STOCKS

News


టాటామోటర్స్‌కు రేటింగ్‌ షాక్‌..!

Wednesday 5th December 2018
Markets_main1543993810.png-22660

  • 3.50శాతం నష్టపోయిన షేరు

అటోమెబైల్‌ దిగ్గజం టాటా మోటర్స్‌ షేర్లకు బుధవారం రేటింగ్‌ షాక్‌ తగిలింది. తన అనుబంధ బ్రిటన్‌ సంస్థ  జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) రేటింగ్స్‌ను.... రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో టాటా మోటర్స్‌ కంపెనీ షేర్లు 3.50శాతం నష్టపోయాయి. ఆదాయాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడంతో ఎస్‌అండ్‌పీ సంస్థ... కంపెనీ ‘‘రుణ రేటింగ్‌’’ను బిబి స్థాయి నుంచి బిబి నెగిటివ్‌ స్థాయికి కుదించినట్లు టాటామోటర్స్‌ తెలిపింది. అలాగే జేఎల్‌ఆర్‌ నిర్వహణ పనితీరు బలహీనంగా ఉండొచ్చనే కారణంతో మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ గతనెల ‘‘స్థిరత్వం’’ నుంచి ‘‘ప్రతికూలం’’కు మార్చింది. రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌తో ఇన్వెస్టర్లు టాటామోటర్స్‌ షేరు అమ్మకాలకు మొగ్గు చూపడంతో కంపెనీ షేరు 3.50శాతం నష్టపోయి రూ.169.95ల ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గతముగింపు(రూ.175.7)తో పోలిస్తే 3శాతం నష్టంతో రూ.170ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.164.55 రూ.443.55లుగా ఉన్నాయి.



You may be interested

నష్టాల్లో ఫార్మా షేర్లు

Wednesday 5th December 2018

కీలక వడ్డీరేట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం కోసం ఇన్వెస్టర్ల నిరీక్షణ నేపథ్యంలో మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి నష్టాలతో ట్రేడ్‌ అవుతోంది. సూచీల నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా ఫార్మా షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఎన్‌ఎస్‌స్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు ఫార్మా ఇండెక్స్‌ గతముగింపుతో పోలిస్తే 1.25శాతం నష్టంతో 8,955.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలోకి మొత్తం10 షేర్లలో

బ్యాంకులకు మాల్యా కొత్త ఆఫర్‌

Wednesday 5th December 2018

ప్రత్యక్షంగా బ్యాంకులకు పరోక్ష్యంగా దేశ ప్రజానీకానికి కుచ్చు టోపి పెట్టి విదేశానికి పరారైన విజయ్‌ మాల్యా పంథం మార్చుకున్నట్లున్నారు. ఈయన శ్రీమంతుడు సినిమాలోని ‘తిరిగిచ్చేయాలి లేకపోతే లావైపోతారు’ అనే డైలాగ్‌ విన్నారో ఏమో కానీ.. బ్యాంకుల దగ్గర తీసుకున్న రూ.5,500 కోట్లను (ఆసలు మాత్రమే వడ్డీ కాదు) తిరిగి చెల్లిచేస్తానంటూ ట్వీట్‌ చేశారు. తీసుకున్న రుణాలను చెల్లించకుండా దేశం విడిచి పారిపోయిన మాల్యా గత రెండేళ్లుగా యూకేలో నివసిస్తున్న విషయం

Most from this category