STOCKS

News


ట్రేడ్‌ వార్‌ ఎఫెక్ట్‌: టాటామోటర్స్‌ 4శాతం డౌన్‌

Monday 25th June 2018
Markets_main1529911644.png-17709

ముంబై:- ట్రేడ్‌ వార్‌ సెగలు టాటా మోటర్స్‌ షేరును తాకడంతో ఈ కంపెనీ షేరు సోమవారం 4శాతానికి పైగా పతనమైంది. నేడు బీఎస్‌ఈ టాటామోటర్స్‌ రూ. 295.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం ఐరోపా నుంచి దిగుమతి అవుతున్న అన్ని కార్లపై 20 శాతం సుంకం విధిస్తామని ట్వీట్‌ చేశారు. ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో బ్రిటన్‌లో టాటామోటర్స్‌ ప్రధాన అనుబంధ సం‍స్థ జాగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌ ఇండియా (జేఎల్‌ఆర్‌) కంపెనీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా నేడు టాటామోటర్స్‌ షేరు బీఎస్‌ఈలో 4.20శాతానికి పైగా  నష్టపోయి రూ.295.20ల కనిష్టధరకు పతనమైంది. మధ్యాహ్నం గం.12:30నిలకు షేరు గతముగింపు ధర(రూ.308.15)తో పోలిస్తే 3.65శాతం నష్టపోయి రూ.296.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ఇదే సమయానికి 3.62శాతం నష్టపోయి ఎన్‌ఎస్‌ఈలో టాప్‌-5 లూజర్స్‌లో ప్రథమస్థానంలో ట్రేడ్‌ అవుతోంది. మే 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2017-18)లో టాటామోటర్స్‌ కంపెనీ ఆర్జించిన మొత్తం ఆదాయం రూ.రూ.4,336 కోట్లలో జాగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌ వాటా 77శాతంగా ఉండటం విశేషం.



You may be interested

ఐసీఐసీఐ బ్యాంక్‌ 3 శాతం డౌన్‌

Monday 25th June 2018

ముంబై:- 31 రుణ ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు అఙ్ఞాత వ్యక్తి ఫిర్యాదుతో ప్రైవేట్‌రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ షేరు సోమవారం 3శాతానికి పైగా నష్టపోయింది. నేడు ఐసీఐసీఐ షేరు ఇంట్రాడేలో రూ.300.85ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 2018 మార్చిలో 31 రుణ ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు ఓ అఙ్ఞాత వ్యక్తి     ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపి మధ్యంతర నివేదికను నియంత్రణ సంస్థకు సమర్పించినట్టు ఐసీఐసీఐ

రిటైర్మెంట్‌కు ఎంత అవసరం

Monday 25th June 2018

25 ఏళ్ల నుంచి వ్యక్తి వేతనంలో   5 శాతం కేటాయింపులు ఉత్తమం కాంపౌండింగ్‌  ప్రయోజనంతో మంచి నిధి ఆలస్యంగా పొదుపు ప్రారంభిస్తే  జీవన వ్యయ భారాల అడ్డంకులు    ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు పదవీ విరమణ దశకు చేరుకునేవారే. ఆ తర్వాత జీవితం గురించి ప్లాన్‌ చేసుకునే వారు కొద్ది మందే కనిపిస్తారు. ఇక విశ్రాంత జీవిత అవసరాల పట్ల శద్ధ లేకపోవడం, ప్రస్తుత అవసరాలే ప్రాధాన్యంగా భావించే వారు చాలా మంది ఉన్నారు.

Most from this category