STOCKS

News


టాటా స్టీల్‌ 6 శాతం జంప్‌

Friday 26th April 2019
Markets_main1556265907.png-25368

గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసికపు(జనవరి-మార్చి) ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో టాటా స్టీల్‌ కంపెనీ షేర్లు శుక్రవారం లాభాల బాట పట్టాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.520.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్చి క్వార్టర్‌లో కంపెనీ రూ.2,295.25 నికరలాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.33, 984 కోట్ల నుంచి రూ.42, 914లకు పెరిగింది. ఎబిటా రూ.5,857లు నుంచి రూ.7,184 కోట్లకు పెరిగింది. ఒక్కొక్క ఈక్విటీ షేరుకు రూ.13ల డివిడెండ్‌ను ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఫలితాలు ఆశాజనకంగా నమోదుకావడంతో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్ల కొనుగోళ్లతో మొగ్గు చూపడంతో ఇంట్రాడే కంపెనీ షేరు 6.75శాతం లాభపడి రూ.545.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ గతముగింపు(రూ.510.9)తో పోలిస్తే 6శాతం లాభంతో రూ.542ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్లలో మొదటి స్థానంలో ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.442.10, రూ.646.70లుగా నమోదయ్యాయి.



You may be interested

3వారాల గరిష్టానికి ఐసీఐసీఐ బ్యాంకు

Friday 26th April 2019

ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు షేరు శుక్రవారం 3వారాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.400.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తన సహచర ప్రైవేట్‌ రంగ బ్యాంకు కోటక్‌ యాక్సిక్‌ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో ఈ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు కూడా ఆశించన స్థాయిలో నమోదు కావచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు 2.50శాతం పెరిగి రూ.405ల వద్ద ఇంట్రాడే

పసిడికి బలహీన గణాంకాల మద్దతు

Friday 26th April 2019

బలహీన అమెరికా ఆర్థిక గణాంకాల మద్దతుతో పసిడి ధర 4నెలల గరిష్టస్థాయి నుంచి క్రమంగా రివకరి బాట పట్టింది. ఆసియాలో శుక్రవారం ఔన్స్‌ పసిడి ధర 4డాలర్లు లాభపడి 1,284 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా నిన్న రాత్రి విడుదల చేసిన నిరుద్యోగ గణాంకాలు మార్కెట్‌ అంచనాల్ని అందుకోలేకపోగా, గతవారంలో అదనంగా 37,000 మంది ఉపాధి కోల్పోయినట్లు ప్రకటించింది. అలాగే  ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలరు ఇండెక్స్‌

Most from this category