STOCKS

News


టాటామోటర్స్‌ షేర్ల ర్యాలీ

Monday 15th April 2019
Markets_main1555309878.png-25135

కొద్దిరోజులుగా పరుగులు తీస్తున్న టాటా మోటార్స్‌ షేరు సోమవారం సైతం జోరు చూపించింది. ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే 4 శాతం జంప్‌చేసింది. నేడు టాటామోటర్స్‌ కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో రూ.216.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో షేరు ఇంట్రాడేలో దాదాపు 5శాతం ర్యాలీ చేసి రూ. 226.45ల గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:45ని.లకు షేరు గతముగింపు ధర(రూ.215.85)తో పోలిస్తే 4.50శాతం లాభంతో రూ.226.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌లో సైతం 4.50శాతం లాభంతో నిఫ్టీ - 50 ఇండెక్స్‌లో టాప్‌ -5 లూజర్లలో మొదటిస్థానంలో ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.141.90లు రూ.363.95లుగా నమోదయ్యాయి. 
ఇక ఇదే సమయానికి బెంచ్‌మార్క్‌ సూచీలైన
సెన్సెక్స్‌ 89 పాయింట్ల లాభంతో 38856.57 వద్ద, నిఫ్టీ 30.7 పాయింట్ల లాభంతో 11674.15 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఫార్మా రంగ షేర్లు తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా మెటల్‌ షేర్లు లాభపడ్డాయి.



You may be interested

టీసీఎస్‌? ఇన్ఫోసిస్‌?.. ఏది బెటర్‌?

Monday 15th April 2019

శుక్రవారం ఐటీ దిగ్గజాల ఫలితాలతో క్యు4 సీజన్‌ ఆరంభమైంది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ అంచనాల కన్నా మంచి ఫలితాలే ప్రకటించినా, మార్జిన్ల పరంగా టీసీఎస్‌ మెరుగ్గా కనిపించింది. ఈ నేపథ్యంలో రెండు కంపెనీల ఫలితాలు, షేరు భవితవ్యంపై బ్రోకరేజ్‌లు, నిపుణుల అంచనాలు ఇలా ఉన్నాయి... షేర్‌ఖాన్‌: రెండు కంపెనీల షేర్లకు కొనొచ్చు రేటింగ్‌. టీసీఎస్‌ టార్గెట్‌ రూ. 2400. ఇన్ఫోసిస్‌ టార్గెట్‌ రూ. 840. టీసీఎస్‌ ఫలితాలు ఇన్ఫీ కన్నా బాగున్నాయి. ఇన్ఫోసిస్‌

పెట్టుబడికి పుత్తడి పనికిరాదా ?

Monday 15th April 2019

ప్ర: ఎస్‌బీఐ గోల్డ్‌ఫండ్‌లో 2012లో కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేశాను. ఈ ఫండ్‌కు సంబంధించి గ్రోత్‌ ఆప్షన్‌ డైరెక్ట్‌ ప్లాన్‌ను ఎంచుకున్నాను. ఈ ఫండ్‌ ఎన్‌ఏవీ ఆరంభంలో ఎంత ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ఆరంభం నుంచే ఈ ఫండ్‌ ఎన్‌ఏవీను గమనిస్తున్నాను. ఈ ఫండ్‌ గరిష్ట ఎన్‌ఏవీ రూ.10.82 మాత్రమే. ఎన్‌ఏవీలో ఎలాంటి  ఎదుగూ, బొదుగూ లేకపోవడం నష్టమేగా ! ఈ ఫండ్‌ నుంచి వైదొలగమంటారా ? -ధనుంజయ్‌,

Most from this category