News


కలిసిరాని ఫలితాలు...టీసీఎస్‌ 2 శాతం డౌన్‌

Friday 11th January 2019
Markets_main1547179510.png-23517

  • 2శాతం నష్టపోయిన షేరు

దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలు ఆ కంపెనీ షేరుకు కలిసిరాలేదు. ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఈ కంపెనీ షేరు ఏకంగా 2శాతం నష్టపోయింది. ఈ క్యూ3లో టీసీఎస్‌ లాభాల పంటపండిచినప్పటీకి కంపెనీ షేరు మాత్రం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు ఎన్‌ఎస్‌లో 1శాతం నష్టంతో రూ.1870ల వద్ద షేరు ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఉదయం గం.9:25ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.1888.55)తో పోలిస్తే 2శాతం నష్టంతో రూ.1850 ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి 20లక్షల వాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవుతోంది. డిసెంబర్‌ క్వార్టర్‌లో అధిక మొత్తంలో ఆర్డర్లను సాధించిన నేపథ్యంలో ఈ క్యూ3లో కంపెనీ లాభం 24.1 శాతం ఎగిసి రూ. 8,105 కోట్లకు పెరిగింది. ఈ క్యూ3లో కంపెనీ లాభం 24.1 శాతం ఎగిసి రూ. 8,105 కోట్లకు పెరిగింది. ఆదాయం 20.8 శాతం వృద్ధితో రూ. 37,338 కోట్లకు ఎగిసింది. మూడో మధ్యంతర డివిడెండ్‌ కింద షేరు ఒక్కింటికి రూ. 4 చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. డివిడెండ్‌కు సంబంధించి రికార్డు తేదీ జనవరి 18 కాగా, చెల్లింపు తేదీ జనవరి 24గా ఉంటుందని పేర్కొంది.


TCS

You may be interested

డాలర్‌ పతనంతో పసిడి వెలుగులు

Friday 11th January 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 6 డాలర్లు లాభపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత పసిడికి ర్యాలీకి తోడ్పాటు అందిస్తుంది.  ఆసియా మార్కెట్లో గురువారం ఉదయం గం.10:00ని.లకు ఔన్స్‌ పసిడి ధర 6డాలర్లు లాభపడి 1,293 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లను పెంచకపోవచ్చనే అంచనాలతో డాలర్‌ బలహీనపడింది. బలహీనపడి డాలర్‌,

స్వల్పలాభాలతో ప్రారంభం

Friday 11th January 2019

సెన్సెక్స్‌ 85 పాయింట్లు, నిఫ్టీ 13 పాయింట్లు అప్‌ ఆసియా మార్కెట్లు సానుకూల ట్రేడింగ్‌ ప్రభావంతో భారత్‌ మార్కెట్‌ శుక్రవారం స్వల్పలాభాలతో మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 85 పాయింట్ల లాభంతో 36,192 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల పెరుగుదలతో 10,834 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. క్రితం రోజు మార్కెట్‌ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన ఐటీ దిగ్గజం టీసీఎస్‌ 1 శాతం నష్టంతో రూ. 1,870 వద్ద ట్రేడింగ్‌

Most from this category