STOCKS

News


టాటా మోటర్స్‌ ర్యాలీ

Tuesday 6th November 2018
Markets_main1541492079.png-21756

అక్టోబర్‌ నెలలో జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌) అమ్మకాలు దాని మాతృ సంస్థ టాటామోటర్స్‌ షేరుకు జోష్‌నిచ్చాయి. ఫలితంగా టాటామోటర్స్‌ షేరు మంగళవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 5శాతం లాభపడింది. నేడు టటా మోటర్స్‌ షేరు రూ.192ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అక్టోబర్‌లో జాగ్వార్‌ లేండ్‌రోవర్‌ అమ్మకాలు ఇది 32శాతం వృద్ధి చెంది 6942 యూనిట్లకు పెరిగినట్లు టాటామోటర్స్‌ ప్రకటించింది. గత సెప్టెంబర్‌లో అమ్మకాలు 5270 యూనిట్ల మాత్రమే నమోదయ్యాయి. జాగ్వార్‌ వాహన అమ్మకాలు సైతం 82 శాతం వృద్ధి చెంది 3324 యూనిట్ల విక్రయించినట్లు తెలిపింది. వాహన అమ్మకాలు ఊపందుకోవడంతో  టాటా మోటార్స్‌ షేరు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఫలితంగా షేరు నేడు షేరు 5శాతం లాభపడి రూ. 199.30ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.189.65)తో 3.50శాతం లాభపడి రూ.196.75ల వద్ద ‍ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.164.55లు రూ.466.95లుగా నమోదయ్యాయి.



You may be interested

నిఫ్టీ 9,500లకు వస్తే కొనేయండి..

Tuesday 6th November 2018

లిక్విడిటీ సమస్యలు, రాజకీయ అస్థిరతల కారణంగా నిఫ్టీ-50 ఇండెక్స్‌ 9,500 స్థాయికి పడిపోతే అప్పుడు కళ్లు మూసుకొని స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని మార్కెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఫౌండర్‌ సౌరభ్‌ ముఖర్జీ తెలిపారు. 9,500 స్థాయిలో రాజకీయ పరిస్థితులు, క్రూడ్‌ ధరల వంటి ఇతర అంశాల గురించి ఆలోచించాల్సిన పనిలేదని పేర్కొన్నారు. కాగా నిఫ్టీ గత రెండు నెలల కాలంలో దాదాపు 10 శాతానికిపైగా పడిపోయి మళ్లీ రీబౌండ్‌ అయ్యింది. బ్రెంట్‌

గోల్డ్‌ ఈటీఎఫ్‌ల జోలికొద్దు..

Tuesday 6th November 2018

టైటాన్‌ ఇండస్ట్రీస్‌ బెస్ట్‌.. వ్యాల్యు రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌ వ్యాఖ్య గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు దూరంగా ఉండటం ఉత్తమమని సూచిస్తున్నారు వ్యాల్యు రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌. బంగారంపై ఇన్వెస్ట్‌ చేయాలని భావించే వారు టైటాన్‌ ఇండస్ట్రీస్‌ షేరు కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. పసిడిలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఆనందం పొందలేమన్నారు. గోల్డ్‌ను ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనంగా చూడకూడదని అభిప్రాయపడ్డారు. బంగారంలో వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని తెలిపారు. అయితే సావరిన్‌ గోల్డ్‌

Most from this category