STOCKS

News


టీసీఎస్‌ షేరును ఏంచేద్దాం?

Wednesday 10th July 2019
Markets_main1562741995.png-26949

జూన్‌ త్రైమాసికంలో టీసీఎస్‌ ఫలితాలు అంచనాల కన్నా స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్‌లు టీసీఎస్‌ షేరుపై మిశ్రమ రికమండేషన్లు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు టీసీఎస్‌ను కొనొచ్చని చెబుతుంటే, మరికొన్ని అట్టిపెట్టుకోమని, కొన్నేమో వదిలించుకోమని సూచిస్తున్నాయి.

ఫలితాల నేపథ్యంలో షేరుపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి...
1. మోర్గాన్‌ స్టాన్లీ: ఈక్వల్‌ వెయిట్‌ రేటింగ్‌ కొనసాగింపు. టార్గెట్‌ రూ. 1980. ఫలితాల్లో ఆదాయ వృద్ధి అంచనాలను అందుకోలేదు. అయితే క్యు2లో మేనేజ్‌మెంట్‌ వృద్ధి లక్ష్యాన్ని సాధించగలదు. 
2. హెచ్‌ఎస్‌బీసీ: హోల్డ్‌ రేటింగ్‌ కొనసాగింపు. టార్గెట్‌ రూ. 1900. మంచి డీల్స్‌ గెలుచుకున్నా, వృద్ధి మందగమనం కనిపించింది. అయితే దీర్ఘకాలిక అవుట్‌లుక్‌ పాజిటివ్‌గా ఉంది. 
3. క్రెడిట్‌ సూసీ: న్యూట్రల్‌ రేటింగ్‌ కొనసాగింపు. టార్గెట్‌ రూ. 2000కు తగ్గింపు. స్వల్పకాలంలో అప్రమత్తత అవసరం.
4. సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు రేటింగ్‌ కొనసాగింపు. టార్గెట్‌ రూ. 2570కి కుదింపు. 
5. కోటక్‌ సెక్యూరిటీస్‌: రెడ్యూస్‌ రేటింగ్‌ కొనసాగింపు. టార్గెట్‌ రూ. 1940. ఈపీఎస్‌ అంచనాలను 3, 4శాతం మేర తగ్గించింది.
6. మోతీలాల్‌ ఓస్వాల్‌: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2100.
7. గోల్డ్‌మన్‌ సాక్స్‌: కొనొచ్చు రేటింగ్‌ కొనసాగింపు. టార్గెట్‌ రూ. 2329. ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని అభిప్రాయపడింది. 



You may be interested

చైనాతో తగ్గిన ద్వైపాక్షిక వాణిజ్యం

Wednesday 10th July 2019

ఈ ఏడాది ఐదు నెలల్లో 3.59 శాతం తక్కువ బీజింగ్‌: ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో చైనాతో, మన దేశ ద్వైపాక్షిక వాణిజ్యం 3.59 శాతం తగ్గి 36.87 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్టు చైనా కస్టమ్స్‌ విభాగం విడుదల చేసిన తాజా గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. వాణిజ్య లోటు 2017లో 51.72 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, అది 2018లో 57.86 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. తొలి ఐదు నెలల్లో చైనాకు

ఎఫ్‌పీఐలపై కక్షేమీ లేదు..

Wednesday 10th July 2019

 కావాలంటే కంపెనీ కేటగిరీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అధిక పన్నుభారంపై ఆర్థిక శాఖ వివరణ న్యూఢిల్లీ: బడ్జెట్‌లో అత్యంత సంపన్నులకు పన్ను భారం పెంచే ప్రతిపాదనలపై విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో కేంద్రం స్పందించింది. ఇది ప్రత్యేకంగా ఎఫ్‌పీఐలే లక్ష్యంగా చేసిన ప్రతిపాదన కాదని, విదేశీ ఇన్వెస్టర్లు కావాలంటే కార్పొరేట్‌ సంస్థ కింద నమోదు చేయించుకుని, తక్కువ పన్ను రేట్ల ప్రయోజనాలను పొందవచ్చని వివరణనిచ్చింది. "ఎఫ్‌పీఐలపైనే సర్‌చార్జీ పెంచడం

Most from this category