారసు చేస్తున్నాం. అస్థిరతల మార్కెట్‌లో, కరెన్సీ పడిపోతున్న వేళ ఫార్మా రంగం కచ్చితంగా మంచి పెట్టుబడి ఆప్షన్‌ అవుతుంది. కొంత కాలంగా ఈ రంగం మంచి పనితీరు చూపించడం లేదు. షేర్ల ధరలు ఆకర్షణీయంగా ఉన్నాయి’’ అని సుదీప్‌ బందోపాధ్యాయ వివరించారు. 

 

ఆటోమొబైల్‌ రంగం పట్ల కూడా బుల్లిష్‌గా ఉన్నామని ఆయన చెప్పారు. ముఖ్యంగా వాణిజ్య వాహన కంపెనీలైన అశోక్‌లేలాండ్‌ను సిఫారసు చేస్తున్నట్టు చెప్పారు. అంచనాలకు అనుగుణంగా మంచి పనితీరు ఉంటుందని, మొదటి ‍త్రైమాసికంలో ఇదే జరిగిందన్నారు. ద్విచక్ర వాహన రంగంలో హీరో మోటోకార్ప్‌ను సిఫారసు చేశారు. ఎన్నికల ముందు సంవత్సరం కావడం, మంచి వర్షాలతో గ్రామీణంగా సాగు ఆదాయం పెరగడం వంటికి కంపెనీకి లాభించే అంశాలుగా పేర్కొన్నారు. బజాజ్‌ ఆటో నుంచి ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనం విడుదలపై ప్రకటన రావొచ్చని, భారీ వాటాను కంపెనీ ఆశిస్తోందని, ద్విచక్ర వాహన విభాగంలో ఈ కంపెనీ కూడా కొనుగోలుకు పరిశీలించొచ్చన్నారు. టైటాన్‌ కంపెనీని ఆయన సిఫారసు చేశారు.



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 50 పాయింట్లు డౌన్‌

Monday 10th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:41 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 50 పాయింట్ల నష్టంతో 11,585 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో శుక్రవారం నాటి ముగింపు 11,632 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా

బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ ఎంపిక భిన్నం

Sunday 9th September 2018

బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు, ఇన్వెస్ట్‌ చేయదలిచిన వారు తప్పకుండా కొన్ని అంశాలను కూలంకుషంగా తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఇటీవలి మార్పుల అనంతరం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ప్రాథమికంగా 10 కేటగిరీలు, హైబ్రిడ్‌ ఫండ్స్‌లో ఆరు కేటగిరీలు ఉన్నాయి. వీటన్నింటికీ ఈక్విటీల్లో ఎంత, డెట్‌లో ఎంత మేర ఇన్వెస్ట్‌ చేయాలి అనే విషయంలో కచ్చితమైన పరిమితులు నిర్ణయించడం జరిగింది. ఒక్క బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ విషయంలో

Most from this category