STOCKS

News


టాటామోటర్స్‌ రివర్స్‌ గేర్‌..!

Friday 30th November 2018
Markets_main1543563825.png-22523

  • 4శాతం నష్టపోయిన టాటామోటర్స్‌ షేరు

దేశీయ ఆటోరంగ దిగ్గజం టాటామోటర్స్‌ షేరు శుక్రవారం 4శాతం నష్టపోయింది. చైనాలో డిజిల్‌ కార్ల డిమాండ్‌ తగ్గడం, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడం తదితర అంశాలతో టాటామోటర్స్‌ యూకే అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ మోటర్స్‌ తమ ఉత్పత్తులను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఇంగ్లాండ్‌లోని తన ప్రధాన తయారీ ఇంజన్ల కార్మాగారం వోల్వెర్హాంప్టన్ యూనిట్‌ నుంచి 500 మంది ఉద్యోగులకు తాత్కలిక ఉద్వాసన పలికేందుకు సిద్ధమైనట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు విదేశీ బ్రోకరేజ్‌ సంస్థ యూబీఎస్‌ టాటామోటర్స్‌ షేరు రేటింగ్స్‌ను ‘‘కొనుగోలు’’ నుంచి ‘‘న్యూట్రల్‌’’ స్థాయికి తగ్గించింది. అలాగే షేరు టార్గెట్‌ ధరను రూ.280ల నుంచి రూ. 200లకు పరిమితం చేసింది. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో టాటామోటర్స్‌ షేరు నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలో 4శాతం నష్టపోయి రూ. 170.50ల వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:00లకు సూచీ గత ముగింపు ధర(రూ.177.3)తో పోలిస్తే 3శాతం నష్టంతో 172.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నవంబర్‌ 13 తరువాత షేరు పతనం ఇంతస్థాయిలో జరగడం ఇదే ప్రథమం. ఈ ఏడాది కాలంలో టాటామోటర్స్‌ షేరు 59శాతం నష్టపోయింది.You may be interested

నిఫ్టీకి ఇదే కీలక స్థాయి..

Friday 30th November 2018

 నిఫ్టీ నవంబర్‌ సిరీస్‌ను 10,100 స్థాయి వద్ద ప్రారంభించిందని కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (డెరివేటివ్స్‌ రీసెర్చ్‌) సహజ్‌ అగర్వాల్‌ తెలిపారు. 10,004 కనిష్ట స్థాయిని తాకిన తర్వాత మళ్లీ పుంజుకుందని, ఇప్పుడు 10,800 మార్క్‌కు అటుఇటుగా ట్రేడవుతోందని పేర్కొన్నారు. సిరీస్‌ ప్రారంభంలో నిఫ్టీ లాభాల్లో ఉన్నా కూడా, మధ్యలో కన్సాలిడేషన్‌ చోటుచేసుకుందని, అటుపై మళ్లీ పెరుగుదల కనిపించిందని, ముగింపునకు వచ్చేసరికి దాదాపు 7 శాతం మేర ఎగసిందని వివరించారు.

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Friday 30th November 2018

బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లు నష్టాల్లోకి మళ్లడంతో శుక్రవారం ట్రేడింగ్‌ సమయానికి సూచీలు ఆరంభ నష్టాల్ని కోల్పోయాయి. మెటల్‌ షేర్లు ఈవారంలో వరుసగా నాలుగురోజులు ర్యాలీ చేయడంతో ఈ రంగ షేర్లలో నేడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గతముగింపు(3,177.25)తో పోలిస్తే 0.50 అరశాతం నష్టంతో 3,161 వద్ద ట్రేడ్‌

Most from this category