STOCKS

News


మార్కెట్‌ చీకట్లో టీసీఎస్‌ వెలుగులు

Monday 24th September 2018
Markets_main1537770944.png-20517

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటే.. ఇండెక్స్‌లలో హెవీ వెయిట్‌ షేరు అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మ్రాతం లాభాలతో దూసుకెళ్తోంది. ఈ స్టాక్‌ సోమవారం కొత్త జీవిత కాల గరిష్ట స్థాయిలను నమోదు చేసింది. ఇండెక్స్‌లలో అధిక వెయిటేజీ ఉన్న షేర్లలో కెల్లా గత 4 వారాల్లో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలకు చేరిన ఒకే ఒక స్టాక్‌ టీసీఎస్‌ మాత్రమే. 
ఉదయం 11: 55 సమయంలో టీసీఎస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.96 శాతానికిపైగా పెరుగుదలతో రూ.2,165 వద్ద ట్రేవుతోంది. కాగా ఇంట్రాడేలో ఒకానొక సమయంలో 2,177 జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. స్టాక్‌ పెరుగుదలకు రూపాయి పతనం కలిసొచ్చింది. ఇకపోతే టీసీఎస్‌ మార్కెట్‌క్యాప్‌ రూ.8,30,150 కోట్లుగా ఉంది. సెక్టోరల్‌ ఇండెక్స్‌లలోకెల్లా నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ మాత్రమే లాభాల్లో ఉంది. ఇది 2 శాతానికిపైగా లాభపడింది. విప్రో 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయికి స్వల్ప దూరంలో ఉన్నాయి. 

మరోవైపు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌క్యాప్‌ రూ.7,71,768 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.1,215గా ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి రూ.1,329. రూ.8 లక్షల కోట్ల మార్కెట్‌క్యాప్‌ను సాధించిన తొలి కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. దీని తర్వాత టీసీఎస్‌ ఈ మార్క్‌ను అందుకుంది. అయితే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు పడిపోవడంతో కంపెనీ మార్కెట్‌క్యాప్‌ కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం రూ.8 లక్షల కోట్ల మార్కెట్‌క్యాప్‌ ఉన్న కంపెనీ టీసీఎస్‌ మాత్రమే. 


tcs

You may be interested

నష్టాల్లో అటో షేర్లు

Monday 24th September 2018

ముంబై:- మారుతిసుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్ల పతనంతో సోమవారం అటో షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 3.50శాతం నష్టపోయింది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు (10,407)తో పోలిస్తే 3శాతం నష్టంతో 10,054 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అటో షేర్లకు పతనానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదే సమయానికి నిఫ్టీ అటో ఇండెక్స్‌లోని మొత్తం 11

కొనసాగుతున్న రియల్టీ షేర్ల పతనం

Monday 24th September 2018

రియల్టీ షేర్ల పతనం వరుసగా రెండోరోజూ కొనసాగుతోంది. గత ట్రేడింగ్‌లో 3.50శాతం నష్టపోయిన నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ తాజాగా సోమవారం ట్రేడింగ్‌లో మరో 4.50శాతం వరకు నష్టపోయింది. ఉదయం గం.11:15ని.లకు రియల్టీ ఇండెక్స్‌ గతముగింపు(248.70)తో పోలిస్తే 4శాతం నష్టంతో 239.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లో భాగమైన మొత్తం 9షేర్లలో అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా డీఎల్‌ఎఫ్‌ షేరు 7శాతం నష్టంతో

Most from this category