STOCKS

News


ఆల్‌టైం హైకి టెక్‌ మహీంద్రా

Wednesday 6th February 2019
Markets_main1549450150.png-24053

ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా షేర్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ వెల్లడించిన క్యూ3 ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకున్నాయి. ఫలితంగా నేడు ఎన్‌ఎస్‌ఈలో షేరు గత ముగింపు(రూ.751.00)తో పోలిస్తే 4.50శాతం లాభంతో రూ.784.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు మార్కెట్‌లో ఐటీ షేర్ల కొనుగోళ్ల సెంటిమెంట్‌ కారణంగా షేరు మరింత ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో 8.50శాతం లాభపడి రూ.814.50ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ షేర్లకిది ఇది వరుసగా 5వరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. చివరికి 8శాతం లాభంతో రూ.812.00ల వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం.



You may be interested

క్రెడిట్‌ కార్డు ఇలా వాడితే.. పరపతి పెరిగినట్టే!

Wednesday 6th February 2019

క్లిష్ట సమయాల్లోనూ ఖర్చు చేసేందుకు ఉపయోగపడే ఆధారం క్రెడిట్‌ కార్డు. క్రెడిట్‌ కార్డుతో కొనుగోళ్లపై ఇటీవలి కాలంలో వివిధ సంస్థలు ఎక్కువ డిస్కౌంట్లు కూడా ఇస్తున్న సందర్భాలను చూస్తున్నాం. అయితే, క్రెడిట్‌ కార్డు అంటే మనసులో ఆందోళన పెట్టుకోకుండా, తమ క్రెడిట్‌ స్కోరు పెంచుకునేందుకు ఇదొక మంచి సాధనంగా చూడొచ్చు. ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ 2018 మూడో త్రైమాసికం నివేదిక ప్రకారం... బ్యంకు కార్డుల యాక్సెస్‌ పొందుతున్న వారి శాతం జీవిత

ఈ షేర్లే నిఫ్టీని నడిపించాయ్‌

Wednesday 6th February 2019

గతేడాది అక్టోబర్‌1 తర్వాత నిఫ్టీ ఈ బుధవారం 11,000 పాయింట్ల స్థాయిని అందుకుంది. అక్టోబర్‌ తర్వాత తీవ్ర పతనానంతరం ఈ ఏడాది జనవరి నుంచి మార్కెట్‌ క్రమేపీ పెరుగుతూ వచ్చింది. 50 షేర్లు భాగంగా కలిగిన నిఫ్టీ-50  గత అక్టోబర్‌ స్థాయిని అందుకోవడానికి కేవలం 15 షేర్లు మాత్రమే తోడ్పాటునందించాయి. అన్నింటికంటే అధికంగా 17.68 శాతం  యాక్సిస్‌ బ్యాంక్‌ ర్యాలీ జరపగా, 15.5 శాతంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ద్వితీయస్థానాన్ని ఆక్రమించింది. టైటాన్‌,

Most from this category