STOCKS

News


నష్టాల బాటలో టాటామోటర్స్‌ షేర్లు

Monday 12th November 2018
Markets_main1542010996.png-21902

టాటా మోటార్స్‌ షేరు సోమవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో నష్టాల బాట పట్టింది. అక్టోబర్‌లో తన అనుబంధ సంస్థ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమైంది. నేడు షేరు బీఎస్‌ఈలో రూ.195.4ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. జేఎల్‌ఆర్‌ వాహన విక్రయాలు ఆశించినస్థాయిలో లేకపోవడంతో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు 5శాతం నష్టపోయి రూ.186.15ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.195.4)తో పోలిస్తే 4శాతం నష్టంతో రూ.186.90ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.164, రూ.443లుగా నమోదయ్యాయి.


జేఎల్‌ఆర్‌ అక్టోబర్‌ అమ్మకాలు:-
అంతర్జాతీయ మార్కెట్లో మొత్తం అమ్మకాలు 4.6శాతం క్షీణించాయి. ఈ అక్టోబర్‌లో 44, 282 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది. చైనాలో అమ్మకాలు 49 శాతం, యూరప్‌లో 13.5శాతం అమ్మకాలు పడిపోయాయి. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 7శాతం క్షీణిస్తాయి. ముడిచమురు పెరుగుదల కారణంగా ప్రస్తుత త్రైమాసికంలో వాహన విక్రయాలు మరింత తగ్గవచ్చు’’ అని నోమురా ఒక ప్రకటనలో తెలిపింది.



You may be interested

35వేల దిగువకు సెన్సెక్స్‌

Monday 12th November 2018

మిడ్‌సెషన్‌ అనంతరం మార్కెట్లో అమ్మకాలు పెరగడంతో సూచీలు భారీ నష్టాల దిశగా సాగుతున్నాయి. సెన్సెక్స్‌ సూచీ 200 పాయింట్లను క్షీణించి 35 వేల దిగువకు చేరుకుంది. నిఫ్టీ సూచీ 60 పాయింట్లకు పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు సెన్సెక్స్‌ 210 పాయింట్ల నష్టంతో 34985 వద్ద, నిఫ్టీ సూచీ 50 పాయింట్లను కోల్పోయి 10,510 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. నేటి ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమైనప్పటికీ..,  కీలకమైన రిటైల్‌ ద్రవ్యోల్బణం,

మీకోసం.. టాప్‌-12 గ్రోత్‌ స్టాక్స్‌..

Monday 12th November 2018

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో అరుణ్‌ తుఖ్రాల్‌ తాజాగా సమర్ధవంతమైన మేనేజ్‌మెంట్‌ను కలిగిన, వచ్చే ఏడాది కాలం లక్ష్యంతో ఇన్వెస్ట్‌మెంట్‌కు అనువైన టాప్‌-12 గ్రోత్‌-ఓరియెంటెడ్‌ స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం..  ► అశోక్‌ లేలాండ్‌: రెండో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ కంపెనీ. వాణిజ్య వాహన విక్రయాలు పుంజుకోవడటం సానుకూల అంశం. కంపెనీ అన్ని విభాగాల డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకుంటోంది.  ► బజాజ్‌ ఫైనాన్స్‌: మంచి డైవర్సిఫైడ్‌ ఎన్‌బీఎఫ్‌సీలలో ఇది

Most from this category