STOCKS

News


టెక్‌ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవొచ్చు!

Monday 10th September 2018
Markets_main1536572669.png-20131

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో టెక్నాలజీ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని జూలియస్‌ బేర్‌కు చెందిన మార్క్‌ మాథ్యూస్‌ పేర్కొన్నారు. రూపాయి కష్టాలకు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవ్వడం, వాషింగ్టన్‌-బీజింగ్‌ మధ్య నడుస్తోన్న వాణిజ్య యుద్ధం కారణమని తెలిపారు. రానున్న రోజుల్లో ఈక్విటీ మార్కెట్‌ను ఏ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  
మనమున్న ప్రాంతం మనపై ప్రభావం చూపుతుందని మాథ్యూస్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి దాకా టర్కీ లేదా ఇండోనేసియా మార్కెట్లలో ఉన్న ఇన్వెస్టర్లు గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు. అయితే గత వారం టర్కీ లిరా, అర్జెంటీనా పెసో బలమైన ర్యాలీ చేశాయని పేర్కొన్నారు. భారీగా పతనమైన మార్కెట్లలో అవకాశాలుంటాయని తెలిపారు. అర్జెంటీనా మాంధ్యం పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఇవి అప్పుడు పరిష్కారం కాకపోవచ్చని, వచ్చే ఏడాది ఇదే సమయానికి ఈ పరిస్థితుల్లోంచి బయటపడొచ్చని అంచనా వేశారు. బాండ్‌ ఈల్డ్స్‌ అధిక రేట్లు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. 
కరెన్సీ విషయానికి వస్తే రెండు అంశాలను గమనించాల్సి ఉందని మాథ్యూస్‌ పేర్కొన్నారు. ఒకటేమో.. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. ఉద్యోగుల వేతనాల పెరుగుదల్లో మంచి వృద్ధి కనిపిస్తోందని తెలిపారు. లేబర్‌ మార్కెట్‌ బలంగా ఉందని పేర్కొన్నారు. నిరుద్యోగిత 3.9 శాతానికి తగ్గిందని తెలిపారు. వేతనాలు ఇంకా పెరగొచ్చని, తద్వారా ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. జెరోమ్‌ పావెల్‌ సరైన మార్గంలో వెళ్తున్నారని తెలిపారు. ఫెడ్‌ ఒకవేళ రేట్లు పెంచకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థలో అధిక వృద్ధి నమోదవుతుందని, అదే రేట్లు పెంచితే వర్ధమాన మార్కెట్లలో సంక్షోభం రావొచ్చని పేర్కొన్నారు. అయితే రానున్న కాలంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉందన్నారు. రెండోదానికొస్తే.. అది చైనా అని తెలిపారు. అమెరికాతో వాణిజ్య యుద్ధం ఇప్పటికీ మంచి చర్య కాదని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా దిగుమతులపై మరిన్ని టారిఫ్‌లను విధిస్తామని హెచ్చరించారాని తెలిపారు. యాపిల్‌ కూడా అమెరికాలోనే ఫ్యాక్టరీలు నిర్మించుకోవాలని సూచించారని పేర్కొన్నారు. ట్రంప్‌ చైనాతో వాణిజ్య చర్చలకు సానుకూలముగా లేరని తెలిపారు. ఇక చైనా.. అమెరికా మధ్యంతర ఎన్నికల కోసం వేచిచూస్తోందని పేర్కొన్నారు. ఇందులో ఒకవేళ రిపబ్లికన్‌ పార్టీ గెలుపొంది, ట్రంప్‌కు పూర్తి మెజారిటీ వస్తే.. అప్పుడు చైనా మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొవలసి వస్తుందని తెలిపారు. అప్పుడు చైనా మాంధ్యంలోకి వెళ్లొచ్చని అంచనా వేశారు. అదేసమయంలో చైనా ప్రొడక్టులపై అధిక పన్నులు విధించి, వాటిని దిగుమతి చేసుకుంటే.. అప్పుడు అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి వినియోగం నెమ్మదిస్తుందని తెలిపారు. అయితే పోల్స్‌ గమనిస్తే డెమొక్రటిక్‌ పార్టీ వారు గెలుపొందే అవకాశముందని పేర్కొన్నారు. ఇలా జరిగితే ట్రంప్‌ జోరు తగ్గుతుందని, అది చైనాకు ప్రయోజనకరమని తెలిపారు.  
టెక్నాలజీ రంగం, సోషల్‌ మీడియా కంపెనీల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మాట్లాడాల్సిన అవసరం లేదని, చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. అమెరికాలో సోషల్‌ మీడియా ఇండెక్స్‌ కీలక మద్దతు స్థాయిల వద్ద ఉందని తెలిపారు. టెక్నాలజీ స్టాక్స్‌ కీలక స్థాయిల్లో ఉన్నాయని, వాటిని ఎంపిక చేసుకోవచ్చని పేర్కొన్నారు. You may be interested

ఫార్మా షేర్లు.. అండర్‌వ్యాల్యూనే!!

Monday 10th September 2018

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లపై ఒత్తిడి నెలకొని ఉంది. కన్సాలిడేషన్‌ కొనసాగుతోంది. తొలి రోజే ఈ విషయం అర్ధమైంది. రూపాయి పతనం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది. ‘వర్ధమాన మార్కెట్లకు ఇది పరీక్షలాంటి సమయం. అమెరికాకు నిధులు వెళ్లిపోతున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా ఫెడ్‌ రేట్ల పెంపు ఇందుకు కారణం. అందువల్ల వర్ధమాన మార్కెట్లపై దీని ప్రభావం ఉంటుంది’ అని మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఫౌండర్‌ సౌరభ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. ఆయన ఒక

కొత్త బాస్‌... యాక్సిస్‌ బ్యాంక్‌కు పాజిటివ్‌

Monday 10th September 2018

కొత్త మేనేజ్‌మెంట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌కు అతిపెద్ద పాజిటివ్‌ అంశమని ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌కు చెందిన కూనల్‌ షా పేర్కొన్నారు. ఎర్నింగ్స్‌ మెరుగుదల, రుణ నాణ్యత పనితీరు వంటి అంశాలపై రీరేటింగ్‌ ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. కొత్త సీఈవో (హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఎండీ అమితాబ్‌ చౌదరీ యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవోగా, ఎండీగా రావడం) నియామకం యాక్సిస్‌ బ్యాంక్‌కు సానుకూలమని తెలిపారు.

Most from this category