STOCKS

News


6నెలల గరిష్టానికి టాటామోటర్స్‌

Wednesday 10th April 2019
Markets_main1554883803.png-25053

జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ వ్యాపారంలో వృద్ధితో మాతృసంస్థ టాటామోటర్స్‌ మార్జిన్లు పెరగవచ్చనే అంచనాలతో కంపెనీ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 6నెలల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు రూ. 206.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతివ్వడంతో షేరు 4.50శాతం ర్యాలీ చేసి రూ.212.40ల ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గతేడాది అక్టోబర్‌ 10 తరువాత షేరు ధర ఈ స్థాయిని తిరిగి అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. గత చివరి మూడు వారాల్లో కంపెనీ షేర్లు 25శాతం ర్యాలీ చేశాయి. గతేడాది చివరి త్రైమాసిక ఫలితాల్లో తన అనుబంధ సం‍స్థ జేఎల్‌ఆర్‌ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధిస్తుందని కంపెనీ గత మార్చి 29న ప్రకటించిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గతముగింపు ధర(రూ.206)తో పోలిస్తే 3.50శాతం లాభంతో రూ.213.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.141.90 రూ.368.40లుగా ఉన్నాయి.



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కౌంటర్లో బ్లాక్‌డీల్‌

Wednesday 10th April 2019

ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 2శాతం నష్టపోయాయి. ఎక్స్ఛేంజీలలో బ్లాక్‌డీల్స్‌ ద్వారా భారీ పరిమాణంలో షేర్లు చేతులు మారడంతో షేరు పతనానికి కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.2255.00ల ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కేకేఆర్‌ అండ్‌ కో.. ఈ కంపెనీ చెందిన సుమారు 1.14 కోట్ల ఈక్విటీ షేర్లను బ్లాక్‌డీల్‌ పద్దతిలో విక్రయించిందనే వార్తలు వెలుగులోకి రావడంతో

ఆర్‌ఐఎల్‌కు కొనొచ్చు రేటింగ్‌!

Wednesday 10th April 2019

దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుకు అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ కొనొచ్చు రేటింగ్‌ను ఇచ్చింది. టార్గెట్‌ ధర రూ. 1500గా పేర్కొంది. గత ఏడాదిలో సూచీల్లో మంచి లాభాలను నమోదు చేసిన లార్జ్‌క్యాప్స్‌లో ఆర్‌ఐఎల్‌ ఒకటి. కేవలం గత మూడు నెలల్లో షేరు 20 శాతం ర్యాలీ జరిపింది. ఏడాది కాలంలో 46 శాతం మేర దూసుకుపోయింది. సంస్థాగత రిటైల్‌ మార్కెట్లోని పెద్ద కంపెనీల్లో ఆర్‌ఐఎల్‌ ఒకటని

Most from this category