News


ఏడేళ్ల కనిష్టానికి టాటా మోటార్స్‌

Tuesday 9th October 2018
Markets_main1539065616.png-20971

తగ్గిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ అమ్మకాలు
టాటా మోటార్స్‌ షేరు మంగళవారం ఏడేళ్ల కనిష్టానికి చేరుకుంది. తన అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ సెప్టెంబర్‌ అమ్మకాలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమైంది. ఈ సెప్టెంబర్‌లో జేఎల్‌ఆర్‌ ప్రపంచ అమ్మకాలు 12.3శాతానికి క్షీణించాయి. మరోవైపు ఇటీవల కాలంలో అటోరంగ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు టాటామోటర్స్‌ షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే షేరు 14శాతం నష్టపోయి రూ.183.00ల స్థాయిని పతనమైంది. ఇది ఈ షేరుకు ఏడేళ్ల కనిష్టస్థాయి. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు(రూ.212.75) ధరతో పోలిస్తే 13శాతం నష్టంతో రూ.185.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు రూ.183.00 రూ.466.95లుగా నమోదయ్యాయి. ఏడాది కాలంలో టాటా మోటర్స్‌ షేరు 43 శాతం నష్టపోయింది.
తగ్గిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ అమ్మకాలు:-
జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవ‌ర్ సెప్టెంబర్‌ నెల‌ అమ్మకాలు 12.3శాతం తగ్గాయి. గత నెలలో సంస్థ మొత్తం 57,114 యూనిట్లను విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే విక్రయాలు 12.3 శాతం క్షీణించాయి. ముఖ్యంగా చైనాలో మందగించిన ఆర్థిక వృద్ధి, కొంతకాలంగా చైనా-అమెరికా దేశాల మధ్య నడుస్తున్న ట్రేడ్‌వార్‌ కంపెనీ విక్రయాలపై భారీగా ప్రభావాన్ని చూపినట్లు కంపెనీ తెలిపింది. ఒక్క చైనాలోనే ఈ సెప్టెంబర్‌లో జేఎల్‌ఆర్‌ వాహన విక్రయాల్లో 46 శాతంపైగా క్షీణించాయి. ట్రేడ్‌వార్‌ నేపథ్యంలో ప్రపంచమార్కెట్లలో నెలకొన్న అనిశ్చితులు, వివిధ దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధభయాలు తమ వాహనాలకు డిమాండ్‌ తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది.



You may be interested

10100 పాయింట్ల వద్ద కీలక మద్దతు

Tuesday 9th October 2018

గతవారమంతా నేల చూపులు చూస్తున్న సూచీలు సోమవారం కాస్త ఊపిరితీసుకున్నాయి. అయితే గతవారం ప్రధాన సూచీలు తమ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. రూపీలో బలహీనత, క్రూడాయిల్‌ ధర పెరుగుదల, ఎన్‌బీఎఫ్‌సీల గోల, ఆర్‌బీఐ రేట్లు యథాతధంగా ఉంచడం.. మార్కెట్లను కుంగదీశాయి. అది, ఇది అని తేడా లేకుండా అన్ని రంగాలు పతనాన్ని నమోదు చేశాయి. ఈ వారం నుంచి కంపెనీల క్యు2 ఫలితాల సీజన్‌ ఆరంభం కానుంది. ఈ

భారీగా క్షీణించిన వెండి బంగారాలు.!

Tuesday 9th October 2018

ముంబై:- అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో సోమవారం రాత్రి పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అమెరికా ట్రేడింగ్‌లో ఔన్సు బంగారం ధర 12 డాలర్ల మేర క్షీణిం‍చి 1,188 డాలర్ల వద్దకు చేరడం, వెండి ధర కూడా 2 శాతంపైగా పడిపోవడంతో పాటు గతరాత్రి ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి తొలిసారిగా 74స్థాయికి పైన ముగిసింది. ఫలితంగా గత రాత్రి ఎంసీఎక్స్‌లో 10గ్రాముల ధర ధర

Most from this category