STOCKS

News


10800పైన ఉన్నంత వరకు సేఫే!

Saturday 14th July 2018
Markets_main1531560597.png-18320

నిఫ్టీపై నిపుణుల అంచనా
చాలా రోజుల తర్వాత నిఫ్టీ 11వేల పాయింట్ల పైన ముగిసింది. గత ఆల్‌టైమ్‌ హైకి దగ్గరలో ట్రేడవుతోంది. మరో జీవితకాల గరిష్ఠానికి నిఫ్టీ చేరుతుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. అయితే పైస్థాయిలో నెలకొన్న నిరోధం చాలా బలంగా కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం కొన్ని స్టాకులపై ఆధారపడి జరుగుతున్న ప్రస్తుత ర్యాలీకి అంత బలం ఉండకపోవచ్చని వీరి భావన. నిఫ్టీ గతవారం చూపిన జోరు చూస్తే వచ్చే వారం తప్పక పాత గరిష్ఠాన్ని ఒకమారు తాకవచ్చు. నిఫ్టీ ప్రస్తుతం తన అధోముఖ ట్రెండ్‌లైన్‌కు ఎగువన పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. అయితే మరికొన్ని సెషన్లు ఈ లైన్‌కు పైన ముగిస్తేనే బ్రేకవుట్‌ను నిర్ధారించుకోవచ్చు. వెనువెంటనే పరుగులు తీయకుండా కొన్ని రోజులు పరిమిత కన్సాలిడేషన్‌ చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే 10800 పాయింట్లను కాపాడుకున్నంత వరకు కాస్త అటుఇటుగా మరోమారు ఆల్‌టైమ్‌ హైని తాకడం మాత్రం ఖాయమన్నది ఎక్కువమంది నిపుణుల అంచనా. వారం ఆరంభంలో స్తబ్దుగా ఉన్నా క్రమంగా జోరు పెరగవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బై ఆన్‌ డిప్స్‌ సూత్రాన్నే పాటించవచ్చు. లాంగ్‌‍్సకు స్టాప్‌లాస్‌గా 10800 పాయింట్లను ఉంచుకోవాలి. పైస్థాయిలో 11100, 11175 పాయింట్లు తక్షణ నిరోధాలు. దిగువన 10910, 10800 తక్షణ మద్దతు స్థాయిలు. మార్కెట్లు ఇప్పటికిప్పుడు పడిపోవనేందుకు కొత్త ఐపీఓ లిస్టింగ్స్‌ ధరలు ఊతమిస్తున్నాయి. మార్కెట్లో అంతర్లీన అలజడి ఉంటే కొత్త లిస్టింగ్స్‌ ధరలు భారీగా పతనమవుతాయి. టీసీఎస్‌, ఇన్ఫీ ఫలితాలతో క్యు1 సీజన్‌ ఆరంభమైంది. కంపెనీల ఫలితాలపై ఇన్వెస్టర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎర్నింగ్స్‌ బాగుండే కొద్దీ సూచీలు మరింత ముందుకు కొనసాగుతాయి. దీర్ఘకాలానికి ఓఎంసీ, రియల్టీ, సిమెంట్‌, టెక్స్‌టైల్స్‌, ఇన్‌ఫ్రా రంగాలు ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద కనిపిస్తున్నాయి. మంద మనస్థత్వంలో వ్యవహరించకుండా ఆచితూచి ఎంపిక చేసుకొని పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. You may be interested

పసిడి పయనం ఎటువైపు..

Saturday 14th July 2018

అమెరికా బాండ్‌ ఈల్డ్, వడ్డీ రేట్లు, డాలర్‌ పెంపు భయాలు స్వల్పకాలంలో దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లకు విశ్లేషకుల సూచన బంగారంపై ఒత్తిడి నెలకొని ఉంది. ప్రసుత్తం ఔన్స్‌ విలువ 1,250 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పుత్తడి వెలుగు తగ్గడానికి డాలర్‌ బలపడటం ప్రధాన కారణం. మరి గోల్డ్‌ పయనం ఎటువైపు? కరక‌్షన్‌ దిశగా అడుగులు వేస్తోందా? కమోడిటీ నిపుణులు అనిశ్చితి ఇంకా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటాను పెంచుకునే

‍పెన్షన్‌ సమస్య? పరిష్కారముంది..

Saturday 14th July 2018

మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్‌ తీసుకుంటున్నారా? మీకు పెన్షన్‌కు సంబంధించి ఏమైనా సమస్యలున్నాయా? మీ సమస్యను ఫిర్యాదు చేసినా అది పరిష్కారం కాలేదా? ప్రభుత్వ విభాగం కానీ, బ్యాంక్‌ ఉద్యోగులు కానీ స్పందించడం లేదా? లేకపోతే సమస్యను ఎవరికి తెలియజేయాలో తెలియడం లేదా? అయితే మీరు www.pensionersportal.gov.in వెబ్‌సైట్‌ చూడండి. ఇందులో మీ సమస్యను ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ మీరు చేసిన ఫిర్యాదు సంబంధిత విభాగానికి చెందిన సీనియర్‌

Most from this category