STOCKS

News


టీసీఎస్‌ ఎఫెక్ట్‌..నెగిటివ్‌ ప్రారంభం

Wednesday 10th July 2019
Markets_main1562731400.png-26934

ఐటీ దిగ్గజం, ఇండెక్స్‌ హెవీవెయిట్‌ టీసీఎస్‌ 2.5 శాతం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభంకావడంతో బుధవారం స్టాక్‌ సూచీలు నెగిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 పాయింట్ల క్షీణతతో 38,700 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల క్షీణతతో 11,536 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. క్రితం రోజు టీసీఎస్‌ ప్రకటించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి లోనుచేయడంతో ఈ షేరు 2.5 శాతం క్షీణతతో  రూ. 2,080 వద్ద మొదలయ్యింది. బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, హిందాల్కో షేర్లు 1-2 శాతం మధ్య నష్టాలతో ఆరంభంకాగా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కోల్‌ ఇండియా, యస్‌బ్యాంక్‌, గెయిల్‌ షేర్లు 1-3 శాతం మధ్య లాభాలతో ప్రారంభమయ్యాయి. 



You may be interested

65 డాలర్ల వద్ద బ్రెంట్‌ క్రూడ్‌

Wednesday 10th July 2019

అమెరికా చమురు నిల్వలు వరుసగా నాలుగో వారం కూడా పడిపోవడంతో బుధవారం(జులై 10) చమురు ధరలు 1 శాతం మేర పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 1.1 శాతం పెరిగి బ్యారెల్‌కు 64.85 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 58.73 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. 31 లక్షల బ్యారెల్లా చమురు నిల్వలు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తే అది 81 లక్షల బ్యారెల్లు తగ్గి 4,614 లక్షల

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 10th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  మన్‌పసంద్‌ బేవరీజెస్‌:- కంపెనీపై జీఎస్టీ అధికారులు దర్యాప్తు చేయడంతో కంపెనీకి ఆడిటర్‌ సేవలు అందిస్తున్న మెహ్రా గోయల్‌ అండ్‌ కో. రాజీనామా చేసింది.  కేఆర్‌బీఎల్‌:- కంపెనీ బ్యాంకు రుణసౌకర్య సదుపాయాలకు ఇక్రా రేటింగ్‌ సంస్థ ఎఎ(స్థిరత్వం) నుంచి ఎఎ(-)కు డౌన్‌గ్రేడ్‌ చేసింది.  ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌:- కంపెనీ ప్రధాన ప్రమోటర్లలలో ఒకరైన రాకేశ్‌ గంగ్వాల్‌ తన ఫిర్యాదులపై జోక్యం చేసుకోవాలని కోరుతూ సెబీకి లేఖ రాసారు.

Most from this category