News


టీసీఎస్‌ షేరు కొనొచ్చు.. కానీ ఎప్పుడు?

Friday 11th January 2019
Markets_main1547197186.png-23533

క్యు3 ఫలితాల అనంతరం షేరుపై రివ్యూ
బలమైన డీల్స్‌ గెలుచుకోవడం, డిజిటల్‌ విభాగంలో మంచి వృద్ది నమోదు కావడంతో టీసీఎస్‌ క్యు3 ఫలితాలు ఆకట్టుకున్నాయి. అయితే మార్జిన్లు క్రమానుగతంగా బలహీనపడడం ఆందోళనకరమని అనలిస్టుల అభిప్రాయం. మార్జిన్లపై భయాలతో పలు బ్రోకింగ్‌ సంస్థలు టీసీఎస్‌ ఎర్నింగ్స్‌ అంచనాలను తగ్గించాయి. యూఎస్‌లో మందగమనం వస్తే రెవెన్యూ వృద్ధి బలహీనపడవచ్చంటున్నాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్‌ షేరు పోర్టుఫోలియోలో ఉండాల్సిన స్టాకే కానీ ప్రస్తుత ధరల వద్ద కాదని సూచిస్తున్నాయి.  
- షేరు ధర గరిష్ఠాల నుంచి దాదాపు 20 శాతం దిగివచ్చింది. అయినా రీరేటింగ్‌కు ఇంకా సమయం ఉంది. వాల్యూషన్లు ఇంకా అధికంగానే ఉన్నాయి. రూ. 1825కు అటుఇటుగా కొనుగోలు చేయవచ్చు.- కోటక్‌ సెక్యూరిటీస్‌.
- కంపెనీ మేనేజ్‌మెంట్‌ కామెంట్లు చూస్తే మార్జిన్లు ఇబ్బందుల్లో పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. తోటి సంస్థలతో పోలిస్తే మార్జిన్‌ బలహీనత టీసీఎస్‌కే ఎక్కువగా ఉంది.- మోతీలాల్‌ ఓస్వాల్‌
-సబ్‌ కాంట్రాక్టర్‌ వ్యయాలు పెరగడం ఇబ్బందే, దీన్ని తగ్గించుకునేందుకు కంపెనీ జోరుగా నియామకాలు చేపట్టింది. దీంతో వ్యయాలు మరింత పెరగవచ్చు. ప్రస్తుత రేటింగ్‌ ‘సెల్‌’. టార్గెట్‌ రూ. 1545.-నిర్మల్‌ బాంగ్‌ రిసెర్చ్‌
- ఈపీఎస్‌ అంచనాలు సాధారణంగా ఉన్నాయి. ప్రస్తుత రేటింగ్‌ ‘కొనొచ్చు’. టార్గెట్‌ రూ. 2430. -హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.



You may be interested

ఎయిర్‌టెల్‌కు డౌన్‌గ్రేడ్‌ షాక్‌​..!

Friday 11th January 2019

గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ మెరిలించ్‌ దేశీయ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లకు షాకిచ్చింది. రానున్న రోజుల్లో ఎయిర్‌టెల్‌ ఎదుర్కోనున్న సవాళ్లను దృష్టి పెట్టుకుని ఆ కంపెనీ షేరు రేటింగ్‌ను బ్యాంక్‌ ఆఫ్‌ మెరిలించ్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది. అలాగే షేరు టార్గెట్‌ ధరను ప్రస్తుత ధర నుంచి రూ.300లకు కుదించింది. ఫలితంగా ఎయిర్‌టెల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనై ఇంట్రాడే 2.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.2:20లని.కు షేరు

మార్కెట్‌ యూ టర్న్‌

Friday 11th January 2019

ఐటీ, అటో, ఇన్ఫ్రా, షేర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి మార్కెట్‌ నష్టాల బాట పట్టింది. నిఫ్టీ 10800 మార్కును, సెన్సెక్స్‌ 36వేల మార్కును కోల్పోయాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌ అండ్‌ టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్ల క్షీణత సూచీలను నష్టాల్లోకి నెట్టాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల ట్రేడింగ్‌ను అందుకున్న సూచీలు నేడు లాభాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. క్యూ3లో

Most from this category