STOCKS

News


టెలికాం షేర్ల లాభాల మోత

Friday 14th December 2018
Markets_main1544779608.png-22938

కాల్‌ ధరలపై ట్రాయ్ విధించిన ఆంక్షలను టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్‌మెంట్ ఎండ్ అప్పిలేట్ ట్రిబ్యునల్(టీడీఎస్‌ఏటీ) తోసిపుచ్చడంతో శుక్రవారం టెలికాం షేర్లు లాభాల మోత మోగిస్తున్నాయి. టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో రంగప్రవేశంతో తమ సబ్‌స్క్రెబర్లను నిలుపుకునేందుకు టారిఫ్ రేట్లను గణనీయంగా తగ్గించడంతో గత రెండేళ్లుగా పోటీదారు కంపెనీ భారీగా నష్టపోయాయి. టీడీఎస్‌ఏటీ తాజా తీర్పుతో రేట్ల విధింపు అంశంపై  ఇప్పుడు ప్రైవేట్ ఆపరేటర్లు స్వేచ్ఛను కలిగి ఉంటారు కాబట్టి ఆదాయం పెరగవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్స్ అయిన భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా షేర్లు నేటి మార్కెట్‌లో ర్యాలీ చేశాయి. బీఎస్‌ఈలో ఈ రెండు కంపెనీల స్టాక్స్ దాదాపు 10శాతం పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో టాప్‌-5 గెయినర్లలో భారతిఎయిర్టెల్‌ 5శాతం లాభంతో ప్రథమస్థానంలో కొనసాగుతుంది.
భారతీ ఎయిర్‌టెల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.305.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 10శాతం ర్యాలీ చేసి రూ.333.40ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:45ని.లకు షేరు గతముగింపు(రూ.303.10)తో పోలిస్తే 4.52శాతం లాభంతో రూ.316.80ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.276.85లు రూ.547.50లుగా నమోదయ్యాయి.
వోడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.35.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 10శాతం ర్యాలీ చేసి రూ.37.70ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:45ని.లకు షేరు గతముగింపు(రూ.34.90)తో పోలిస్తే 4శాతం లాభంతో రూ.36.20ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.32.00లు రూ.118.90లుగా నమోదయ్యాయి.



You may be interested

10800 పైన నిఫ్టీ

Friday 14th December 2018

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి అరగంట కొనుగోళ్ల కారణంగా లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్‌ సూచీ 33 పాయింట్ల లాభంతో 35,963 వద్ద, నిఫ్టీ సూచీ 14 పాయింట్లు లాభపడి 10800 పైన 10,805 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 26,826 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియల్టీ షేర్లు లాభపడగా, ఫైనాన్స్‌ సర్వీసెన్‌, ఫార్మా రంగాలకు చెందిన

నిఫ్టీ ఫ్యూచర్లపై ఎంఎఫ్‌ల కన్ను

Friday 14th December 2018

ఏడాది చివరకు రిటర్న్‌ను పెంచుకునే నిమిత్తం పలు మ్యూచువల్‌ ఫండ్స్‌ నిఫ్టీ ప్యూచర్స్‌ను తెగ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ హౌసులు తమ పోర్టుఫోలియోలో దాదాపు 9 శాతం నిఫ్టీ ఫ్యూచర్స్‌ను చేర్చుకున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వాల్యూ డిస్కవరీ, యాక్సిస్‌ మల్టిక్యాప్‌, యాక్సిస్‌ బ్లూచిప్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్లుచిప్‌ ఫండ్‌, కోటక్‌ స్టాండర్డ్‌ మల్టిక్యాప్‌, కోటక్‌ ఇండియా కాంట్రా ఫండ్‌ తదితరాలు పోర్టుఫోలియోల్లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ను

Most from this category