దుమ్మురేపిన టీసీఎస్
By Sakshi

ముంబై:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంచనాలను మించి లాభాలను సాధించడంతో టీసీఎస్ షేరు గురువారం ఆల్‌టైం హైని నమోదు చేసింది. అన్ని వ్యాపార విభాగాలు మెరుగైన పనితీరును కనబర్చడంతో టీసీఎస్ ఈ క్యూ1 కాలానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను బుధవారం ప్రకటించింది. ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటంతో నేడు ట్రేడింగ్ ప్రారంభం నుంచే టీసీఎస్ షేరు దుమ్మురేపింది. రెండు రోజుల వరుస నష్టాల ముగింపు తరువాత నేడు బీఎస్ఈలో 1.20శాతం లాభంతో రూ.1900.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్ల మద్దతుతో షేరు మరింత పరుగులు పెట్టింది. ఓ దశలో 6శాతం ర్యాలీ చేసి రూ. 1990.00ల వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. షేరు ఆల్‌టైం హైకి చేరిన నేపథ్యంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 7.55 లక్షల కోట్లకు చేరింది. ఉదయం గం.11:15ని.లకు షేరు గతముగింపు ధర(రూ.1877)తో పోలిస్తే రూ.3శాతం లాభంతో రూ.1933.50ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 1166.50 రూ. 1990.00 లుగా నమోదయ్యాయి.
You may be interested
యస్ సెక్యూరిటీస్ మిడ్‌క్యాప్ సిఫార్సులు
Wednesday 11th July 2018వచ్చే మూడునాలుగు వారాల్లో 15 శాతం వరకు రాబడినిచ్చే మూడు మిడ్‌క్యాప్స్‌ను యస్ సెక్యూరిటీస్ సిఫార్సు చేస్తోంది. 1. ఏఐఏ ఇంజనీరింగ్: కొనొచ్చు. టార్గెట్ రూ. 1855. స్టాప్‌లాస్ రూ. 1500. వీక్లీ చార్టుల్లో ఊర్ధ్వముఖ త్రిభుజాకృతి పాటర్న్ నుంచి బ్రేకవుట్ ఇచ్చేందుకు తయారుగా ఉంది. ఈ త్రిభుజాకృతి అవధి రేఖ రూ. 1645 వద్ద ఉంది. దీన్ని భారీ వాల్యూంలతో దాటితే మరింత అప్‌ట్రెండ్ కనిపిస్తుంది. డైలీ చార్టుల్లో ఇప్పటికే
లుపిన్, హెచ్‌పీసీఎల్ అవుట్!
Wednesday 11th July 2018అక్టోబర్‌లో నిఫ్టీ పునర్వ్యవస్థీకరణ గోద్రేజ్కన్జూమర్ ప్రొడక్ట్స్, జేఎస్‌డబ్ల్యుస్టీల్ ఇన్ భారత్‌లో అత్యంత పాపులర్ సూచీ నిఫ్టీలోకి అక్టోబర్‌లో కొత్త చేరికలు, తీసివేతలు జరగనున్నాయి. నిఫ్టీ 100లో ఉండే కంపెనీల నుంచి ఫ్రీఫ్లోట్ క్యాపిటలైజేషన్, లిక్విడిటీ, సూచీలపై అవి చూపగల ప్రభావం ఆధారంగా నిఫ్టీ 50 సూచీలోకి తీసుకుంటారు. ఇలా తీసుకునే కంపెనీల స్టాకులకు డెరివేటివ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆరునెలల డేటా ఆధారంగా రెండు మార్లు నిఫ్టీలోకి ఈ కూడికలు తీసివేతలు చేస్తుంటారు.